శాంత మనసు ఆనందంతో ఉరకలు వేసింది. ఈ వేసవి సెలవులకు కేరళకు వెళుతూన్న
సంతోషకరమైన వార్తను చెబుతూ ఆరోజు తల్లి శాంతను పడక నుంచి లేపింది.
మలయూళీలకు చాలా ముఖ్యమైన పండుగ అయిన విషు వేసవి సెలవుల్లోనే కదా వస్తుంది
అన్న విషయం గుర్తురావడంతో, ‘‘అమ్మా, విషూకు మనం కేరళలో ఉంటామా?'' అని
తల్లిని అడిగింది. ‘‘అవును, ఈసారి విషూను అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి
జరుపుకుంటాం,'' అన్నది తల్లి చిన్నగా నవ్వుతూ.
సుదీర్ఘమైన రైలు ప్రయూణం తరవాత వాళ్ళు అక్కడికి చేరారు. శాంత పరుగున
వెళ్ళి అమ్మమ్మ చేతుల్లోకి చేరుతూ, ‘‘విషు ఎప్పుడు అమ్మమ్మా?'' అని
అడిగింది ఉత్సాహంగా. ‘‘రేపేనమ్మా! మొదట నువ్వు ఇంటి లోపలికి రా,'' అన్నాడు
తాతయ్య నవ్వుతూ. విషూకు కావలసిన వస్తువులను సేకరించుకు రమ్మని తాతయ్య
ఇంట్లోని చిన్నన్, కణ్ణన్ అనే ఇద్దరు పనిమనుషులను పురమాయిస్తుండడం
గమనించిన శాంత, వాళ్ళ వెంట వెళ్ళి వస్తానని పట్టుబట్టి బయలుదేరింది.
ఆమె చిన్నన్ వెంట పెరటి తోటలోకి వెళ్ళింది. కణ్ణన్ దూరంగా
వెళుతూండడం చూసి, ‘‘అతడెక్కడికి వెళుతున్నాడు?'' అని అడిగింది చిన్నన్‌ను.
‘‘ఇప్పుడే వస్తాడులే,'' అన్నాడు చిన్నన్ ముక్తసరిగా. దారిలో తనకోసం తాతయ్య
కట్టిన ఊయల వేలాడుతూన్న మామిడిచెట్టు కనిపించింది. కొమ్మల నుంచి దోరగా
మాగిన మామడిపళ్ళు గుత్తులు గుత్తులుగా కనిపించాయి. చిన్నన్ కొన్నిటిని
కోసి పేముబుట్టలో వేసుకున్నాడు. వాటి కమ్మని వాసన శాంతను ఆహ్లాదపరిచింది.
‘‘తరవాత ఏమిటి?'' అని అడిగింది శాంత చిన్నన్‌ను.
��చూస్తావుగా. మరీ అంత తొందరెందుకు? నా వెంట రా,�� అంటూ ముందుకు
నడిచాడు చిన్నన్�. కొంతసేపటికి ముళ్ళ కంచె గల తోటలోకి వాళ్ళు
అడుగుపెట్టారు. కొమ్మలూ, రెమ్మలూ కనిపించనంతగా బంగారు పసుపు రంగు పూలతో
విరబూసిన పొడవాటి �అరళి� చెట్టును చూసి శాంత పరవశం చెందింది. సాయంసంధ్య
సూర్యుడి కిరణాలు పడి పువ్వులు బంగారు నాణాల్లా మిలమిలా మెరుస్తున్నాయి.
ఈ పూలను రేపు దేవుడి విగ్రహాన్ని అలంకరించడానికి ఉపయోగిస్తారని
చిన్నన్� చెప్పాడు. ఆ తరవాత అతడు చెట్టెక్కి జాగ్రత్తగా పూల గుత్తులు కోసి
శాంతకు అందించాడు. ఆమె వాటిని బుట్టలో పెడుతూ, ��అయిపోయూయూ? ఇంకా
ఉన్నాయూ?�� అని అడిగింది. ��లేదు. ఇంకా ఉన్నాయి!�� అంటూ చిన్నన్� ఆమెను ఒక
పనస చెట్టు వద్దకు తీసుకువెళ్ళాడు. చెట్టు బోదెకు చాలా పనస పళ్ళు
వేళ్ళాళుతున్నాయి.
కొన్ని పళ్ళు నేలను తాకుతున్నాయి. చిన్నన్� అడుగున ఉన్న పనసపండు
తొడిమను కత్తితో కోసి పండును పక్కన పెట్టి బుట్ట పక్కన కూర్చుంటూ, ��నేను
వీటిని ఇంటికి చేర్చివస్తాను. నువ్వు ఇక్కడే ఉండు,�� అన్నాడు. ��ఎందుకు
చిన్నన్�?�� అని అడిగింది శాంత. ��కణ్ణన్� నిన్ను ఇక్కడి నుంచి
తీసుకువెళతాడు,�� అంటూండగానే కణ్ణన్� అక్కడికి వచ్చాడు. చిన్నన్�
పళ్ళబుట్టను తీసుకుని బయలుదేరాక, కణ్ణన్� శాంతను వెంటబెట్టుకుని కాయగూరల
తోట కేసి నడుస్తూ, ��ఇక్కడే మీ అమ్మమ్మ రకరకాల కాయగూరలు పండిస్తుంది.
నేనూ, చిన్నన్� ఆమె చెప్పినట్టు విత్తనాలు నాటడం, నీళ్ళు పోయడం, కాయలు
కోయడంలాంటి పనులు చేస్తూంటాం,�� అన్నాడు. ��అది సరే. మనం ఇక్కడికి ఎందుకు
వచ్చినట్టు?�� అని అడిగింది శాంత. ��విషుకనికి కావలసిన కూరగాయలను
కోసుకోవడానికి,�� అంటూ అతడు ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. శాంత అతణ్ణి మౌనంగా
అనుసరించింది. ఇద్దరూ తీగలు అల్లుకున్న పాదుల్లోకి వెళ్ళారు. కొన్ని తీగలకు
దోసకాయలు కనిపించాయి.
అల్లి బిల్లిగా అల్లుకున్న తీగలకు పిందెలు, కాయలు, చిన్నవీ, పెద్దవీ
ఉండడం చూసి శాంత సంతోషించింది. కన్నన్� వాటిలో కొన్నిటిని కోసుకున్నాడు.
ఇంటికి తిరిగి వచ్చి భోజనం ముగించాక శాంత తాతయ్య విషుకనిని అమర్చడం
ఆసక్తిగా చూసి వెళ్ళి పడుకున్నది. మరునాడు తెల్లవారుతూండగా రెండు చల్లని
చేతులు శాంత కళ్ళను మూసుకున్నాయి.
"శాంతా, ఈ రోజు విషూ కదా. లే... నేను చెప్పేంతవరకు కళ్ళు తెరవద్దు,"
అంటూ శాంత తల్లి ఆమెను పూజగదికేసి నడిపించింది. గదిలోకి అడుగు పెట్టాక,
"ఇప్పుడు కళ్ళు తెరువు," అన్నది తల్లి. శాంత కళ్ళు తెరిచింది. ఎదురుగుండా
బంగారు రంగు పువ్వులతో అందంగా అలంకరించబడిన కృష్ణ విగ్రహం. విగ్రహానికి
రెండు వైపులా రెండు దీపాలు. విగ్రహానికి ఎదుట ఇత్తడి పాత్ర. బియ్యం, పెసలు,
చిక్కుడు, దోస మొదలైన కూరగాయలు, మామిడి, అరటి పళ్ళు ఆ పాత్ర నిండుగా
అమర్చబడ్డాయి.
పక్కనే పనస పండు. రెండు చిప్పలుగా కొట్టిన కొబ్బరికాయి. వాటిలో వెండి
నాణాలు. పాత్రకు మరోవైపు చేనేత బట్టలో చుట్టిన బంగారు ఆభరణాలు. ఎదురుగా
ఉన్న రాగిచట్రం గల పెద్ద అద్దంలో శాంత తన ప్రతిబింబాన్ని-పాత్ర పూలు,
పళ్ళు, కాయగూరలు, వెండి, బంగారం కొబ్బరికాయల మధ్య-చూసుకుని మురిసి పోయింది.
ఎందుకిలా చేస్తారు? వీటి అర్థం ఏమిటి? అన్న ప్రశ్నలు ఆమె మనసులో
కదలాడసాగాయి. స్నానం ముగించి ఈ ప్రశ్నలన్నిటినీ అడగాలని తాతయ్య వద్దకు
పరిగెత్తింది. "ఆగు," అంటూ తాతయ్య తమలపాకులు పచ్చివక్క, ఒక రూపాయి నాణెం
ఆమె చేతిలో పెట్టాడు. "ఇదేమిటి తాతయ్యూ?" అంటూ తన మొదటి ప్రశ్నను అడిగింది
శాంత.
‘‘ఈ రోజు విషు. అంటే మనకు కొత్త సంవత్సరాది. ఈ రోజు డబ్బు ఇవ్వడం,
పుచ్చుకోవడం చేస్తే సంవత్సరమంతా సంపదలు వస్తూంటాయన్నది నమ్మకం. అది సరే, ఈ
రోజు మొట్టమొదట విషుకనిని ఎందుకు చూస్తామో తెలుసా?'' అని ఆగాడు తాతయ్య.
‘‘తెలియదు, ఎందుకో చెప్పు తాతయ్యూ,'' అన్నది శాంత. ‘‘సాధారణంగా చాలా
పండుగలలో మనం పంటలకు ప్రాముఖ్యతనిస్తాం.
విషు కూడా అలాంటిదే. ఈ రుతువులో మాత్రమే పూచే ‘అరళి'ని, ఈ కాలఘట్టంలో
కాచే కాయగూరలను, పళ్ళను, విషుకనిలో అమర్చుతాం. పూలూ, పళ్ళూ, కాయగూరలూ,
వెండీ, బంగారం చుట్టూగల అద్దంలో మొట్టమొదట మన ప్రతిబింబాన్ని చూడ్డం వల్ల
సంవత్సరమంతా సకల ఐశ్వర్యాలు వచ్చి చేరుతాయనీ, అన్నీ శుభాలే జరుగుతాయనీ ఒక
విశ్వాసం.
పైగా ఇలా చేయడం వల్ల మనం చెట్టు చేమలు, జంతు జాలం నిండిన ప్రకృతిలో
అంతర్భాగమనే సత్యాన్ని కూడా గ్రహించకలుగుతామన్న మాట. మొత్తం ప్రకృతిలో మనం
ఒక భాగమని విషుకని గుర్తు చేస్తుంది,'' అని వివరించాడు తాతయ్య. మధ్యాహ్నం
విందు భోజనంతో విషుకనిలో ఉంచిన బియ్యం, పప్పులతో పొంగల్ తయూరు చేశారు.
దానికి తోడు రకరకాల కూరగాయలు.
కొత్తగా
కోసిన పనస పండు తొనలుచివరగా. విందు భోజనం ముగించి చుట్టు పక్కల తన ఈడు
పిల్లలతో కలిసి శాంత కొంతసేపు ఉయ్యూలలూగింది. ఆమె మనసులో ఒక వింత ఆనందం. ఈ
పండుగల వెనక ఉన్న అంతరార్థం తెలుసుకున్న సంతోషం; ప్రకృతి మాత ఒడిలో భద్రంగా
ఉన్నాను అన్న తృప్తి ఆమెకు కలిగాయి.
No comments:
Post a Comment