Pages

Wednesday, September 19, 2012

పంచాయుధుడు


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు …ుువరాజుగా జన్మించాడు. నామకరణ మహోత్సవంనాడు, దేశదేశాల నుంచి దైవజ్ఞులు వచ్చారు. వాళ్ళు రాజుతో, ‘‘మహారాజా, ఈ పసివాడు చాలా గొప్ప జాతకుడు. ఐదు ఆ…ుుధాలతో ప్రపంచాన్నంతా జయించగల గొప్ప పరా క్రమశాలి,’’ అని జోస్యం చెప్పి, పిల్లవాడికి పంచా…ుుధుడు అని పేరు పెట్టారు.

కొంతకాలం గడిచింది. పిల్లవాడికి ప్రాజ్ఞత రాగానే, రాజు అతణ్ణి గాంధర్వదేశంలోని సుప్రసిద్ధ తక్షశిలా నగరానికి, మహాపండితు లైన గురువుల వద్ద సమస్త విద్యలూ నేర్చు కునేందుకు పంపాడు. పంచా…ుుధుడు తక్షశిలలో కొంత కాలం చదువుకుని, సకల విద్యాపారంగతుడ …్యూడు. గురుకులం నుంచి సెలవు తీసుకు నేటప్పుడు, గురువు శిష్యుణ్ణి దీవించి, ఐదు ఆ…ుుధాలను ప్రసాదించాడు. గురువుగారి అనుజ్ఞతో కాశీరాజ్యానికి బ…ులుదేరాడు.

దారిలో పంచా…ుుధుడు ఒక మహా రణ్యాన్ని దాటవలసి వచ్చింది. అతడు అరణ్య మార్గాన నడుస్తూండగా, కొందరు మనుషులు ఎదురుపడి, ‘‘చూడబోతే చాలా చిన్నవ…ుసు వాడివి. ఈ మహారణ్యంలో రోమాంచుడనే భ…ుంకర రాక్షసుడు విహరిస్తూంటాడు. వాడి కంట బడితే, నీ ప్రాణాలు దక్కవు. అందువల్ల, ఈ మార్గం వదిలి, మరొక మార్గాన అరణ్యం దాటడం క్షేమం,’’ అని సలహా ఇచ్చారు.

ఈ మాటలేవీ పరాక్రమశాలి అయిన పంచా…ుుధుడు పట్టించుకోలేదు. అతడు ఆ అరణ్యమార్గాన్నే నడవసాగాడు. మార్గంలో ఒకచోట, తాటిచెట్టు ప్రమాణంలో వున్న రాక్షసుడు రోమాంచుడు ఎదుర…్యూడు. ఈ రోమాంచుడు చూడ భ…ుంకరుడుగా వున్నాడు. పెద్ద తల, నిప్పులు చెరిగే కళ్ళు, ఏనుగుకున్నట్టు నోటిలో పొడవాటి రెండు దంతాలు, శరీరం నిండా ఎలుగుబంటిలా పొడవైన రోమాలు!


రాక్షƒసుడు, పంచా…ుుధుడి దారికి అడ్డుగా నిలబడి, ‘‘ఎవడివిరా, నువ్వు? ఎక్కడికి పోతావు? ఆగు, ఆగు! నిన్నిదే మింగబోతు న్నాను,’’ అంటూ హుంకరించాడు.
పంచా…ుుధుడు ఏమాత్రం భ…ుపడక, ‘‘రాక్షస రాజా, తెలిసే నేనీ అరణ్యంలో ప్రవేశించాను. జాగ్రత్త, దగ్గిరకు రాకు,’’ అని, పదునైన బాణం ఎక్కుపెట్టి, రాక్షసుడి పైకి వదిలాడు.
బాణం రివ్వుమంటూ పోయి, రాక్షసుడు ధరించిన జంతుచర్మాలకు తగిలింది. వాడు ఏమాత్రం గా…ుపడలేదు.

ఈసారి పంచా …ుుధుడు బాణం వెంట బాణాన్ని వాడి మీద ప్రెూగించాడు. ప్రెూజనం లేకపోయింది. ఆఖరుసారిగా విషం పూసిన బాణాలను వది లాడు. అవీ రాక్షసుడికి ఎలాంటి హానీ కలి గించలేక పోయినై. రాక్షసుడు ఈ సారి మరింత పెద్దగా హుంక రించి, పంచా…ుుధుడి మీదికి వెళ్ళాడు. పంచా…ుుధుడు తన ఖడ్గం దూసి, రాక్షసుడి మీదికి విసిరాడు. వాడు చలించలేదు. అప్పుడు పంచా…ుుధుడు, ‘‘నీ మూఢత్వం కొద్దీ నన్ను గుర్తించ లేకుండా వున్నావు.

 నా పేరు పంచా…ుుధుడు. నేనీ అరణ్యం ప్రవేశించే టప్పుడు, కేవలం నా ఆ…ుుధాలను నమ్ము కునే ఆ పని చే…ులేదు,’’ అంటూ పిడికిలి బిగించి, రోమాంచుణ్ణి గట్టిగా ఒక్క పోటు పొడిచాడు. రాక్షసుడు చలించకుండా పెద్దగా నవ్వి, ‘‘కురవ్రాడా, నీ వాలకం చూస్తూ వుంటే, నువ్వు మామూలు మనిషివిలా తోచడం లేదు. ప్రళ…ు భ…ుంకరుడనైన నన్నే ఢీకొన టానికి సాహసించావు. మానవులు నా రూపం చూసే హడలెత్తిపోతారే, మరి నీకు ప్రాణ భ…ుం లేకపోవడానికి కారణం ఏమిటి?’’ అని అడిగాడు.


‘‘భ…ుం ఎందుకు? పుట్టుకతో పాటే మరణం వుంటుంది. అంతేకాక, నా శరీరంలో వజ్రసమానమైనటువంటి ఖడ్గం ఒకటి వున్నది. అదే జ్ఞానం! నన్ను నీవు ఒకవేళ మింగటమే జరిగితే, ఆ ఖడ్గం నిన్ను, నిలువునా చీల్చే స్తుంది,’’ అన్నాడు. రాక్షసుడు ఒకటికి రెండు క్షణాలు ఆలో చిస్తూ వూరుకుని, ‘‘కురవ్రాడా, నువ్వనే దాంట్లో ఏదో సత్యం వున్నట్టు నాకు అను మానం కలుగుతున్నది.

ఏది ఏమైనా, నువ్వు నిర్భ…ుుడివి. నీ వంటి వాణ్ణి నేను మింగ గలిగినా జీర్ణించుకోవటం సాధ్యం కాదు. ఇక స్వేచ్ఛగా, నీ దారిన నువ్వు వెళ్ళు,’’ అన్నాడు. పంచా…ుుధుడుగా జన్మించిన బోధి సత్వుడు, రాక్షసుణ్ణి దీవించి, ‘‘నన్ను వది లావు, బాగానే వున్నది. నీ సంగతేమిటి? నువ్వు ఎన్ని జన్మల నుంచో దుర్మార్గపు పనులు చేస్తూ, ఇలా నికృష్టపు బతుకు, బతుకుతు న్నావు. అజ్ఞాన మనే అంధకారంలో కొట్టు మిట్టాడుతున్నావు. ఎంతకాలం జరిగినా, నీ గతి ఇంతే!’’ అన్నాడు.

‘‘అయితే, మహానుభావా, ఈ అజ్ఞానం నుంచి బ…ుట పడేందుకు నేనేం చే…ూలి?’’ అని అడిగాడు రాక్షసుడు దీనంగా చేతులు జోడించి. ‘‘నువ్వీ అరణ్యమార్గాన చేరి, దారే పోేు మానవులను చంపి తింటూ, పాపం పెంచు కుంటున్నావు. ఆ పాపం పెరిగిన కొద్దీ, నీవు రాక్షసజన్మలే ఎత్తి, …ూతనలు అనుభవించ డమే కాని, ఎన్నటికీ నీకు మోక్షƒం లేదు. నీకు ఉత్తమమైన మానవజన్మ కావాలంటే, పాపం చే…ుకు,’’ అంటూ బోధిసత్వుడు హితవు చెప్పాడు. ఆ తరవాత బోధిసత్వుడు, రాక్షసుడికి మానవులు మేలు పొందేందుకు అనుసరించ వలసిన ఐదు మహా సూత్రాలను గురించీ, మానవులను అధములుగా చేసే పంచ తంత్రా లను గురించీ విప్పి చెప్పాడు.

ఆ నాటి నుంచీ రోమాంచుడు పరులను పీడించే తన రాక్షస కృత్యాలు మానివే…ుడమే కాకుండా, అరణ్యంలో ప్ర…ూణించే బాట సారులకు తన ఇంట ఆతిథ్యం ఇస్తూ, గొప్ప ధర్మబుద్ధి గలవాడని పేరు తెచ్చుకున్నాడు. ఆ విధంగా బోధిసత్వుడి ధర్మబోధల వల్ల, మహాభ…ుంకరుడైన రాక్షసుడు సన్మార్గ
వర్తనుడ…్యూడు.


No comments:

Post a Comment