Pages

Thursday, September 6, 2012

దుంగ బరువు

పరీక్షలు ముగిశాయి. గోపీ అతడి స్నేహితులు పట్నం నుంచి ఊరు చేరుకున్నారు. ఒకరోజు అడవికి వెళ్లి దుంగలు కోసుకు రావాలని అందరూ అనుకున్నారు.

తెల్లవారు జామునే లేచి అడవి బాట పట్టారు. నడిచీ నడిచీ అడవి చేరుకున్నారు. దుంగల కోసం అనువుగా ఉండే చెట్లు ఎంచుకున్నారు.  గోపీ స్నేహితులతో కలిసి దుంగల కోసం అడవికి వెళ్లి చెట్లు కోయడం మొదలెట్టారు. దుంగలు నరకడం పూర్తయ్యాక వాటిని మోసుకుంటూ ఇంటిమార్గం పట్టారు.

ఇతరులతో పోలిస్తే గోపీ అందరికన్నా పెద్ద దుంగను మోస్తున్నాడు. దుంగ బరువు పెద్దది కావడంతో గోపీ అలసిపోయి దుంగను కిందపడేశాడు.  కూర్చుని ఆలోచించడం మొదలు పెట్టాడు.  'ఈ మోత మొయ్యడం నా వల్ల కాదు బాబూ... దుంగ పొడవును కాస్త తగ్గించి చూస్తా మరి..'

బరువు తగ్గిన దుంగను గోపీ నెత్తిన పెట్టుకుని సంతోషంగా ఇంటిదారి పట్టాడు. ఉన్నట్లుండి వారు నడుస్తున్న దారిలో భూమి రెండుగా చీలిపోయి ముందుకు పోవడానికి వీల్లేకుండా పోయింది.

అయ్యో ఇప్పుడెలా ఇల్లు చేరడం..  మిత్రబృందంలో సందేహాలు.. కాస్త బుర్ర ఉపయోగించిన మిత్రులు తమ దుంగలను చీలిన భూమికి అడ్డంగా పరిచి అవతలివైవుకు దాటుకుని వెళ్లారు.

చివర్లో గోపీ తన దుంగను కూడా చీలిన భూమి అవతలకు పరచబోయాడు. అయితే బరువుగా ఉందని దుంగను కోసి వేసినందువల్ల అది చీలికకు సగానికి కూడా రాలేదు.  అవతలకు పోవడానికి ఆస్కారమే లేదు. ఊహించని పరిణామానికి గోపీ ఖిన్నుడయ్యాడు.

గోపీ ఆలోచనలో పడిపోయాడు.  అయ్యో ఎంతపని జరిగింది. బరువుగా ఉందని చెప్పి దుంగను కోసి ఉండకపోతే బాగుండేది కదా.. కాస్త ఓర్పు లేనందుకు తగిన శాస్తి జరిగింది....  

No comments:

Post a Comment