బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు ఆ
ునకు
కుమారు డుగా జన్మించాడు. రాజు అతడికి మహాశాస నుడు అని పేరు పెట్టాడు.
కొద్దికాలం తరవాత రాణి మరొక కొడుకును కన్నది. ఆ శిశువుకు సోమదత్తుడని పేరు
పెట్టారు. కొడుకులిద్దరూ పుట్టిన మరి రెండు సంవత్స రాలకు రాణి కాలగతి
చెందింది. రాజు మరొక వివాహం చేసుకున్నాడు.
కొంత కాలా నికి రాణి ఒక కుమారుణ్ణి కన్నది. ఈ వార్త విని రాజు చాలా
సంతోషించి భార్యతో, ‘‘ఈ శుభ సమ
ుంలో ఏదైనా వరంకోరు, ఇస్తాను,'' అన్నాడు.
‘‘ఆ వరం అవసరమైనప్పుడు కోరుకుం టాను,'' అన్నది రాణి. ఈ చిన్నరాణి కొడుకు
పేరు ఆదిత్యుడు. అతడు క్రమంగా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకుంటూ
వనవంతుడ
్యూడు. రాణి ఒకనాడు రాజుతో, ‘‘ఆనాడు తమరిస్తా మన్న వరం ఇప్పుడు
కోరుతున్నాను. ఆదిత్యుణ్ణి
ుువరాజుగా అభిషేకించండి,'' అన్నది.
ఈ కోరిక వింటూనే రాజు నిశ్చేష్టుడై పోయి, ‘‘నా మొదటి భార్య
కుమారులిద్ద రుండగా, ఆదిత్యుడికి
ుువరాజు పదవి ఎలా ఇవ్వగలను? నీ కోర్కె
న్యా
ుసమ్మతం కాదు,'' అన్నాడు. ఈ విధంగా రాజు తన కోర్కెను నిరాకరించినా,
రాణి వూరుకోక, వీలయినప్పుడల్లా తన కొడుకును
ుువ రాజును చె
్యుమని
పీడించసాగింది. పెద్ద కుమారులిద్దరికీ ఆమెవల్ల ఏదైనా హాని జరగ వచ్చన్న శంక
కూడా రాజుకు కలిగింది.
రాజు ఒకనాడు పెద్దకొడుకులిద్దరినీ పిలిచి, సంగతి సందర్భాలన్నీ చెప్పి,
‘‘మీరు నగరం విడిచిపోయి, కొంతకాలం పాటు మరెక్కడైనా వుండండి. నా తదనంతరం
రాజ్యం మీకే చెందుతుంది గనక, అప్పుడు తిరిగి వచ్చి రాజ్యపాలనా భారం
వహించవచ్చు,'' అని సలహా ఇచ్చాడు.
తండ్రి కోరికప్రకారం మహాశాసనుడూ, సోమదత్తుడూ నగరం వదిలి, దాని పొలి
మేరలను చేరేంతలో, చిన్నవాడైన ఆదిత్యుడు కూడా వెంట రావడం కంట బడింది. పెద్ద
వాళ్ళిద్దరూ ఎంతచెప్పినా ఆదిత్యుడు తిరిగి వెళ్ళనన్నాడు. ముగ్గురూ కలిసి
కొన్నాళ్ళకు హిమాల
ు ప్రాంతంలోని అరణ్యాలను చేరుకున్నారు. ఒకనాడు ముగ్గురూ
ప్ర
ూణ బడలిక తీర్చుకునేందుకు ఒక చెట్టుకింద కూర్చు న్నారు.
మహాశాసనుడు, చిన్నవాడైన ఆదిత్యు డితో, ‘‘తమ్ముడూ, ఆ కనబడే చెట్ల
సమీపాన కొలను కనిపిస్తున్నది. అక్కడికి పోయి నీ దాహం తీర్చుకుని, మా కోసం
తామరాకుల దొప్పల్లో నీరు తీసుకురా,'' అని చెప్పాడు. ఆదిత్యుడు వెళ్ళి కొలను
నీటిలో దిగ గానే, అక్కడ వుండే జలపిశాచి అతణ్ణి పట్టు కుని, నీటి
దిగువనున్న తన ఇంటికి తీసుకు పోయింది. ఎంతకూ ఆదిత్యుడు రాకపోేుసరికి
మహాశాసనుడు, సోమదత్తుణ్ణి పంపాడు. అతణ్ణీ జలపిశాచి పట్టుకున్నది.
కొంతసేపు చూసి మహాశాసనుడు తమ్ముల కేదో ప్రమాదం జరిగి వుంటుందనుకుని,
కత్తి చేతబట్టి కొలను దగ్గిరకు వెళ్లాడు. అతడు కొలనులో దిగకుండా గట్టుమీదే
నిలబడి, నీటికేసి పరీక్షగా చూస్తూండటం గమనించిన జలపిశాచి, అతడు తమ్ములలాగా
తొందర పడి కొలనులో దిగడని గుర్తించింది. జలపిశాచి ఒక బో
ువాడి రూపంలో
మహాశాసనుడి దగ్గిరకు వచ్చి, ‘‘అలా చూస్తూ నిలబడ్డావేం? దాహంగా వుంటే
కొలనులో దిగి దాహం తీర్చుకోరాదా,'' అన్నది.
మహాశాసనుడు, ఆ సలహా వింటూనే, ఇందులో ఏదో మోసంవున్నదని గ్రహించి, ‘‘నీ
వాలకం చూస్తూంటే, నా తమ్ములిద్దరినీ నువ్వు కనబడకుండా చేశావన్న అనుమానం
కలుగుతున్నది. నిజం చెప్పు,'' అన్నాడు. ‘‘నువ్వు కొంచెం వివేకివిలా
వున్నావు.
నిజం చెబుతాను. ఒక్క జ్ఞానసంపన్నులను మాత్రం వదిలి, కొలను దగ్గిరకు
వచ్చే మిగతా వాళ్ళనందర్నీ పట్టి బంధిస్తాను. అలా చే
ు మని కుబేరుడి ఆజ్ఞ,''
అన్నది జలపిశాచి. ‘‘అంటే, నువ్వు జ్ఞానవంతుల నుంచి ఉపదేశం
పొందగోరుతున్నావన్న మాట! నేను, నీకు జ్ఞానబోధ చె
్యుగలను. కాని చాలా
మార్గా
ూసంలో వున్నాను,'' అన్నాడు మహా శాసనుడు.
వెంటనే జలపిశాచం అతణ్ణి నీటి అడు గున వున్న తన ఇంటికి తీసుకుపోయి,
అతిథి మర్యాదలు చేసి, ఉచితాసనంమీద కూర్చో బెట్టి, తాను అతడి పాదాల దగ్గిర
కూర్చున్నది. మహాశాసనుడు తాను గురువుల నుంచి విన్నదీ, స్వానుభవం ద్వారా
తెలుసుకున్నదీ అయిన పరమజ్ఞానాన్ని గురించి జలపిశాచికి చెప్పాడు. వెంటనే
జలపిశాచం బో
ువాడి రూపం విడిచి, తన నిజరూపంతో, ‘‘మహాత్మా, నువ్వు
మహాజ్ఞానివి.
నీ తమ్ములలో ఒకరిని నీకు ఇవ్వదలిచాను. ఇద్దరిలో ఎవరుకావాలో కోరుకో,''
అన్నది. ‘‘అయితే, ఆదిత్యుణ్ణి ఇవ్వు,'' అన్నాడు మహాశాసనుడు. ‘‘పెద్దవాణ్ణి
వదిలి, చిన్నవాణ్ణి కోరడం ధర్మం అవుతుందా?'' అన్నది జలపిశాచి. ‘‘ఇందులో
ధర్మం కానిదేం లేదు. నా తల్లికి నేను మిగిలివుండగా, నా పినతల్లికి తన
కొడుకైన ఆదిత్యుడు ఉండాలి కదా? ఆదిత్యుడి కోసమే, ఆమె నా తండ్రిని రాజ్యం
కోరింది.
మా తండ్రి ఆజ్ఞపై మేము అడవులకు బ
ులుదేరాం. సోదరప్రేమ చేత ఆదిత్యుడు
మా వెంట వచ్చాడు. పెద్దవాళ్ళమైన మేము తిరిగి నగరానికి వెళ్ళినప్పుడు
ఆదిత్యుడెక్కడ? అని ప్రజలు అడిగితే, అతణ్ణి జలపిశాచి మింగి వేసిందని
చెప్పడం, ఏరకం న్యా
ుం అవుతుంది?'' అని మహాశాసనుడు, జల పిశా చిని ఎదురు
ప్రశ్నించాడు. అప్పుడు జలపిశాచి, మహాశాసనుడి కాళ్ళకు నమస్కరించి, ‘‘నీ అంత
గొప్ప జ్ఞానసముద్రుణ్ణి నేనింతవరకూ చూడలేదు.
నీ తమ్ములిద్దరికీ స్వేచ్ఛ ఇస్తున్నాను. ఈ అరణ్యంలో వున్నంత కాలం నాకు
అతిథు లుగా వుండండి,'' అన్నది. మహాశాసనుడూ, తమ్ములూ జలపిశాచికి అతిథులుగా
వుండిపో
ూరు. కొంత కాలా నికి వాళ్ళ తండ్రి బ్రహ్మదత్తుడు చనిపోయి నట్టు
తెలిసి, మహాశాసనుడు తమ్ములతో, జలపిశాచితో కాశీరాజ్యానికి వెళ్ళాడు.
మహాశాసనుడికి రాజ్యాభిషేకం జరిగింది. అతడు సోమదత్తుణ్ణి తన
ప్రతినిధిగానూ, ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను ని
ుమించాడు. తనకు మేలుచేసిన
జలపిశాచికి విడిది ఏర్పాటు చేసి, దాని అవసరాలు గమనిస్తూం డేందుకు నౌకర్లను
ని
ుమించాడు.
No comments:
Post a Comment