Pages

Wednesday, September 19, 2012

ఎవరు గొప్ప?


బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కాశీరాజు కుమారుడై జన్మించాడు. ఆయన తక్షశిలకు వెళ్ళి పదహారేళ్ళు నిండే లోపుగానే సమస్త శాస్ర్తపురాణాలన్నీ చదివేశాడు. కొన్నేళ్ళకు తండ్రి మరణించడంతో ఆయన కాశీ దేశానికి రాజై, ఏ మాత్రమూ ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు. ఆయన పరిపాలనలో ప్రజలు ఎలాంటి బాధలూ, అన్యాయూలూ, అక్రమాలూ లేకుండా సుఖజీవనం గడుపుతూ రావటం చేత, న్యాయస్థానం పూర్తిగా పనిలేకుండా పాడుబెట్టినట్టయిపోయింది.
ఎన్ని ఏళ్ళు గడిచినా రాజాస్థానానికి ఒక్కడూ రాడు, ఫిర్యాదు చెయ్యడు. ప్రజలలో ఎట్టి ఆందోళనా లేకపోవటంచేత రాజుకు తన వల్ల ఏ లోపాలు జరుగుతున్నదీ, తనను గురించి ప్రజలేమనుకుంటున్నదీ తెలియ లేదు. కనీసం వ్యాజ్యాల మీద ఆస్థానానికి వచ్చిపోయే వారున్నా వారి ద్వారా రాజు తన లోపాలు తెలుసుకోవటానికి వీలుండేది; కాని, ఆస్థానంకేసి తొంగి చూసే వాళ్ళే కరువయ్యూరు.
అందుచేత ఒకనాడు రాజు బాగా ఆలోచించి తన రథం ఎక్కి కాశీ నగరమంతా తిరుగుతూ, కనిపించినవారినల్లా, ‘‘నా పరిపాలనలో మీకేం లోపాలు కనిపించాయి?'' అని అడగసాగాడు. కాని ఎంతమంది నడిగినా ప్రతి ఒక్కరూ, ‘‘మేము తమ పరిపాలనలో ఏ కొరతా లేకుండా చాలా సుఖంగా ఉన్నాం, మహారాజా! మాకు ఎలాంటి లోపమూ కనిపించటం లేదు!'' అని చెబుతూ వచ్చారు. అప్పటికీ రాజుకు తృప్తి కలగలేదు.

 ఆయన తన రాజలాంఛనాలన్నీ తీసివేసి, సామాన్యుడి వేషంలో రథం మీద నగరం దాటి పల్లెపట్టుల వెంట ప్రయూణం చేస్తూ, తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వినటానికి పూనుకున్నాడు. ఆయన ఎన్ని గ్రామాలకు వెళ్ళినా, కాశీరాజు గురించి పల్లెత్తు ఆక్షేపణ ఎక్కడా వినపడలేదు. చివరకు రథం రాజ్యపు సరిహద్దు చేరుకుని సరిహద్దు బాట వెంబడి తిరిగి రాజధానికి వస్తున్నది.
ఆ సమయంలో కాశీ రాజెక్కిన రథానికి మరొక రథం ఎదురు వచ్చింది. రెండు రథాలూ ఒకదాన్నొకటి తప్పుకుపోయే అవకాశం లేదు. ఎందుకంటే, అది ఒక రథం మాత్రమే వెళ్ళగలిగినంత ఇరుకు బాట. దానికి రెండు పక్కలా ఎత్తయిన గట్లున్నాయి. రెండు రథాలూ ఒకదానికొకటి అంత దూరంలో ఆగాయి. ‘‘మేము ముందుకు వెళ్ళాలి! మెల్లగా నీ రథాన్ని వెనక్కు తిప్పుకో!'' అన్నాడు కాశీరాజు సారథి.
‘‘నన్ను రథం తిప్పమనటానికి నీకేమి అధికారం ఉన్నది? నువ్వే నీ రథాన్ని వెనక్కు తిప్పు!'' అన్నాడు రెండవ రథంలోని సారథి. ఇద్దరు సారథులూ కోపావేశంతో వాదులాటకు దిగారు. ‘‘ఈ రథంలో ఉన్నదెవరో తెలుసా? కాశీరాజుగారు!'' అన్నాడు కాశీరాజు సారథి పట్టరాని కోపంతో. ‘‘ఈ రథంలో ఉన్నది కోసల రాజుగారు!'' అన్నాడు రెండవరథం తోలేవాడు ఏమాత్రం తొణక్కుండా.


కోసల రాజ్యం కూడా కాశీరాజ్యం అంత పెద్దదే. వయసులోనూ, చదువులోనూ కోసల రాజైన మల్లికుడు కాశీరాజుకు సరిసమానుడు. ఆయన కూడా తన దేశమంతా తిరిగి, ప్రజల అభిప్రాయం విని, తనవల్ల తప్పులున్నట్టయితే సరిచేసుకునే ఉద్దశంతో మారు వేషంలో బయలుదేరినవాడే. ‘‘మీ రాజుగారిలోని ఆధిక్యత ఏమిటి?'' అని అడిగాడు కాశీరాజు సారథి.
దానికి కోసలరాజు సారథి వెంటనే ఈ విధంగా జవాబు చెప్పాడు: దళహం దళహస్య ఖిపతిమల్లికో ముదునా ముదుల, సాధుంపి సాధునా జేతి అసాధుంపి అసాధునా, ఏతాదిసో అయం రాజా ముగ్గా ఉయ్యూహి సారథి [ఘమా మల్లిక మహారాజుగారు దుష్టులకు దుష్టుడు, సజ్జనులకు సజ్జనుడు. మంచితనాన్ని మంచితనంతో బహూకరిస్తాడు. దుర్మార్గాల్ని దుర్మార్గంతో నిగ్రహిస్తాడు.]
్ఙ ఇది వింటూనే కాశీరాజు సారథి ఈ విధంగా జవాబిచ్చాడు: అక్కోధేన జినే కోధం అసాధుం సాధునా జినే, జినే కదరియం దానేన సచ్చేన అలివాదినం ఏతాదిసో అయం రాజా మగ్గా ఉయ్యూహి సారథి ్ఢ్ఢ [ఘమా మహారాజు ఆగ్రహాన్ని శాంతంతో జయిస్తాడు; దుర్మార్గాన్ని సాధుత్వంతో లొంగదీస్తాడు; బహుమానాలతో లోభులను ఓడిస్తాడు; అబద్ధాలకు ప్రతిఫలంగా సత్యాన్ని ఇస్తాడు.]
్ఙ కాశీరాజు రథాన్ని తోలే సారథి అన్న ఈ మాటలు వినగానే కోసలరాజు మల్లికుడు తన రథం నుంచి దిగి వచ్చి, కాశీరాజుకు ప్రణమిల్లి, ‘‘పుణ్యాత్మా, నా లోపం నాకు తెలిసి వచ్చింది.దానిని సరిచేసుకుని, ఇంకా ధర్మంగా పరిపాలన సాగిస్తాను!'' అన్నాడు. తరవాత కాశీరాజు తన నగరానికి తిరిగి వచ్చి, ధర్మం అణుమాత్రం కూడా తప్పకుండా ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు.

No comments:

Post a Comment