Pages

Thursday, September 6, 2012

రొట్టెలో నగలు


ఒకానొక రాజుకు ప్రజలు తమకు కలిగే అదృష్టాన్ని ఎలా ఉపయోగించుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తి అమితంగా ఉండేది. ఒకనాడాయన రాజభవనంలోని వంటశాలలో రొట్టెలు కాల్చేవాణ్ణి పిలిచి రెండు అందమైన రొటె్టలు త…ూరుచే…ుమన్నాడు. ఒకదానిని మామూలుగా త…ూరు చేసి, రెండవదానిలోపల విలువైన నగలు దాచమన్నాడు.
వారానికోసారి ఉద…ుం పూట ఒక రాజోద్యోగి, పేదవారికి దానధర్మాలు చే…ుడం ఆనవాయితీ. అలా ఆరోజు వచ్చిన రాజోద్యోగిని పిలిచి, రాజు ఆ రెండు రొటె్టల గురించి చెప్పి, నగలు దాచిన రొటె్టను చూపుతూ, ‘‘మిత్రమా, దీనిని పాత్రుడైన వాడికి దానం చెయ్యి.

రెండవదాన్ని నీ వద్దకు భిక్షకువచ్చే వారి కెవరికైనా ఇవ్వు,’’ అన్నాడు. ఆ రోజు ఇద్దరు భిక్షకు వచ్చారు. వారిలో ఒకడు పొడవాటి గడ్డం, పాదాల వరకు జీరాడే అంగీతో గొప్ప సాధువులాగా ఉన్నాడు. రెండవవాడు మామూలు బిచ్చగాడిలా ఉన్నాడు. రాజోద్యోగి నగలు దాచిన రొటె్టను సాధువుకిచ్చి, రెండవదాన్ని మామూలు బిచ్చగాడికిచ్చాడు.
దీన్నంతా రాజు తన మేడ ఉపరితలం నుంచి జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. సాధువు రొటె్టను అందుకోగానే, అది బరువుగా ఉండడంతో ఆశ్చర్యంగా చూశాడు. రొటె్ట సరిగ్గా కాలినట్టు లేదనే నిర్ణ…ూనికి వచ్చాడేమో మరి.

 పక్కనున్న బిచ్చగాడికేసి ఆప్యా…ుంగా చూస్తూ, ‘‘మిత్రమా, ఈ రొటె్ట కాస్త ఎక్కువ బరువుగా ఉన్నట్టుంది. నీచేతిలో ఉన్నదానికన్నా ఇది కొంచెం పెద్దదనుకుంటాను. ఈ పూట నాకు అంత ఆకలిగా లేదు. మనం రొటె్టలను మార్చుకుందామా?’’ అన్నాడు. బిచ్చగాడు మరేమీ మాట్లాడకుండా, తన రొటె్టను సాధువు చేతిలో పెట్టి, ఆ…ున రొటె్టను తీసుకుని తనదారిన వెళ్ళిపో…ూడు. ఆ దృశ్యాన్ని చూసిన రాజు, ‘‘సాధువు నగల వ్యామోహంలో పడకూడదన్నది దేవుడి సంకల్పంకాబోలు!

సాధువును ధనవంతుడిగా మార్చడం దేవుడికి సమ్మతం కాదేమో!’’ అనుకున్నాడు. అయినా, సాధువు తన రొటె్టను బిచ్చగాడికి ఇస్తున్నప్పుడు ఆ…ున ముఖంలో కనిపించిన చిరునవ్వును రాజు మరవలేక పో…ూడు. బహుశా, ఉడికీ ఉడకని రొటె్టను తెలివిగా, ఎదుటివాడికి అంటగడుతున్నామన్న తృప్తితో వచ్చినదై ఉంటుంది ఆ నవ్వు!


 అయినా, ఆ నవ్వు రాజులో తీరని ఉత్సుకతను రేకెత్తించింది. వెంటనే ఇద్దరు గూఢచారులను పిలిచి, రొటె్టలను పుచ్చుకుని వెళ్ళిన ఇద్దరినీ రహస్యంగా అనుసరించి వెళ్ళి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుని రమ్మన్నాడు. సా…ుంకాలానికి ఇద్దరు గూఢచారులూ వచ్చి జరిగిన సంగతులు రాజుగారికి విన్నవించారు: సాధువు రొటె్టను తీసుకుని తిన్నగా తన కుటీరానికి వెళ్ళాడు. అంగీనీ, పెట్టుడుగడ్డాన్నీ తీసి పక్కన పెట్టి; రొటె్టనూ, దానితో పాటు తెచ్చుకున్న వంటకాలనూ తృప్తిగా తిన్నాడు. మళ్ళీ పెట్టుడుగడ్డాన్ని తీసి ముఖానికి తగిలించుకుని, అంగీని ధరించి సాధువులా భిక్షానికి బ…ులుదేరాడు.

బిచ్చగాడు తన గుడిసెకు చేరి రొటె్టను ముక్కలుగా కో…ుబోయి, అందులోని నగలను చూసి అమితాశ్చర్యం చెందాడు. దానిని చూసిన అతడి వెళ్ళాం, ‘‘ఆహా, ఇంతకాలానికి దేవుడు కరుణించాడు. ఇవన్నీ, నావే,’’ అన్నది. అయితే, బిచ్చగాడు ఏమాత్రం తొందర పడకుండా, ‘‘దేవుడు దీనిని ఒకగొప్ప వ్యక్తి ద్వారా ఒక సాధువుకు ఇప్పించాడు. ఆ సాధువు దీనిని నాకిచ్చాడు. ఇది నా నిజాయితీకి పరీక్ష. మొదట నేను ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ నగలను పొరబాటున రొటె్టలో పెట్టారేమో తెలుసుకోవాలి. ఒకవేళ దీనిని ఎవరైనా ప్రభువుల ఇంటి నుంచి దొంగిలించి రొటె్టలో దాచారేమో చూడాలి.

అలాకాక ఆ గొప్ప వ్యక్తే ఉద్దేశపూర్వకంగానే దీనిని సాధువుకు దానంగా ఇచ్చి ఉన్నట్టయితే ఇది ఆ సాధువుకే చెందాలి కదా? ఇవన్నీ ఏవీ కావనుకుంటేనే దీనిని మనం ఆశించవచ్చు. ప్రభువులే ద…ుతలచి మనకు ఇస్తే, మనం కొన్ని నగలు తీసుకుని, ఇరుగు పొరుగుకు కొన్ని ఇద్దాం,’’ అన్నాడు భార్యతో. ఆ తరవాత నగలను తీసుకుని, రాజోద్యోగి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు. ఉద్యోగి అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళాడు.

రాజు అతడి నిజాయితీకి సంతోషించి, ఆ నగలను అతనికే ఇచ్చి, మరిన్ని కానుకలతో సత్కరించాడు. ‘‘సాధువుగా నటించిన ఒక మోసగాడి చేతికి దక్కకుండా దానిని దేవుడు  ఒక పాత్రుడికే అందించాడు. అయితే, ఈ సంఘటన నుంచి నేను నేర్చుకున్న గుణపాఠం అమూల్యమైనది. వాళ్ళు రొటె్టను మార్చుకోవడం చూడగానే, నాకు తోచిన వివరణతో తృప్తి పడి సరిపుచ్చుకుని వుంటే అసలు నిజం బ…ుటపడి వుండేదికాదు. అంటే, మనకు తెలిసినవే నిజమన్న భావనతో తృప్తి చెంది ఊరుకోవడం ఏమాత్రం భావ్యం కాదు,’’ అన్నాడు వివేకి అయిన ఆ రాజు సభికులతో.  

No comments:

Post a Comment