Pages

Thursday, September 6, 2012

ఏదుపంది - పొట్టి తోక


ఇదొక చెరూకీ కథ. ఇప్పటి జంతువులకన్నా పూర్వకాలం నాటి జంతువులు పెద్దవిగానూ, దృఢంగానూ, తెలివిగలవిగానూ ఉండేవని చెరూకీ జాతివాళ్ళు విశ్వసించేవారు. అవి మనుషులతో కలిసిమెలిసి తిరుగుతూ సరిసమానంగా ఉండేవని కూడా వాళ్ళు నమ్మేవారు.

ఆ కాలంనాటి ఒక ఏదుపందికి ఒకనాడు విపరీతంగా ఆకలి వేసింది. ఎవరైనా తన బొరి…ులోకి ఇంత తిండి పడేస్తే ఎంత బావుణ్ణు! అన్న ఆశతో ఆలోచించసాగింది. కొంతసేపటికి దానికి కొన్నాళ్ళ క్రితం తాను మనుషులుంటున్న ఇంటివైపుగా పరిగెత్తుతున్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటూండగా తన చెవిని పడ్డ, ‘కోరికలే గుర్రాలయితే, మూర్ఖులే వాటి మీద స్వారీ చేస్తారు’ అనే సూక్తి గుర్తుకు వచ్చింది. అది చటుక్కున లేచింది. తన మూర్ఖత్వం కాకపోతే, ఎవరు పనికట్టుకుని తన బొరి…ులోకి ఆహారం తెచ్చిపెడతారు? తనే వెళ్ళి సంపాయించడం తప్ప మరో మార్గంలేదనుకున్నది. తను వెలుపలికి వెళ్ళక తప్పదు. అంటే సురక్షతమైన తన బొరి…ును వదిలిపెట్టాలి. వెలుపల తనను వేటాడే జంతువుల కంటబడకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే అవి, తనను పట్టి తినే…ుగలవు. మరుక్షణమే తనలోని భ…ూన్ని తలుచుకుని నవ్వుకున్నది. తను ఎన్నిసార్లు చావు నుంచి తప్పించుకోలేదు? అపా…ుం నుంచి తప్పించుకోవడానికి తనకు ఎన్నెన్ని ఉపా…ూలు తెలుసు!

 ఆ ఆలోచనతో ఏదుపందికి నూతనోత్సాహం పుట్టుకొచ్చింది. తను వుంటున్న పొడవాటి బొరి…ు చివరిదాకా పరిగెత్తింది. బొరి…ు అంచున, నేల సమతలంలో కొద్దిసేపు ఆగింది. కళ్ళు మాత్రం బ…ుటకు కనిపించేలా తలను మెల్లగా వెలుపలికి పెట్టి చుట్టుపక్కల ఒకసారి జాగ్రత్తగా కల…ుచూసింది. అంతా ప్రశాంతంగా ఉంది. ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తూ వెలుపలికి వచ్చింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పొదలు, ఏపుగా పెరిగిన పచ్చగడ్డి కనిపించాయి. ఏదుపంది ఆహారం కోసం వెతుకుతూ మెల్లగా నడవసాగింది. కొన్ని మొక్కల వద్ద ఆగి, ముందు కాళ్ళతో గోతులు తీసి వాటి దుంపలను రుచి చూసింది.


 అందిన క్రిమికీటకాలనూ, పురుగులనూ, మట్టి పాములనూ పట్టి తింటూ, తన బొరి…ుకు దూరంగా వెళ్ళిపో లేదు కదా అని మళ్ళీ మళ్ళీ బొరి…ుకేసి తిరిగి చూడసాగింది. ఎందుకంటే దాని బొరిేు దానికి ప్రాణాధారం. రక్షƒణా కవచం. ఏదైనా అపా…ుం అనిపిస్తే చాలు. అందులోకి జొరబడవచ్చు.

ఏదుపంది ఒక దుంపను తవ్వుతుండగా వేగంగా వస్తూన్న అడుగుల చప్పుడు వినిపించడంతో తలెత్తి చూసింది. అంతే! గడగడలాడి పోయింది. దాని చుట్టూ గిరిగీసినట్టు ఒకతోడేళ్ళగుంపు చుట్టుముట్టింది. ఒకటి దాని బొరి…ుకు అడ్డుగా నిలబడింది. ఈ రోజుతో నాపని అయిపోతుందా అని ఏదుపంది ఒకక్షƒణం హడలి పోయింది. అయితే మరుక్షƒణమే ఆ ఆలోచనను చంపేసింది. ఏడుతోడేళ్ళు తనను ముక్కలు చే…ుడానికి తన మీదికి ఉరకడానికి ఆ…ుత్తమవుతూండగా ఈ అపా…ుం నుంచి ఎలాగైనా బ…ుటపడాలి అన్న నిర్ణ…ూనికి వచ్చింది ఏదుపంది.

‘‘మిత్రులారా! అభినందనలు! మీకు ఇవాళ విందు భోజనం లభించింది!’’ అన్నది ఏదుపంది సంతోషంగా నవ్వుతూ. తోడేళ్ళకు విస్మ…ుం కలిగింది. తమకు ఆహారం కానున్న సమ…ుంలో ఇంత నిశ్చింతగా మాట్లాడిన జంతువును అవి ఎన్నడూ చూసి ఎరుగవు. అవన్నీ అలాగే అక్కడే నిలబడి తమ పెద్ద కేసి చూశాయి.
‘‘కృతజ్ఞతలు!’’ అంటూ తోడేళ్ళగుంపు పెద్ద ఒక అడుగు ముందుకువేసి, ‘‘ఇక ఆగలేం. ఆలస్యం దేనికి? ఆకలి నమిలేస్తోంది,’’ అన్నది.

‘‘పరమకరుణతో మీకీ విందు సమకూర్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఐదు నిమిషాలు ఆగలేరా? ఇంత మంచి విందు దొరికినప్పుడు, ఆరగించే ముందు వేడుక చేసుకోవాలి కదా? తోడేళ్ళు, అందునా నాగరికతగల తోడేళ్ళు తప్పక ఆ సంప్రదా…ూన్ని పాటిస్తా…ుని విన్నానే,’’ అన్నది ఏదుపంది తోడేళ్ళ పెద్ద కళ్ళకేసి ఆశ్చర్యంగా చూస్తూ.
‘‘నువ్వు మమ్ము అనాగరికులనుకున్నావా?’’ అని అడిగింది తోడేళ్ళపెద్ద ఏదుపంది కేసి కోపంగా చూస్తూ.

‘‘ఎంతమాట! ఎంత మాట! నేనలా అన్నానా? భోజనం చేసే ముందు మీరు దేవుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడుతూ నాట్యమాడతారన్న సంగతి నాకు తెలి…ునిదా?’’ అన్నది ఏదుపంది.

‘‘మరి మాలో ఎవరికీ శ్రావ్యమైన కంఠ స్వరం లేదే!’’ అన్నది తోడేలుపెద్ద. ‘‘అదేం పెద్ద సమస్యకాదు. నేను పాడతాను. మీరు ఆడండి,’’ అంటూ ఏదుపంది నవ్వి, మళ్ళీ ఇలా అన్నది: ‘‘నేను మీలో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క పాట పాడతాను. నాకు చాలా పాటలు తెలుసు. నాకు తెలిసినవాటిలో చాలా మంచి పాటలు ఏడింటిని ఎన్నుకుని మీ కోసం పాడతాను.


ఒక్కొక్క పాటను ప్రారంభించేప్పుడు నేను ఒక్కొక్క చెట్టు బోదెకు ఆనుకుని పాడతాను. మీరు చప్పట్లు కొడుతూ నాట్యం చే…ుండి. మొదట నేనొక చెట్టుకు ఆనుకుని పాట ప్రారంభిస్తాను. మీరు నా చుట్టూ చేరి నాట్యం చే…ుండి. పాట పూర్తికాగానే ఏ చెట్టుకు ఆనుకుంటే బావుంటుందో నిర్ణయించి నేను అక్కడికి వెళ్ళి కొత్తపాట ప్రారంభిస్తాను. మీరు వచ్చి నాట్యం చే…ుండి. ఇలా ఏడు పాటలు పూర్తి చేద్దాం. చివరి పాట దేవుణ్ణి కీర్తిస్తూ పాడతాను. అవన్నీ అ…్యూక మీరు నన్ను హాయిగా భోంచే…ువచ్చు. సరేనా?’’ అన్నది ఏదుపంది.

తోడేళ్ళపెద్ద అంగీకరించింది. ఏదుపంది వెళ్ళి దాపులనున్న ఒక చెట్టు బోదెకు ఆనుకుని తోడేళ్ళ పెద్ద కేసి చూస్తూ, ‘‘ఇది తమ గౌరవార్థం, పాడేపాట,’’ అంటూ పాట పాడడం ప్రారంభించింది. తోడేళ్ళ పెద్ద ఆనందంతో గట్టిగా నవ్వింది. తోడేళ్ళు దాని చుట్టూ వృత్తాకారంలో నిలబడి గెంతుతూ నాట్యం చే…ుసాగాయి. అయితే, ఏదుపంది ఎటైనా వెళ్ళి పోగలదేమో నన్న అనుమానంతో ఒక కంట కనిపెడుతూనే గెంతసాగాయి. అయినా ఏదుపంది మాత్రం పాట పూరే్త్యు వరకు ఆ చెట్టుబోదెనుంచి ఒక్క అడుగు కూడా అటూ ఇటూ కదలలేదు.

పాట పూర్త…్యూక ఏదుపంది వేరొక చెట్టు వద్దకు వెళ్ళి ఆ చెట్టుకు ఆనుకుని గొంతు సవరించుకుని మరొక పాట అందుకున్నది. తోడేళ్ళు చుట్టూచేరి నాట్యం చే…ుసాగాయి.
పాట పూర్తయింది. ఇప్పుడు తోడేళ్ళకు ఏదుపంది వీద ఉన్న అనుమానం కాస్త తగ్గింది. వేరొక చెట్టువద్దకు చేరాయి. ఏదుపంది వెళ్ళి ఆ చెట్టుకు ఆనుకుని తోడేళ్ళు నాట్యానికి సిద్ధం కాగానే పాట ప్రారంభించింది. ఎలాంటి భ…ుం కనబరచలేదు. పారిపోవడానికి ప్ర…ుత్నించలేదు. అందువల్ల తోడేళ్ళ విశ్వాసం పొందగలిగింది.
ఇలా ఆరు పాటలు పూర్త…్యూయి. ఏడవ చెట్టు వద్దకు వెళ్ళాలి. అది తను నివసిస్తూన్న బొరి…ుకు సమీపంలో ఉండాలి. ఏదుపంది బొరి…ు ముఖద్వారాన్ని ఒక్కక్షƒణం చూసింది. తన పథకం గనక పారితే అందులోకి జొరబడి బతికి పోగలను అనుకున్నది. ఆ తరవాత తను వెళ్ళవలసిన చెట్టును చాలా జాగ్రత్తగా ఎంపిక చేసింది.
ఆ తరవాత తోడేళ్ళపెద్దతో, ‘‘దేవుణ్ణి కీర్తిస్తూ పాడవలసిన ఒకే ఒక పాట మాత్రమే ఉంది,’’ అన్నది.


అంతలో మిగిలిన తోడేళ్ళన్నీ అక్కడికి వచ్చాయి. ఏదుపంది వెళ్ళి తను ఎంపిక చేసిన చెట్టుబోదెకు ఆనుకున్నది. ‘‘పాట పూర్తికాగానే మేము నిన్ను తినే…ుగలం!’’ అన్నది తోడేళ్ళపెద్ద. ‘‘నిక్షేపంగా! అది మనం మొదటే అనుకున్నదే కదా?’’ అన్నది ఏదుపంది సంతోషంగా. ‘‘నీ ధైర్యం ఎంతో మెచ్చతగింది. మాకే గనక ఆకలి లేకుంటే నిన్ను వదిలిపెటే్టవాళ్ళమే. అయితే, ...’’ అంటూ తోడేళ్ళపెద్ద పళ్ళికిలించింది.

‘‘దాన్ని గురించి మరిచిపొండి. మనం ఒక ఒప్పందానికి వచ్చాం. ఒప్పందం ఒప్పందమే కదా! దానిని తప్పక అమలు చే…ూల్సిందే. ఏడో పాట పూర్తికాగానే, మీరు నన్ను తినే…ువచ్చు,’’ అంటూ ఆనందంగా రాగం తీస్తూ, ఏడవపాటకు సిద్ధంకండి. చివరినాట్యం,’’ అన్నది. ‘‘అలాగే,’’ అన్నవి తోడేళ్ళు ఎంతో ఆనందంగా.

ఏదుపంది పాట ప్రారంభించింది. తోడేళ్ళు ఉత్సాహంగా నాట్యం చేస్తూ, దానికి కాస్త దూరంగా వెళ్ళాయి. పాట ఉచ్ఛస్థాయిలో సాగుతోంది. వేగం పుంజుకుంది. పాటకు తగ్గట్టు తోడేళ్ళు చెట్టు చుట్టూ వేగంగా గెంత సాగాయి. హఠాత్తుగా పాట ఆగింది. ‘నేను సిద్ధం’ అంటూ ఏదుపంది అరిచింది. తోడేళ్ళు ఆట ఆపి, నాలుగు కాళ్ళ మీద స్థిమితంగా నిలబడ్డాయి. ఆ సమ…ుంకోసమే ఎదురు చూస్తూన్న ఏదుపంది చటుక్కున వెళ్ళి మెరుపు వేగంతో కన్నంలోకి జొరబడింది.

తోడేళ్ళు జరిగిం దేమిటో గ్రహించే లోపలే ఏదుపంది శరీర మంతా బొరి…ులోకి వెళ్ళింది. దాని తోక మాత్రం బ…ుట కనిపిస్తోంది. తోడేళ్ళ పెద్ద ఒక్కగెంతున వెళ్ళి దాని తోక కొసను పళ్ళతో పట్టుకున్నది. తోకను తెగకొరికి ఉండేదే. అయినా తోకను పట్టుకుని ఏదుపందిని మొత్తంగా వెలుపలికి లాగాలని ప్ర…ుత్నించింది. గట్టిగా లాగింది. అయితే ఏదుపంది తన దృఢమైన గోళ్ళతో కన్నం గోడలను గట్టిగా పట్టుకుంది. ఈ రెంటి మధ్య పోరాటం కొంతసేపు సాగింది.

 ఆఖరికి తోడేలు తన శక్తినంతా ఉపెూగించి దాని తోకను బలంగా గుంజింది. అంతే, తోక కొస తెగి పోయింది. తోడేలు వెనక్కు వెల్లకిలా పడింది. ఆ ఊపుకు రెండు పొర్లు పొర్లింది. ఆ తరవాత మామూలు స్థితికి వచ్చి చేతిలోని తోకకొసను చూస్తూ, ‘‘ఆ ఏదుపంది మనల్ని మోసం చేసింది!’’ అన్నది. ‘‘దాని మా…ు మాటలకు మనం మోసపో…ూం!’’ అన్నవి మిగిలిన తోడేళ్ళు.ఏదుపంది కన్నంలో మరింత లోపలికి వెళ్ళింది. అది కాస్త స్థిమిత పడ్డాక తన తోక కేసి చూసుకుంది. కాస్త పొట్టిగా కనిపించింది. అయినా ఇదీ బాగానే ఉంది అనుకున్నది. ఎలాగో బతికి పో…ూం అదేచాలు, అనుకుంటూ చాలా ఆనందించింది. అప్పటినుంచే ఏదుపందికి పొట్టి తోక ఏర్పడింది!



No comments:

Post a Comment