ప్రాచీన గ్రీకులు, రోమనులు రకరకాల దేవుళ్ళను, దేవతలను పూజించేవారు.
అటువంటి దేవతలలో మహిళలు పూజించిన వివాహాల అధిదేవత హీరా చాలా ముఖ్యమైనది.
రోమను పురాణాలలో ఆ దేవతను జూనో అనేవారు. ఒక చిన్న కొండమీద హీరా దేవత ఆలయం
ఉండేది. పర్వదినాలలో వందలాది మంది స్ర్తీలు ఆ దేవాలయూన్ని సందర్శించేవారు.ఆ
సమయూలలో ప్రధాన పూజారిణి, మేళతాళాలతో దేవతకు చేసే ప్రత్యేక పూజలను
తిలకించేవారు.
శుభప్రదమైన అలాంటి రోజుల్లో దేవతను దర్శించడం వల్ల స్ర్తీలకు,
ముఖ్యంగా పెళ్ళికాని యువతులకు సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసించేవారు.
ఒకసారి ఆలయ ప్రధాన పూజారిణి తన ఇద్దరు కొడుకులతో కలిసి దూరంలో ఉన్న
స్వగ్రామానికి వెళ్ళింది. ఆ సంవత్సరం ఆలయంలో జరిగే ఉత్సవం ప్రారంభమయ్యేలోగా
వాళ్ళక్కడికి తిరిగి రావాలి. అయితే, అంతలో పూజారిణికి ఉన్నట్టుండి జబ్బు
చేసింది.
అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ఆలయంలో ప్రధాన ఉత్సవానికి ఒక రోజు
ముందు, అక్కడికి ఎలాగైనా చేరుకోవాలని బయలుదేరింది. ఆ స్థితిలో ఆమెకు
అంతదూరం నడిచి వెళ్ళే ఓపిక లేదు. బండికోసం ఆమె కొడుకులు ప్రయత్నించారు. ఒక
బండి అయితే లభించిందిగాని, దానిని లాగడానికి గుర్రాలు లేవు. ఎడ్లు కూడా
బండిని లాగగలవుగాని, ఎంత ప్రయత్నించినప్పటికీ అలాంటి ఎడ్లు కూడా
కనిపించలేదు.
పూజారిణిలో అసహనం పెరగసాగింది. పొద్దు పోయి, రాత్రి వచ్చేసింది.
ఆలయూన్ని చేరుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది. తెల్లవారేలోగా ఆమె ఎలాగైనా
ఆలయూన్ని చేరుకోవాలి. వెళ్ళక పోతే దేవత ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది.
ప్రధాన పూజారిణి నిర్వర్తించ వలసిన ప్రత్యేక పూజలను ఆమె సహాయకులు చేయలేరు
గనక, ఆలయూనికి వచ్చే వందలాది భక్తులకు ఆశాభంగం కలగవచ్చు!
పూజారిణి కూమారులు బైటన్, క్లియోబిస్‌లు ఎంత ప్రయత్నించినా
గుర్రాలనుగాని, ఎడ్లను గాని తేలేక పోయూరు. తల్లిని ఆలయూనికి చేర్చడానికి
తీవ్రంగా ఆలోచించి, ఇద్దరూ చర్చించుకుని ఒక నిర్ణయూనికి వచ్చారు. తల్లిని
బండిలోకి ఎక్కి కూర్చోమని చెప్పారు.
ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ‘‘మీరెలాగైనా బండిని లాగే జంతువులను
తీసుకురాగలరనే నమ్మకంనాకున్నది,'' అంటూ బండిలోకి ఎక్కి కూర్చున్నది.
చీకటిగా ఉండడం వల్ల బండికి ముందు ఏమున్నదీ ఆమెకు కనిపించలేదు. కొడుకులను
బండిలోకి రమ్మన్నది. అయితే వాళ్ళు నడిచే వస్తామన్నారు. తమ కొడుకులు
దృఢకాయులు గనక, వారి మాటను ఆమె కాదనలేదు.
పైగా బండిలో ఒకరే ఉన్నట్టయితే, ప్రయూణం మరింత వేగంగా సాగవచ్చని ఆమె
ఆశించింది. బండి వేగంగా ముందుకు సాగింది. పూజారిణి కొంత సేపటికి బండిలో
అలాగే నిద్రపోయింది. ఆమెకు మెలకువ వచ్చేసరికి తెల్లవారుతున్నది. కొడుకులు
వస్తున్నారా అని ఆమె బండికి ఇరువైపులా చూసింది. ఎవరూ కనిపించలేదు. ఆ తరవాత
ఆమె చూపులు ముందువైపుకు మళ్ళాయి. ఇద్దరు కొడుకులూ బండిని లాగుతున్నారు!
ఆ రాత్రంతా వాళ్ళే బండిని లాగారన్న మాట! వాళ్ళు అనుకున్న
మహత్కార్యాన్ని సాధించారు. సూర్యోదయ మవుతూండగా ఆలయూన్ని సమీపించారు. ప్రధాన
పూజారిణి స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వర్తించడానికి సిద్ధమయింది. ఆమె
కుమారులు కూడా ఆలయం లోపలే ఉన్నారు. పూజాదిక్రతువులు పూర్తయ్యూక, ‘‘మహామాతా!
నా బిడ్డల్లా బాధ్యతాయుతంగా నడుచుకునే బిడ్డలు ప్రపంచంలో ఎంతమంది తల్లులకు
ఉంటారు!
వారి అద్భుత కృత్యానికి తగ్గ ఫలితం దక్కాలి. వాళ్ళిప్పుడు బాగా
అలిసిపోయూరు. మునుముందు వారికి అలుపూ అలసటా కలగని వరమివ్వు. దేనికీ
భయూందోళనలకు లోనుగాని విధంగా దీవించు. వారికి అత్యుత్తమ వరాన్ని
ప్రసాదించు!'' అని భక్తితో ప్రార్థించింది. ‘‘ఇచ్చాను!'' అన్న కంఠస్వరం
పూజారిణికి మాత్రం వినిపించింది. ఆమె ఆనందంతో కొడుకుల కేసి తలతిప్పి
చూసింది.
అంతవరకు
నిలబడి ఉన్న కొడుకులిద్దరూ నేలపై పడి ఉన్నారు. వారు గాఢ నిద్రలోకి
జారుకున్నారు. ఆ నిద్రకు అంతం లేకుండా పోయింది. చాలా సంవత్సరాల అనంతరం
అన్నదమ్ములు నిద్రలోనే మరణించారు! భయూందోళనలు లేకుండా, మరెన్నడూ అలుపూ,
అలసటా ఎరుగకుండా వాళ్ళు జీవించారనడంలో సందేహం లేదు!
No comments:
Post a Comment