Pages

Thursday, September 6, 2012

వాత్సల్యం


ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని కొడుకు మోహనుడు వట్టి సోమరిపోతుగానూ, నిష్ప్రయోజకుడుగానూ త…యారై, తండ్రికి ఏవిధంగానూ సా…యపడక పో…యాడు. తండ్రి ఆ కొడుకును గురించి ఎంతో బాధపడి, వాణ్ణి ప్రయోజకుణ్ణి చె…య్యాలన్న పట్టుదలకొద్దీ, న…యానా భ…యానా ఎంతో ప్ర…యత్నించి చూశాడు. కాని అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. బంధుమిత్రులతో చెప్పుకున్నాడు. వాళ్ళ ద్వారా కొడుక్కు మంచి మాటలు చెప్పి చూశాడు. వారి హితబోధలు కూడా మోహనుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పూ తీసుకురాలేక పో…యాయి.

మోహనుడు …యుక్తవయస్కుడయ్యాడు. వాడికి కుటుంబభారం మీదపడ్డాక బాధ్యతలు తెలిసి వస్తా…యనుకుని ఒక చక్కని అమ్మాయిని చూసి తండ్రి వాడికి పెళ్లి చేశాడు. పెళ్లికాగానే మోహనుడు తండ్రి వద్దకు వచ్చి, ‘‘నాన్నా, నా ఆస్తి నాకు పంచు. నా దారిన నేను బతుకుతాను. ఇన్నాళ్ళు ఉన్నది చాలు. నేనిక ఈ ఇంట ఒక్కక్షణం వుండను,’’ అన్నాడు.

తండ్రి ఆశ్చర్యపడి, ‘‘నీకిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటిరా, అబ్బాయి? అయినా నిన్ను వేరుపడమని ఎవరన్నారు? చాతనయినదేదో సంపాదించుకుని నా ఎదటనే ఉంటే, నేనూ సంతోషిస్తానుగా?’’ అన్నాడు.

‘‘నామీద ప్రేమ ఉన్నట్టు నటనకూడా దేనికి? నేనంటే మొదటి నుంచీ నీకు ద్వేషమే. ప్రేమ ఏ కోశానా లేదు. ఇంత కాలమూ నన్ను తిట్టి, కొట్టి, రాచి రంపాన పెట్టావు. ఇప్పుడేమో, నేను ఎటైనా పోయి స్వతంత్రంగా బతుకుతానంటే అభ్యంతరం చెబుతున్నావు. నేను ఇప్పటికైనా వేరు పోయి సుఖపడటం నీకు ఇష్టంలేదు,’’ అన్నాడు మోహనుడు నిష్ఠూరంగా.

‘‘అలా ఎప్పటికీ అనుకోకు నాయనా. నేను ఎప్పుడైనా, ఏదైనా చెప్పివుంటే, అది నీమేలుకోరే చెప్పివుంటాను. ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావలిసింది,’’ అని తండ్రి కొడుకు వాటా పంచి ఇచ్చాడు.


మోహనుడు మరొక గ్రామం వెళ్ళిపోయి, అక్కడ కాపరం పెట్టి, కూలీనాలీ చేసుకుంటూ కిందా మీదా పడుతూ ఎలాగో సంసారం ఈదసాగాడు. సంవత్సరం తిరిగేసరికల్లా మోహనుడికి ఒక కొడుకు పుట్టాడు. మోహనుడు వాడినెంతో గారాబంగా పెంచసాగాడు. అయితే  మోహనుడిలాగే వాడుకూడా కొన్నాళ్ళకు  పనికి మొండీ, తిండికి మెండూగా తయారయ్యాడు. వాడి బుద్ధులూ, వాలకమూ చూస్తున్నకొద్దీ మోహనుడికి ఒళ్ళు మండిపోయేది.

ఒకరోజు కోపం పట్టలేక మోహనుడు తన కొడుకును బాగా కొట్టాడు. వాడు బాధతో ఇల్లు వదిలి దగ్గిరలోనే ఉన్న తాతగారి ఊరు పోయి, తాతతో జరిగినది చెప్పాడు.

తాత వాణ్ణి తన గ్రామంలోనే ఉన్న మరొకరి ఇంటికి తీసుకుపోయి, ఆ ఇంటి యజమానితో మాట్లాడి, నాలుగురోజులపాటు వాడు అక్కడే రహస్యంగా ఉండేటట్టు ఏర్పాటుచేశాడు.

తన చేత తన్నులుతిని కొడుకు మాయమయ్యే సరికి మోహనుడు గాభరాపడ్డాడు.

ఎంత వెతికినా వాడి జాడ తెలియలేదు. మోహనుడు వాణ్ణి వెతుక్కుంటూ తన తండ్రి దగ్గిరికి వచ్చి, ‘‘నాన్నా, మావాడేమన్నా ఇటుకేసి వచ్చాడా? వాడు బొత్తిగా కూర్చున్నచోటి నుంచి కదలడు, ఎంత చిన్నపని చెప్పినా చెయ్యడు. మొన్న ప్రాణం విసిగి నాలుగు తగిలించాను. ఆ తరవాత వాడు ఎటువెళ్ళాడో మరి, ఇంటికి తిరిగి రాలేదు,’’ అన్నాడు విచారంగా.


‘‘పోతే పోయాడులేరా, సోమరి వెధవ. దమ్మిడీకి కొరగాని అప్రయోజకుడు ఉండి మాత్రం నిన్ను ఉద్ధరిస్తాడా? అలాంటి వాణ్ణి గురించి నువ్వేమీ విచారించకు,’’ అన్నాడు మోహనుడితో తండ్రి. మోహనుడు ఇంకేమీ అనక విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు.

తన భర్త  కొడుకుజాడ తెలుసుకోకుండానే తిరిగి వచ్చేసరికి మోహనుడి భార్య, ‘‘వాణ్ణికొట్టి ఏం ప్రయోజనం? వాడి బుద్ధి ఏమన్నా మార్చగలిగారా? చిన్న వెధవ. ఎక్కడున్నాడో ఏమో, ఏమైపో…యాడో,’’ అంటూ బావురుమన్నది. మోహనుడు మళ్ళీ కొడుకును వెతుక్కుంటూ బ…యలుదేరాడు. ఆ ఊళ్ళోనే కాకుండా ఇరుగు పొరుగు గ్రామాలలో ఎరిగివున్న వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి అడిగాడు. ఎదురు పడ్డ వాళ్ళందరినీ తన కొడుకును గురించి ఆరాతీశాడు. అయినా ప్రయోజనం లేక  పోయింది. తీరని విచారంతో ఇంటికి తిరిగివచ్చాడు.

ఉన్న ఒక్క కొడుకునూ చేజేతులా పోగొట్టుకున్నాననే దిగులుతో మోహనుడు మంచంపట్టాడు. ఈ సంగతి తెలిసి మోహనుడి తండ్రి తన మనవణ్ణి వెంటబెట్టుకుని మోహనుడి ఇంటికి బ…యలుదేరి వచ్చాడు. మోహనుడు కొడుకును చూడగానే కౌగలించుకుని, బావురుమని ఏడ్చాడు. మోహనుణ్ణి తండ్రి ఓదార్చుతూ, ‘‘పితృ వాత్సల్యం అట్లాగే వుంటుందిరా, నా…యనా!

వాడు అప్రయోజకుడవుతున్నాడన్న బాధ కొద్దీ కొట్టావుగాని, వాడి మీద ప్రేమలేక కొట్టావా? నాలుగు రోజులు వాడు ఎదట లేకుండా పోయేసరికి ఎలా డీలాపడి పో…యావో చూడు! నేనూ అంతే. నువ్వు బాగుపడవేమోనన్న బాధతోనే నిన్ను తిట్టాను, కొట్టాను. నీ మీద ప్రేమలేక కాదు. ఎంత చెప్పినా వినకుండా నువ్వు వేరుపడి పోయిననాడు నే నెంత క్షోభపడ్డానో ఇప్పుడు తెలిసివచ్చిందా?’’ అన్నాడు. ఆ తరవాత మోహనుడు తన తప్పు తెలుసుకుని, అప్పటికప్పుడే భార్యాబిడ్డలతో తన ఊరికి తిరిగివచ్చి తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవించాడు.


No comments:

Post a Comment