Pages

Sunday, September 16, 2012

ఉపాయం


ధర్మరాజపురంలో చిల్లరకొట్టు నడుపుతూ బతుకీడుస్తున్న చిన్న వ్యాపారి రామయ్య. అతని ఇంటి పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలం యజమాని దాన్ని గురించి పట్టించుకోక పోవడం వల్ల అక్కడ ఊళ్ళోని చెత్తంతా తెచ్చిపోసేవారు. కొన్నాళ్ళకు అది ఒక చెత్తకుండీలా తయారయింది. ఇలా వుండగా ఒకనాడు పొరుగూరి నుంచి రామయ్య బావమరిది సోమయ్య అక్కనూ, బావనూ చూసిపోదామని వచ్చాడు.
 
మాటల సందర్భంలో ఇంటి పక్క ఖాళీ స్థలం గురించి అక్క వరదమ్మ తము్మడికి చెప్పి, ``నువై్వనా మీ బావకు చెప్పరా. ఇల్లు మారిపోదామంటే వినడం లేదు. మన చిల్లరకొట్లో పెట్టే తినుబండారాలపై ఈగలు వాలుతున్నాయి. ఈ పక్కనంతా ఒకటే కంపు, మేం భరించలేం అంటూ కొనడానికి ఎవ్వరూ రావడం లేదు. ఇలాగే సాగితే రేపు పిల్లల బాగోగులు ఎలా చూడగలం?'' అంటూ కళ్ళనీళు్ళ పెట్టుకున్నది. సోమయ్య అక్క బాధవిని ఏదో ఒక ఉపాయం ఆలోచించాలనుకున్నాడు. ``ఈ విషయం ఊరి పెద్దల దృష్టికి తేవచ్చు కదా?'' అన్నాడు సోమయ్య.
 
``అదీ అయింది. ప్రయోజనం లేదు,'' అన్నది వరదమ్మ నిట్టూరుస్తూ. ``అలాంటప్పుడు దేవుడి మీద భారం వేసి ఊరుకో. అంతా ఆయనే సర్దుకునేలా చేస్తాడు,'' అని ధైర్యం చెప్పి, వెళ్ళాడు సోమయ్య. మూడో రోజు మిట్టమధ్యాహ్నం వేళ, అటు కేసి వచ్చిన ఒక పొరుగూరు ముసలావిడ, ఖాళీ జాగాలో ఉన్న వేపచెట్టుకింద వినాయకుడు వెలిశాడని అక్కడ ఉన్నవాళ్ళతో ఆశ్చర్యంగా చెప్పింది. ఆ వింత దృశ్యాన్ని వీధి వీధంతా వచ్చి చూసింది. ఇంతలో పాలు అము్మకునే మునెమ్మ వచ్చి ఆ చెట్టు చుట్టూ శుభ్రంగా చిమ్మి, నీళు్ళ చల్లి ముగ్గులు పెట్టింది.

ఆ పక్కనున్న సుగుణమ్మ పూలు, కొబ్బరికాయ, కుంకుమ, పసుపు తెచ్చి పూజలు చేసింది. ఆ సాయంత్రానికల్లా, ఎక్కడా చెత్త కనిపించలేదు. పైగా, అగరు వత్తుల పరిమళాలు; పూల వాసనలు! ఆ రోజు నుంచి రామయ్య చిల్లరకొట్టు వ్యాపారం పుంజుకున్నది. కర్పూరం, కొబ్బరికాయల వగైరాల అమ్మకం పెరిగింది. మరో రెండు వారాల తరవాత సోమయ్య అక్కను చూడడానికి వచ్చినప్పుడు, ``నీ నోటి మాట ఫలించింది సోమయ్యా.
 
నువు్వ చెప్పింది అలాగే జరిగింది,'' అన్నది వరదమ్మ తము్మడితో సంతోషంగా. అప్పుడే కొట్టు నుంచి భోజనానికి వచ్చిన రామయ్య, ``సోమయ్య ఏం చెప్పాడేమిటి?'' అని అడిగాడు భార్యను. ``దేవుణ్ణి నము్మకో. అంతా ఆయనే సర్దుకునేలా చూస్తాడు, అని చెప్పాడండీ. అలాగే జరిగింది కదా!'' అన్నది వరదమ్మ. రామయ్య బావమరిది కేసి తిరిగి, ``అవునూ, వినాయకుడు నిజంగానే వెలిశాడంటావా?'' అని అడిగాడు ఆశ్చర్యంగా. ``నిజంగా వెలిశాడో, లేదో మనకు అనవసరం.
 
మీకు ఇప్పుడు హాయిగా ఉందా లేదా?'' అని అడిగాడు సోమయ్య. ``హాయిగా, మునుపటికన్నా సంతోషంగా ఉన్నాం. అది వేరే విషయం. నా అనుమానమంతా ఆ వేపచెట్టు వినాయకుడి రూపం గురించే,'' అన్నాడు రామయ్య మళ్ళీ. ``అవును, బావా. వేపచెట్టు బోదెలో వినాయకుడి రూపం అమర్చింది నేనే. మీరు ఆ ఖాళీ జాగాలో పేరుకుపోయిన చెత్తవల్ల నానా ఇబ్బందులు పడుతున్నారని ఈ ఉపాయం ఆలోచించాను. మనవాళు్ళ చూస్తూ చూస్తూ గుడిని అపవిత్రం చేయలేరు. మీకిప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. ఇది మోసం చేయడం అని నేను అనుకోను. ఉపాయం లేని వాణ్ణి ఊళ్ళోంచి తరిమేయాలని మనకొక సామెత ఉందికదా.
 
దీనివల్ల ఎవరికీ కష్టం లేదు. బాధ లేదు. పైగా కాస్సేపు దైవారధన వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మంచిదే కదా?'' అన్నాడు సోమయ్య. బావమరిది ఉపాయం ఫలించినందుకు రామయ్య చాలా సంతోషించాడు. అతనికేసి మెచ్చుకోలుగా చూస్తూ, చిన్నగా నవు్వతూ అవునన్నట్టు తల ఊపాడు.

No comments:

Post a Comment