సువిశాల వినీల ఆకాశం కింద ప్రశాంతమైన పల్లెటూరు. పల్లెటూరి చుట్టూ
పరచుకున్న పచ్చటి వరి పొలాలు. అల్లనల్లన గాలులు వీస్తుంటే మురిసిపోయిన
పరిపొలాలు తమ పచ్చదనం అందమా? ఆకాశం నీలి రంగు అందమా? అని పోల్చి
చూసుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి! ప్రకృతి అందమైనదే.
అయినా పొలాల్లో చెమటోడ్చి కాయకష్టం చేసే రైతులకు పంటలు పండించడంలో
సాయపడకపోతే, అది అందం అనే మాట అర్థాన్ని కోల్పోయి ఉండేది. పంటలు పండడానికి
ఒక్క వర్షం మాత్రమే ప్రధానమని అనుకోకండి పిల్లలూ. మన రైతులు శ్రమతో నదుటి
నుంచీ, వీపులు, వక్ష స్థలాలు, కణతుల నుంచీ జార్చే చెమట ధారలను
మరిచిపోకూడదు. వాళ్ళు పడే శ్రమకు తప్పక ఫలితం లభించాలి. సరే, దాన్ని
గురించి తరవాత నింపాదిగా మాట్లాడుకుందాం.
ఇప్పుడు ప్రతి చిన్నారీ చదివి ఆనందించి, ఎన్నటికీ మరిచి పోలేని చక్కటి
కథ ఒకటి చెబుతాను. పొలంలో రైతులాగే ఆకాశంలో రోజంతా కష్టపడి పనిచేసిన
సూర్యుడు అస్తమిస్తున్నాడు. రోజంతా ఆకాశంలో శ్రమపడి, అరుదైన నక్షత్రాల
పంటను పండించే ఒంటరి రైతు సూర్యుడు అని చెప్పవచ్చు! సూర్యుడు అస్తమిస్తూన్న
సమయంలో పురుషులూ, స్ర్తీలూ అయిన రైతులు మైత్రీసహకారంతో విత్తి, పెంచి,
పండించిన పంటను, ధాన్యాలను తలల మీదికి ఎత్తు కుని పొలాలనుంచి ఇళ్ళకు తిరుగు
ప్రయూణమవుతున్నారు.
వాళ్ళవెంట కొందరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కొందరు పిల్లలు
సంతోషంగా తల్లులకు హత్తుకుని ఉన్నారు. మరికొందరు తల్లుల వెంట
నడుస్తున్నారు. అయితే, ఒక పిల్లవాడు మాత్రం సీతాకోక చిలుకలను తరమడంలో
నిమగ్నమైపోయూడు. వాటిని చూస్తే ఎవరికి మాత్రం సంతోషం కలగదు? కొన్ని సీతాకోక
చిలుకలకు తెల్లటి చుక్కలతో పొడవాటి నల్లటి రెక్కలున్నాయి.
మరికొన్ని నారింజ తెలుపువి. ఇంకా కొన్నయితే తెల్లటి చుక్కలతో ఎరగ్రా
ఉన్నాయి. ఎంతటి అద్భుతమైన ప్రాణి సీతాకోకచిలుక! అది రెపరెపలాడే అందమైన
పద్యం! ఎగిరే పువ్వు! అలాగే పువ్వును ఎగరలేని సీతాకోకచిలుక అని చెప్పవచ్చు!
పొలాలకు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న తమ గుడిసెలకు రైతులు
తిరిగివెళుతున్నారు. ఎంత దూరమైనా సరే పేదరైతులు నడిచే వెళతారు.
వాళ్ళ పాదాల స్పర్శ లేకుండా బాటలు సుఖంగా, సంతోషంగా ఉండలేవు!
సీతాకోకచిలుకలను తరుముతూన్న పసివాడు ఉన్నట్టుండి తన తల్లికి దూరమైపోయినట్టు
గ్రహించి ఉలిక్కిపడ్డాడు. ‘‘అమ్మా! అమ్మా!'' అంటూ గట్టిగా పిలవసాగాడు.
కాని అప్పటికే చాలా దూరం ముందుకు వెళ్ళి పోవడంతో ఆమెకు కొడుకు పిలుపు
వినిపించ లేదు. పైగా సూర్యుడు పూర్తిగా అస్తమించడంతో చీకటి అలముకోసాగింది.
పిల్లవాడి,
‘‘అమ్మా, అమ్మా!'' అనే అరుపులతో గాలి ప్రతిధ్వనించసాగింది. బాట ఒంటరిగా
ఉంటోంది. పొలాలు ఒంటరిగా ఉన్నాయి. పరిసరాలన్నీ ఒంటరిగానూ, నిశ్శబ్దంగానూ
ఉన్నాయి. అదృష్టవశాత్తు ఎదుటి వైపునుంచి చామన ఛాయతో దృఢకాయుడైన ఒక రైతు
వచ్చాడు. ‘‘ఎందుకు ఏడుస్తున్నావు, నాయనా!'' అని అడిగాడు ఆ రైతు. తప్పక
సాయపడతాను అన్న ఆదరం ఆయన కంఠస్వరంలో వినిపించింది. ‘‘నాకు మా అమ్మ
కావాలి!'' అంటూ ఏడ్వసాగాడు పిల్లవాడు.
‘‘మీ అమ్మ ఎలా ఉంటుంది?'' అని అడిగాడు రైతు. ‘‘చాలా అందంగా ఉంటుంది,''
అన్నాడు పిల్లవాడు. ‘‘ఏడవొద్దు. మీ అమ్మను నేను తీసుకువస్తాను,'' అన్నాడు
రైతు. అంతలో ఒక అందమైన స్ర్తీ అటువైపుగా వస్తూ కనిపించింది. ‘‘ఇదా మీ అమ్మ?
చాలా అందంగా ఉంది,'' అన్నాడు రైతు. ‘‘కాదు, కాదు.
మా అమ్మ ఈ ప్రపంచంలోకెల్లా చాలా అందమైన స్ర్తీ!'' అన్నాడు పిల్లవాడు. ఆ
తరవాత మరొక స్ర్తీ అటుకేసి వచ్చింది. ‘‘అదా మీ అమ్మ?'' అని అడిగాడు రైతు.
‘‘కాదు, కాదు. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. ప్రపంచంలో అందరికన్నా చాలా
అందంగా ఉంటుంది,'' అంటూ ఏడ్వసాగాడు పసివాడు. తరవాత ఒకరి వెనక ఒకరుగా చాలా
అందమైన స్ర్తీలు అటువైపు వచ్చారు. వాళ్ళందరినీ చూసినా వారిలో ఎవరూ తన తల్లి
కాక పోయేసరికి పసివాడు పట్టరాని దుఃఖంతో ఏడ్వసాగాడు.
ఇక తన తల్లిని చూడలేనేమో అన్న భయం వాడికి పట్టుకున్నది. అయినా,
పరిపూర్ణంగా విశ్వసిస్తే ప్రేమ ఫలిస్తుంది. కొద్ది దూరంలో తన తల్లి రావడం
కనిపించగానే పట్టరాని ఆనందంతో అరుస్తూ వెళ్ళి, ఆమె కాళ్ళను చుట్టుకుని,
‘‘ఇదీ మా అమ్మ! మా అమ్మ వచ్చింది! ఆహా, వచ్చేసింది,'' అన్నాడు పిల్లవాడు.
చామనఛాయ రైతుకు నవ్వాగ లేదు. అతడి నవ్వు విని భూలోకంలో ఏం జరిగిందా అని
ఆకాశంలోని దేవతలు విస్తుపోయూరు.
ఆ పిల్లవాడి తల్లి అతి సామాన్యమైన పేద రైతుమహిళ. ఆమెకు ఒక కన్నుకూడా
లేదు. ఆమె ముఖం ఎండకు కమిలి పోయి నల్లగా ఉంది. ‘‘ఇదా మీ అమ్మ? ఈమె
ప్రపంచంలోకెల్లా చాలా అందమైన స్ర్తీయూ?'' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా
నవ్వసాగాడు రైతు. ‘‘అవును. ఈమె ప్రపంచంలోకెల్లా చాలా అందమైన స్ర్తీ-మా
అమ్మ,'' అన్నాడు పిల్లవాడు. వాడికంఠస్వరంలో పసిప్రాయపు వసంత పుష్పాలన్నీ
ఇమిడి ఉన్నట్టు అనిపించింది!
No comments:
Post a Comment