బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు గుత్తిలుడు
అనే వైణికుడుగా జన్మించాడు. పసిప్రాయం నుంచే వీణావాయిద్యం పట్ల అమిత
ఆసక్తిని కనబరుస్తూ, వీణ వాయించడంలో అపూర్వ ప్రజ్ఞాపాటవాలను కనబరచసాగాడు.
పద హారు సంవత్సరాల వయసుకే గుత్తిలుడితో సమంగా వీణ వాయించే వాడు జంబూ
ద్వీపంలో లేడన్న ఖ్యాతి దశదిశలా వ్యాపిం చింది.
అందుచేత కాశీరాజు చాలా సంతో షించి అతన్ని తన ఆస్థాన వైణిక విద్వాంసు
డుగా పెట్టుకున్నాడు. ఇది జరిగిన అనేక సంవత్సరాలకు కాశీ నుంచి కొందరు
వర్తకులు బయలుదేరి వ్యాపారం నిమిత్తం ఉజ్జయినీ నగరం వెళ్ళారు. గుత్తిలుడి
ధర్మమా అంటూ కాశీరాజ్యంలో ఆబాలగోపాలానికీ వీణావాద్యం మీద అత్యంత ప్రీతి
ఏర్పడింది. అందుచేత ఈ కాశీవర్తకులకు వీణావాద్యం మీద మనసు పోయింది. వారు
అక్కడి వర్తకులతో, ‘‘మాకు వీణావాద్యం వినాలని ఉన్నది.
ఈ ఉజ్జయి నిలో ఉండే వైణికులలో కెల్లా చాలా గొప్ప వాణ్ణి పిలిపించి,
వాద్యగోష్ఠి ఏర్పాటు చేయండి. ఎంత ఖర్చయినా సరే మేము భరిస్తాం!'' అన్నారు.
ఉజ్జయినిలో గొప్ప వైణికుడు మూసిలుడు అనేవాడు. అందుచేత కాశీవర్తకుల వినోదం
కొరకు అతని పాటకచేరీ ఏర్పాటు చేశారు. మూసిలుడు వీణతో సహా వర్తకుల బసకు
వచ్చాడు. వీణతీగెలు శ్రుతిచేసి వాయించ సాగాడు. ఎంతసేపు వాయించినా కాశీవర్త
కుల ముఖాలలో ఆనందం ఏమీ కనబడ లేదు. ఇలా కాదని మధ్యమం శ్రుతిచేసి కొన్ని
పాటలు వాయించాడు.
అప్పటికీ వర్తకులలో చైతన్యం కనిపించలేదు. చివరకు మూసిలుడు, ‘‘అయ్యూ,
నే నింత సేపుగా వీణ వాయిస్తూన్నాను గాని, తమకు కొంచెమైనా ఆనందం కలిగినట్టు
కనబడదు. నా వీణావాద్యం తమకు నచ్చ లేదా?'' అని అడిగాడు. కాశీవర్తకులు
తెల్లబోయి ఒకరినొకరు చూసుకున్నారు. వారిలో ఒకడు, ‘‘నువ్విం దాక నుంచీ వీణ
వాయిస్తున్నావా? శ్రుతులు సరిచూస్తున్నావనుకుంటున్నాం!'' అన్నాడు
ఆశ్చర్యంతో.
‘‘వీణ చెడిపోయింది కాబోలు, సరిగా పలకక నిన్ను తిప్పలు పెడుతున్నదనుకుం
టున్నాం! క్షమించాలి, అంతకన్న మరేం లేదు!'' అన్నాడు ఇంకొకడు. మూసిలుడు
ముఖం ముడుచుకుని, ‘‘అయితే, మీరు ఇంతకు పూర్వం నాకన్న చాలా గొప్ప వైణికుడి
వాద్యం విని వుంటారు. అందుచేతనే నా వాద్యం మీకు ఏమాత్రం నచ్చలేదు.
ఆ వాద్యగాడెవరో సెలవియ్యండి,'' అన్నాడు. ‘‘అయితే, నువ్వు మా కాశీనగర
ఆస్థాన వైణికుడైన గుత్తిలుడి వాద్యం గురించి విననే లేదా?'' అని వర్తకులు
అడిగారు. ‘‘ఆయన గొప్ప వాద్యగాడా?'' అని అడి గాడు మూసిలుడు. ‘‘ఆయన
వీణావాద్యంతో పోలిస్తే నీది వాద్యమే కాదు,'' అన్నారు వర్తకులు. ‘‘అయితే
ఆయనతో సమంగా వాయించా ననిపించుకునేదాకా నేను విశ్రాంతి పుచ్చు కోను.
నాకు మీరేమీ డబ్బివ్వనవసరంలేదు,'' అంటూ మూసిలుడు అక్కడి నుంచి విసు
రుగా వెళ్ళిపోయూడు. అతను ఆ రోజే ప్రయూణమై కాశీనగరం చేరి బోధిసత్వుడి ఇంటికి
వెళ్ళాడు. బోధిసత్వుడు మూసిలుడిని చూసి, ‘‘ఎవరు నాయనా?'' అని అడిగాడు.
‘‘అయ్యూ, మాది ఉజ్జయిని. నన్ను మూసిలుడంటారు. తమ వద్ద వీణ నేర్చు కోవాలని
వచ్చాను. తమ అనుగ్రహం వుంటే అచిరకాలంలోనే తమతో సమానుణ్ణి అని పించుకోవాలని
నా ఉద్దేశం!'' అన్నాడు మూసిలుడు వినయంగా.
బోధిసత్వుడు అతనికి వీణావాద్యం నేర్ప టానికి అంగీకరించాడు. మూసిలుడు
రోజూ ఇంటి వద్ద వీణ అభ్యసిస్తూ రాజసభకు బోధిసత్వుడి వెంట వెళ్ళుతూండేవాడు.
అనేక సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు బోధిసత్వుడు తన శిష్యుడితో, ‘‘నీ విద్య
పూర్తి అయిపోయింది. నాకు తెలిసినదంతా నీకు నేర్పేశాను. ఇక నువ్వు మీ దేశం
వెళ్ళిపోవచ్చు,'' అన్నాడు.
కాని మూసిలుడికి ఉజ్జయినికి తిరిగి పోవాలని లేదు. అక్కడ తన విద్య
రాణించదు. తనకు వీణ వాయించటం ఏమీ రానప్పుడే ఉజ్జయినీవారు తనకు బ్రహ్మరథం
పట్టారు. ఎలాగైనా కాశీ ఆస్థాన విద్వాంసుడైతేనే కీర్తీ, ప్రతిష్ఠా! ఇప్పుడు
తనకు బోధిసత్వుడితో సరి సమానమైన విద్వత్తున్నది. బోధిసత్వుడు వృద్ధుడై
పోతున్నాడు కూడానూ! అందుచేత ఎలాగైనా కాశీరాజు ఆస్థానంలోనే ఉద్యోగం
సంపాదించాలి.
ఇలా ఆలోచించి మూసిలుడు, బోధి సత్వుడితో, ‘‘నాకు ఉజ్జయిని వెళ్ళాలని
లేదు. మీ పాండిత్యమంతా నాకు కూడా వచ్చిందంటున్నారు గనక, మీతోబాటు నాకు కూడా
ఆస్థానంలో ఉద్యోగం అయ్యేలాగు చూడండి!'' అన్నాడు. మరునాడు బోధిస త్వుడు ఈ
విషయం రాజుతో చెప్పాడు. ‘‘అతను నీవద్ద చాలాకాలంగా శిష్యుడుగా ఉన్నాడు గనక,
ఆస్థాన విద్వాంసుడుగా వేసు కుందాం. నీకిచ్చే జీతంలో సగం ఇస్తాను.
అతనికి సమ్మతమైతే పదవి స్వీకరించవచ్చు,'' అన్నాడు రాజు.
బోధిసత్వుడీమాట చెప్పగానే మూసి లుడు సంతోషించటానికి బదులు లోలోపల కుళ్ళాడు.
ఆగ్రహం కూడా చెందాడు. అయినా తన తక్కువేమిటి? బోధిసత్వుడి ఎక్కువే మిటి?
ఆయనకు తెలిసినదంతా తనకు నేర్పానన్నాడు కదా? మరి ఆయన జీతంలో తనకు సగం
ఇవ్వటమేం? మూసిలుడు, రాజు వద్దకు వెళ్ళి, ‘‘మహా ప్రభూ, నన్ను సగం జీతం మీద
ఆస్థాన విద్వాంసుడుగా నియమిస్తామన్నారుట! నా తక్కువేమిటి? మా గురువుగారి
కెంత వచ్చునో, నాకూ అంత వచ్చు.
కావలిస్తే మా గురువుగారినే అడగండి. ఆయన కిచ్చినంత జీతమూ తమరు నాకు
కూడా దయచేయిం చాలి!'' అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. కొంత సేపు మౌనంగా
ఊరుకుని, ‘‘నువ్వు గుత్తిలుడి శిష్యుడివని నే నెరుగుదును గాని, ఆయనతో
సమానమైన వైణికుడివని నే నెరగను. ప్రత్య క్షంగా చూస్తే తప్ప నమ్మను
కూడాను,'' అన్నా డాయన. ‘‘కావలిస్తే తమరు నన్ను పరీక్షచేసి చూడండి,''
అన్నాడు మూసిలుడు ఎంతో ధీమాతో.
‘‘సరే, మీ ఇద్దరికీ వాద్యపోటీ ఏర్పాటు చేస్తాను. నీ వాద్యం మీ గురువు
వాద్యంతో సమంగా ఉంటే నీకు కూడా ఆయనతో సమంగా జీతం ఇస్తాను. లేనిపక్షంలో
నిన్ను ఆస్థానంలోకి రానిచ్చేదే లేదు. సమ్మతమేనా?'' అని అడిగాడు రాజు.
మూసిలుడు అంగీకరించాడు. గురు శిష్యులిద్దరికీ పోటీ ఏర్పాటయింది. ఇద్దరూ
కొంతసేపు నెమ్మదిగా వీణవాయిం చారు. ఆ తరవాత ఒకరిని మించి ఒకరు వాయించటానికి
ప్రయత్నిస్తున్నారు.
మధ్యలో బోధిసత్వుడి వీణాతంత్రి ఒకటి ఉన్నట్టుండి తెగింది. కాని ఆయన
జరిగిన దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా మిగిలిన తీగల మీదనే
వాయిస్తున్నాడు. ఇది చూసి మూసి లుడు తన వీణతంత్రి ఒకటి బుద్ధిపూర్వకంగా
తెంపేశాడు. మరికాస్సేపటికి బోధిసత్వుడి వీణాతంత్రులలో మరొకటి తెగింది. మూసి
లుడు కూడా మరొక తంత్రి తెంపేశాడు. కొద్ది సేపట్లోనే బోధిసత్వుడి
వీణతంత్రులన్నీ తెగిపోయూయి; మూసిలుడు తన వీణ తంత్రు లన్నీ తెంపేసుకున్నాడు.
అయితే బోధి సత్వుడు తెగిపోయిన తంత్రులనే అద్భుత స్వరాలు పలికించ
సాగాడు. కాని మూసి లుడు ఆ పని చెయ్యలేక బిక్క మొహం వేశాడు. సభవారు
బోధిసత్వుడి ప్రతిభను హర్షించి మూసిలుణ్ణి గేలిచేశారు. మూసిలుడు ఆ
అవమానాన్ని భరించలేక సభలో నుంచి తలవంచుకుని బయటికి వెళ్ళి, ఆ రోజే ఉజ్జయినీ
నగరానికి ప్రయూణ మయ్యూడు.
No comments:
Post a Comment