సమస్యలన్నీ తీరిపోవడంతో రాజ్యపాలకుడైన రాజాధిరాజు దృష్టి రుచికరమైన
ఆహారపానీ యూలవైపు మళ్ళింది. సుష్టుగా తినడం, హాయిగా నిద్రపోవడం ఇవే
దినచర్యగా మార డంతో, రాజు మరీ లావుగా తయూరయ్యూడు. ఆయన స్థూలకాయూన్ని చూసి
ప్రజలు నవ్వుకో సాగారు. రాజోద్యోగులు ఎదురుపడినప్పుడు నవ్వలేక తలలు పక్కకు
తిప్పుకోసాగారు. యువరాజుగా ఉన్నప్పుడు రాజాధిరాజు చాలా చలాకీగా, అందంగా
ఉండేవాడు.
ఆయన ఠీవిగా గుర్రంపై వెళుతూంటే చూసే వాళ్ళు ఆనందాశ్చర్యాలు చెందేవారు.
ఆయన తండ్రి మరణానంతరం యువరాజు సింహాసనాన్న ధిరోహించాడు. రాజాస్థానంలో
ఆరుగురు మంత్రు లున్నారు. వారిలో ప్రధానమంత్రి కావాలనే తపన నలుగురిలో
విపరీతంగా ఉండేది. అందువల్ల తమలో తాము పోటీ పడసాగారు. కొత్తగా అధికారానికి
వచ్చిన రాజాధిరాజుకు అది పెద్ద సమస్యగా తయూరయింది. ఆయన త్వరగా
ఒకనిర్ణయూనికి రాలేక పోయూడు.
అందువల్ల మంత్రులు తమ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం చూప సాగారు. దాంతో
పరిపాలనా వ్యవస్థ అస్త వ్యస్త మయింది. రాజాధి రాజు తీవ్రంగా ఆలోచిం చాడు.
విశ్వాస పాత్రులైన అధికారుల సాయంతో పరిపాలనా వ్యవహారా లను చక్కదిద్దాడు.
ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతూన్న నలుగురు మంత్రులనూ తొలగించి, వారి
స్థానంలో కొత్త వారిని నియ మించి వారికి మరిన్ని అధికారాలు ఇచ్చాడు.
దాంతో
పరిపాలనావ్యవస్థ పూర్తిగా అదుపులోకి వచ్చింది. సమస్యలన్నీ సమసిపోయి,
రాజ్యంలో శాంతిసుఖాలు వెలిశాయి. వెంటనే దృష్టి సారించ వలసిన సమస్యలేవీ లేవు
గనక రాజుగారి దృష్టి ఆహారపానీయూలవైపు మళ్ళింది. పర్య వసానంగా ఆయన
మితిమించిన స్థూల కాయుడైపోయి, చూసే వాళ్ళందరూ నవ్వుకు నేలా తయూరయ్యూడు. అదీ
ఇప్పటి సమస్య! తనను చూసేవారందరూ ఎందుకు నవ్వు కుంటున్నారో రాజుకు ఓ పట్టాన
అర్థం కాలేదు.
విశ్వాస పాత్రుడైన ఒక మంత్రిని పిలిచి కారణం అడిగాడు. ‘‘ప్రభువులు
ఆగ్రహం చెందరని మాట ఇస్తే అసలు విషయం చెబుతాను,'' అన్నాడు మంత్రి.
‘‘నిర్భయంగా చెప్పు,'' అని రాజు మాట ఇచ్చాక, ‘‘తమ ఆకారాన్ని చూసుకుంటే
ప్రభు వులకే తెలుస్తుంది ఎంత లావుగా ఉన్నారో,'' అన్నాడు మంత్రి
కంఠస్వరాన్ని తగ్గించి. రాజు ఒకసారి తనకేసి పరిశీలనగా చూసు కుని, ‘‘అవును.
లావుగానే ఉన్నాను.
మరి నన్నేం చేయమంటావు?'' అని అడిగాడు. ‘‘ప్రభు వులు, బలవర్థకమైన ఆహారం
తీసుకోవడం తగ్గించాలి,'' అన్నాడు మంత్రి. ‘‘అది, అసాధ్యం!'' అన్నాడు రాజు
దృఢనిర్ణయంతో. మంత్రి మరేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయూడు. రాజు కొంతసేపు
తీవ్రంగా ఆలోచించి, ఉన్నట్టుండి, ‘‘ఆ, ఇప్పుడు తెలిసి పోయింది. నా
ప్రజలందరూ కూడా రుచికర మైన వంటకాలను సుష్టుగా భుజించి నాలాగే లావుగా
తయూరవ్వాలి.
అప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వలేరు కదా. ప్రజలందరికీ కావలసిన
సరుకులను సరసమైన ధరకు ఇవ్వాలని వ్యాపారులను పురమాయించు. అందరూ కడుపు నిండా
తినాలి. ఆరు నెలలలోగా ప్రతి ఒక్కరూ లావెక్కాలి. ఆ తరవాత కూడా సన్నగా ఉన్న
వారిని జైల్లో పెట్టి బలవంతంగా తినిపిస్తామని ప్రజలను హెచ్చరించు!''
అన్నాడు. రాజాజ్ఞ క్షణాలలో నెరవేర్చబడింది. ఎవరికీ జైలుపాలవడం ఇష్టం ఉండదు
గనక, అందరూ మితిమించి తినసాగారు.
కావలసిన పానీయూ లను తాగసాగారు. అందువల్ల ప్రజలందరూ స్థూలకాయులుగా
తయూరయ్యూరు. రాజాధి రాజు రాజవీధిలో గుర్రంపై వెళుతూ, దారికి ఇరువైపులా
బారులుతీరి నిలబడిన స్థూలకా యులను చూసి ఎంతో సంతోషించాడు. అయితే ఈ సంతోషం
ఆట్టేకాలం నిలవ లేదు. అంతవరకు మెరుపుతీగలా అందంగా కనిపించిన రాజుగారి ఏకైక
కుమార్తె మాళవిక కూడా రోజురోజుకూ లావు కాసాగింది.
ఆమె
స్థూలకాయూన్ని రాజు చూడలేకపోయూడు. ఆయన మంత్రులను సంప్రదించాడు. వాళ్ళూ
పోటీపడి లావెక్కుతున్నారు. రాజాజ్ఞ నుంచి యువరాణిని మినహాయించాలని
ఏకగ్రీవంగా సలహాయిచ్చారు. అయితే, యువరాణికి అప్ప టికే ఎల్లప్పుడూ తింటూండడం
అలవాటై పోయింది గనక, ఆ అలవాటును ఆమె మాను కోలేక పోయింది.
అందువల్ల ఆమె ఎప్పటిలాగే తింటూ లావుగానే ఉండిపోయింది. దీనికేదైనా
వైద్యం వుండక పోదని ఆశిం చిన రాజు మరో ప్రకటన చేశాడు: యువరాణి స్థూల
కాయూన్ని తగ్గించిన వైద్యుణ్ణి ఘనంగా సన్మానిస్తాం. ఆ వైద్యుడే గనక సన్నగా,
అందంగా వున్న యువకుడైతే యువరాణిని అతనికే ఇచ్చి వివాహం చేస్తాం. అతడే
భవిష్యత్తులో ఈ రాజ్యా నికి రాజవుతాడు. అయితే, స్థూల కాయూన్ని తగ్గిస్తానని
వచ్చి, చేయ లేనివాడికి శిరశ్ఛేదం తప్పదు!
ఆ చాటింపు విని రాజ్యంలోని కొందరు వైద్యులు, రాజు ఎదుటికి రావడానికి
భయపడి ఎక్కడెక్కడో దాక్కున్నారు. ఇలా రోజులు, వారాలు, నెలలు గడిచాయి. కాని
ఒక్క వైద్యుడూ ముందుకు రాలేదు. ఒకనాటి ఉదయం, రాజధాని సమీపంలోని
అరణ్యప్రాంతంలో ఒక యువకుడు చెట్లమధ్య ఏవో ఆకులలములు వెతుకుతూండడం రాజ భటులు
చూశారు. విచారించగా, అతడు పొరుగు దేశానికి చెందిన వైద్యుడనీ ఒక ముఖ్య మైన
మూలిక కోసం వెతుకుతున్నట్టూ తెలి సింది.
రాజభటులు అతన్ని రాజు సమక్షానికి తీసుకువచ్చారు. ఆ యువకుడు వైద్యుడని
తెలియగానే రాజు సంతోషించాడు. పైగా అతడు సన్నగా అందంగా ఉన్నాడు. రాజు,
యువరాణి సమస్య అతనికి చెప్పాడు. అంతావిన్న ఆ యువకుడు, ‘‘ప్రభూ, రాజ్యంలో
ప్రజలందరూ స్థూలకా యులుగానే ఉన్నారు; అలాంటప్పుడు యువ రాణి స్థూలకాయూన్ని
మాత్రం తగ్గించాలంటే నావల్ల అవుతుందా? ఇదేదో ఈ రాజ్యాన్నంతటినీ పట్టి
పీడిస్తూన్న రుగ్మత.
నామీద కరుణించినన్ను వదిలిపెట్టండి. వెళ్ళి అడవిలో మూలికలు వెతుక్కుని
మా రాజ్యానికి వెళ్ళిపోతాను,'' అన్నాడు. ‘‘నువ్వేం చెప్పినా నేను వినను.
నాతో రా. నీకెన్ని బహుమానాలు కాచుకుని ఉన్నాయో చూడు. నా కుమార్తెను వివాహ
మాడి, ఈ రాజ్య సింహాసనానికే వారసుడివి కాగలవు,'' అంటూ రాజు ఆ యువవైద్యుడి
చేయిపట్టుకుని, యువ రాణి శయనగృహానికి లాక్కుపోయి ఆమెను చూపుతూ, ‘‘నయం
చేయగలవేమో చూడు.
అందుకు కావలసిన సకల సదుపాయూలూ సమకూర్చగలం,'' అన్నాడు. యువవైద్యుడు
యువరాణి కళ్ళకేసి పరీ క్షగా చూశాడు. ఆమె నొసటిని అరచేత్తో తాకి చూశాడు. ఆ
తరవాత ఆమె చేతిని పట్టుకుని నాడి పరీక్షించాడు. ఆ పిమ్మట కొంతసేపు మౌనంగా
ఆలోచించి తలపైకెత్తి, ‘‘ప్రభువులు క్షమించాలి.
మీ కుమార్తె మరో నూట మూడు రోజులు మాత్రమే ప్రాణాలతో ఉండగలదు! అందువల్ల
ఆమె స్థూలకాయూన్ని తగ్గించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు,'' అన్నాడు
విచారంగా. ఆమాట వినగానే, రాజదంపతులు దిగ్భ్రాంతి చెందారు. కొంతసేపటికి
నెమ్మదిగా కోలుకున్న రాజు, ‘‘నువ్వు నా కుమార్తె భవిష్యత్తు చెప్పి నందుకు
నిన్ను శిక్షించను. అయితే, నూట మూడు రోజులకు పైగా ఆమె ఒక్కరోజు ప్రాణా లతో
ఉన్నా నీ ప్రాణాలు దక్కవు.
అంతవరకు నీకు కారాగారవాసం తప్పదు,'' అన్నాడు. యువరాణి మాళవిక రానున్న
తన మర ణాన్ని తలుచుకుని కొన్నాళ్ళు దీనాతి దీనంగా విలపించింది.
చెలికత్తెలనూ, తల్లిదండ్రులనూ శాశ్వతంగా వదిలి వెళ్ళడం ఆమెకు తీరని వేదనను
కలిగించింది. భోజనం అంటే విరక్తి పుట్టింది. కొన్నాళ్ళకు ఆహారం ముట్టుకోలేక
పోయింది. మరికొన్నాళ్ళకు పానీయూలు తీసు కోవడం కూడా మానివేసింది. ఒట్టి
నీళ్ళతోనే సరిపెట్టుకోసాగింది.
కుమార్తెకు రానున్న అకాల మరణాన్ని తలుచుకుంటూ రాజూ, రాణీ కూడా
ఆహారపానీయూలు మానేశారు. ముఖ్యంగా రుచికరమైన వంటల జోలికి పోలేదు. నూరు
రోజులు గడిచి పోయూయి. కుమార్తె శోక వదనాన్ని చూడలేక రాజు అటు వెళ్ళడం
తగ్గించాడు. అయినా ఆమె ఆరోగ్య స్థితిని చెలి కత్తెల ద్వారా ఎప్పటికప్పుడు
తెలుసుకుంటూనే ఉన్నాడు. నూట ఒకటవ రోజు ఒక చెలికత్తె వచ్చి, ‘‘ప్రభూ,
యువరాణి మందహాసం చేస్తున్నది. సుదీర్ఘకాలం జీవిస్తానంటున్నది,'' అని
చెప్పింది.
రాజు తన మెడలోని ఒక ముత్యాల హారాన్ని తీసి ఆ చెలికత్తెకు బహూకరించాడు.
మరునాడు మరొక చెలికత్తె వచ్చి, ‘‘ప్రభూ, ఈరోజు యువరాణి దానిమ్మరసం
అడిగింది,'' అని చెప్పడంతో రాజు ఆమెకు కూడా మరొక హారం ఇచ్చాడు. అందరూ
ఆతృతతో ఎదురు చూస్తూన్న మూడో రోజు రానేవచ్చింది. ‘‘ప్రభూ, ఇన్నాళ్ళ తరవాత ఈ
రోజు యువరాణి, భోజనం చేశారు,'' అంటూ ఇంకొక చెలికత్తె ఆనందకరమైన వార్త
తెచ్చింది.
రాజు ఆమెకు మరో హారాన్ని బహూ కరిస్తూ, ‘‘నేను రేపే వచ్చి మాళవికను
చూస్తా నని చెప్పు,'' అన్నాడు పరమానందంతో. అయినా ఆమె అటువెళ్ళగానే, ‘‘నా
గారాల పట్టి నిజం గానే రేపు ప్రాణాలతో ఉంటుందా?'' అన్న ఆలోచన రావడంతో రాజు
మళ్ళీ విచారగ్రస్తు డయ్యూడు. మరునాడు తెల్లవారే సరికల్లా, యువరాణి భవనానికి
వెళ్ళడానికి రాజు సంసిద్ధుడయ్యూడు. కాని అంతలోనే యువరాణి తన చెలికత్తెలతో
కలిసి తండ్రిని చూడడానికి అక్కడికి వచ్చింది.
‘‘మాళవికా! వచ్చావా? ఎంత చురుగ్గా ఉన్నావు తల్లీ!'' అన్నాడు రాజు
ఆనందాతిరేకంతో. ‘‘నాన్నా, ఆ వైద్యుణ్ణి పిలిపించండి. నేన తణ్ణి చూడాలి,''
అన్నది యువరాణి. ‘‘తప్పక రప్పిస్తాను. అయితే, భవిష్యత్తు తప్పుగా
చెప్పినందుకు అతణ్ణి ఉరికంబం ఎక్కిస్తాను,'' అన్నాడు రాజు. ‘‘నేను
ఆరోగ్యంగా ప్రాణాలతోనే ఉన్నాను కదా? అతడెందుకు మరణించాలి?'' అని అడి గింది
యువరాణి. కొంతసేపటికి వైద్యుణ్ణి రాజు వద్దకు తీసుకువచ్చారు.
‘‘నువ్వు చెప్పిన భవిష్యత్తును గురించి ఇప్పుడేమంటావు?'' అని అడిగాడు
రాజు. వైద్యుడు ఏమాత్రం భయపడకుండా గట్టిగా నవ్వుతూ, ‘‘ప్రభూ, ఇప్పుడు
యువరాణి సన్నగా, చాలా చలాకీగా ఉంది కదూ? ఆమె స్థూలకాయం ఏమయింది? అంతెం
దుకు, మిమ్మల్నే మీరు ఓసారి చూసు కోండి. ఎంత సన్నబడి పోయూరో!'' అన్నాడు.
రాజు తన్ను తాను ఒకసారి పరిశీలనగా చూసు కుంటూ, ‘‘అవును, నిజమే. సన్నబడి
పోయూను. అవును, ఇదంతా ఎలా జరిగింది?'' అన్నాడు ఆశ్చర్యంగా.
‘‘ప్రభూ నేను ఎలాంటి భవిషత్తూ చెప్పలేదు. మీరు మితి మించి భుజించ
కుండా ఉండడానికి తగిన పరిస్థితిని కల్పించాలనుకున్నాను. మీ స్థూల కాయూనికి
అసలు సమస్య అమిత ఆహారం. ఇప్పటికైనా దయచేసి, ప్రజలు స్థూలకాయు లుగా ఉండాలన్న
మీ ఆనతిని ఉపసంహ రించుకోండి. వాళ్ళను స్వతంత్రంగా వాళ్ళకు కావలసిన
ఆహారాన్ని తీసుకోనివ్వండి,'' అన్నాడు వైద్యుడు వినయంగా.
‘‘తప్పకుండా
ఆ పని చేస్తాను. అంతకు ముందు నేను నీకిచ్చిన మాటను కూడా నిల బెట్టుకోవాలి
కదా! నీకూ, మాళవికకూ త్వరలో వివాహం ఏర్పాటు చేస్తాను,'' అన్నాడు రాజు
మందహాసం చేస్తూ. కొన్నాళ్ళకు మాళవిక, యువవైద్యుడి వివాహం ఘనంగా జరిగింది.
రాజాధిరాజు వానప్రస్థానికి వెళ్ళడంతో యువవైద్యుడు సింహాసనం అధిష్ఠించాడు.
No comments:
Post a Comment