Pages

Tuesday, September 11, 2012

గుర్రం సకిలింపు తెచ్చిన రాజ్య సింహాసనం!


ప్రస్తుతం ఇరాన్‌గా పిలువ బడుతూన్న పర్షియూలో మూడువేల సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత వెలిసింది. ఒక సందర్భంలో సంపన్నమైన రాజ్య సింహాసనాన్ని స్మెర్డిస్‌ అనే కపటవర్తనుడు కుట్రచేసి ఆక్రమించాడు. వాడి పాలన ప్రజలకు శాంతి సుఖాలు సమకూర్చలేక పోయింది. స్మెర్డిస్‌ ప్రజలకు ఎలాంటి మేలూ చేయక పోయినప్పటికీ తన పదవిని రక్షించుకోవడానికి చాలా జాగ్రత్త వహించాడు.
 
వాడి చుట్టూ ఎప్పుడూ నమ్మకస్థులైన అంగరక్షకులు ఉండేవారు. గూఢచారులను ఏర్పాటు చేశాడు. వాడికి వ్యతిరేకంగా ఎవరైనా పెదవివిప్పారని తెలిస్తే చాలు. అప్పటికప్పుడే వారిని ఏరి పారేసేవాడు! ఎక్కువమంది మంత్రులూ, రాజోద్యోగులూ భయస్థులుగనక, రాజుకు వ్యతిరేకంగా నోరు విప్పలేక పోయూరు. అయినా కాలం ఒకేలాగ సాగదుకదా!
 
ఉన్నత కుటుంబాలకు చెందిన ఆరుగురు యువకులు దుష్టపాలకుడి పాలనకు చరమగీతం పాడాలని పకడ్బందీగా ఒక పథకాన్ని, రూపొందించారు. తమ పథకం విజయవంతంగా ముగిశాక, తరవాతి పాలకుడు ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్న మయింది. ఆ ఆరుగురు యువకులూ తెలివితేటల్లో గాని, శక్తిసామర్థ్యాల్లోగాని ఒకరికొకరు తీసిపోయిన వారుకారు. ఆరుగురికీ రాజు కావాలన్న కోరిక వుంది.
 
అయినా ఆరుగురూ ఒక్కసారిగా ఆ పదవిని చేపట్టలేరుకదా? అయినా, పదివీ కాంక్షకు మించిన స్నేహం వాళ్ళ మధ్య ఉందిగనక రాజపదవికోసం పో‘‘మీరే ఏదైనా ఒక పద్ధతిని సూచించండి,'' అన్నాడు మొదటి మిత్రుడు. ఆరుగురూ కొంతసేపు మౌనంగా ఆలోచించారు. ఆ తరవాత ఒక మిత్రుడు, ‘‘ఎంపిక ఎటొచ్చీ నిబంధనారహితంగానే జరగాలి. అందువల్ల ఇలా చేద్దాం. రేపు తెల్లవారగానే, మనం ఆరుగురం తటాకం పక్కన ఉన్న పచ్చిక మైదానం వద్దకు మన గుర్రాలపై వెళదాం. ఎవరి గుర్రం ముందు సకిలిస్తే, వారే సింహాసనానికి అర్హులవుతారు. ఏమంటారు?'' అన్నాడు.
 
‘‘చాలా బావుంది. అలాగే చేద్దాం,'' అన్నారు తక్కిన మిత్రులు. మరు రోజు అరుణోదయం అవుతూండగా ఆరుగురు మిత్రులూ, నిర్ణీత ప్రదేశంలో కలుసుకుని గుర్రాల మీద తటాకం సమీపంలో ఉన్న పచ్చిక మైదానంకేసి బయలుదేరారు. తటాకాన్ని సమీపిస్తూండగానే ఒక గుర్రం గట్టిగా సకిలించింది. దానిని అధిరోహించిన యువకుడి పేరు డేరియస్‌. మిగిలిన అయిదుగురు మిత్రులూ డేరియస్‌ను అభినందించారు. ఆ తరవాత రూపొందించుకున్న పథకం ప్రకారం స్మెర్డిస్‌ను పదవీచ్యుతుణ్ణి చేశారు.
 
డేరియస్‌ సింహాసనాన్ని అధిష్ఠించాడు. డేరియస్‌ ఎక్కిన గుర్రం మొట్టమొదట సకిలించడం వెనకవున్న రహస్యం ఎవరికీ తెలియదు. అసలు జరిగిందేమంటే - ఆరుగురు మిత్రులు భవిష్యత్తు రాజును నిర్ణయించడం గురించి చర్చించుకోవడం, డేరియస్‌ సేవకుడి చెవిన పడింది. వాడు ఆరోజు సాయంకాలమే డేరియస్‌ గుర్రాన్ని తటాకం దగ్గరికి తోలుకుపోయి దానికి తృప్తిగా మేత పెట్టాడు.
 
మరునాటి ఉదయం ఆ గుర్రం తటాకం దగ్గరికి వచ్చీ రాగానే, వెనకటి సాయంకాలం లభించిన సంతుష్ఠి కరమైన మేతను తలుచుకుని ఆనందంతో సకిలించింది! ఈ ఉదంతం కారణం గానే ‘గుర్రం రాజ్యాన్ని జయిస్తుంది,' అన్న సామెత ఏర్పడింది. నిజానికి ఒక సేవకుడు తన యజమానికి రాజ్యాన్ని సమకూర్చిన గాథ ఇది. సంగతి తెలిశాక డేరియస్‌ తన సేవకుణ్ణి తగిన రీతిలో సత్కరించాడా లేదా అన్నది తెలియదు. అయితే, క్రీ.పూ.
 

521లో పర్షియూ సింహాసనాన్ని అధిష్ఠించిన డేరియస్‌ ఎన్నో ఘనకార్యాలు చేసి చరిత్రప్రసిద్ధి పొందాడు. ప్రాచీన ఇరాన్‌ రాజధాని పర్సీపోలిస్‌ నగరాన్ని నిర్మించాడు. ‘‘దేవుడు ప్రపంచం సంక్షోభంతో తల్లడిల్లాలని ఆశించలేదు. తన బిడ్డలు శాంతి సౌఖ్యాలతో, సంపదలతో మంచి పాలనతో వర్థిల్లాలనే కోరుకున్నాడు!'' అని డేరియస్‌ తన శిలాశాసనాలలో ఉద్ఘాటించాడు.ట్లాడుకునే పరిస్థితిలేదు. ‘‘మిత్రులారా, మనలో ఒక్కరికే రాజు అయ్యే అవకాశం ఉంది. మిగిలిన ఐదుగురం రాజుకు సలహాదారులుగా ఉందాం.
 
ప్రజలకు సంబంధించిన విషయూలలో మంచి చెడ్డలను చర్చించి తగునిర్ణయూలు తీసుకుందాం. ఇప్పుడు మనలో రాజు ఎవరన్నది తీర్మానించడానికి మన మధ్య ఎలాంటి తేడాలూ లేవు. అది నిర్హేతుకంగానే జరగాలి. అది ఒక అసాధారణ పద్ధతిలోనే జరగాలి,'' అన్నాడు ఒక మిత్రుడు. ‘‘ఏమిటా అసాధారణ పద్ధతి?'' అని అడిగాడు రెండవ మిత్రుడు.


No comments:

Post a Comment