Pages

Saturday, September 15, 2012

రంగన్న గొప్ప మనసు!


ఒక గ్రామంలో రంగన్న అనే పేదరైతు ఉండే వాడు. నిజాయితీపరుడైన రంగన్న తనకున్న కొద్ది పాటి పొలంలో కష్టపడి పనిచేసుకుంటూ తృప్తిగా కాలం గడపసాగాడు. దాంతోపాటు ఇరుగు పొరు గుకు చేతనైన సాయం చేసేవాడు. పక్షులన్నా, జంతువులన్నా అతనికి ఎనలేని ప్రీతి. ఏ కాకికో, కుక్కకో ఇంత పెట్టకుండా రంగన్న నోట్లోకి ముద్ద దిగేది కాదు. రంగన్న ఇంటికి కొద్ది దూరంలో రామశాస్ర్తి అనే ఒక నకిలీ జ్యోతిష్కుడు ఉండేవాడు.
 
శాస్ర్తం, సంప్రదాయం, దోషం, పరిహారం అంటూ అమా యకులైన గ్రామ ప్రజలను మభ్యపెట్టి, వాళ్ళ నుంచి సొమ్ములు గుంజి పొట్టపోసుకునేవాడు. ఎప్పుడు చూసినా ఎంతో సంతోషంగా కనిపిస్తూ, ఒక్కసారి కూడా తన వద్దకురాని రంగన్న అంటే రామశాస్ర్తికి, చెప్పరాని అసూయూ, కోపమూ ఉండేవి. ఒకరోజు రంగన్న తన పొలంలో విత్త నాలు విత్తేపని ముగిం చుకుని ఇంటికి బయలు దేరుతూం డగా పొలం గట్టు మీది పొదమాటున పిచ్చుక ఒకటి కాలు విరిగి లేవలేక పడి ఉండడం గమనిం చాడు.
 
వెంటనే వెళ్ళి దాన్ని చేతిలోకి తీసు కుని పరిశీలనగా చూశాడు. దాపులనున్న ఆకులేవో కోసి, నలిపి పసరు పిండి పిచ్చుక కాలికి పూశాడు. దాన్ని అక్కడే వదిలేయడానికి మనసురాక, తనతో ఇంటికి తీసుకువచ్చాడు. దానికి తినడానికి బియ్యపు గింజలు అందిం చాడు. చాప మీద చిన్న బట్ట మడతపెట్టి పరుపులా చేసి పిచ్చుకను దాని మీద పడుకోబెట్టాడు. గది నుంచి వెలుపలికి రావడానికి నాలుగు అడుగులు వేసే సరికి, ‘‘రంగన్నా!'' అన్న మృదు మధుర కంఠ స్వరం విని వెనక్కు తిరిగి చూశాడు.
 
అక్కడ పిచ్చుక కనిపించలేదు. దాని స్థానంలో ఒక దేవతామూర్తి కనిపించడంతో తన కళ్ళను తానే నమ్మలేక పోయూడు. ‘‘రంగన్నా! నేను వనదేవతను. ప్రాణుల పట్ల నువ్వు చూపుతూన్న నిరుపమానమైన కరుణ, ప్రేమాదరాలు చూసి చాలా సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను,'' అన్నది వనదేవత. ‘‘తల్లీ, నిన్ను కళ్ళారా చూడగలిగాను.

ఆ భాగ్యమే నాకు చాలు. మరే వరమూ వద్దు,'' అన్నాడు రంగన్న వనదేవత పాదాలకు నమస్కరిస్తూ. ‘‘చాలుననే నీ గుణం చాలా గొప్పది!'' అంటూ వనదేవత రంగన్న చేతిలోకి ఒక బిందెను ప్రసా దించి అదృశ్యమయింది. బిందెనిండా బంగారు నాణాలు! ఈ సంగతి క్షణాలలో గ్రామమంతా తెలిసి పోయింది. మంచి మనసు గల రంగన్నకు మంచే జరిగిందని అందరూ సంతోషంగా చెప్పుకోసాగారు.
 
అయితే, రామశాస్ర్తి మనసు మాత్రం అసూ యతో కుతకుతలాడ సాగింది. ఎలాగైనా రంగన్న బంగారు నాణాలను దొంగిలించుకుని, ఊరు వదిలి ఎటైనా పారిపోయి హాయిగా జీవించ వచ్చని ఆలోచించి ఒక పథకం వేశాడు. అర్ధరాత్రి సమయంలో రామశాస్ర్తి ముసుగు వేసుకుని రంగన్న ఇంట్లోకి జొరబడి, బంగారు నాణాల బిందెను దొంగిలించుకుని వెలుపలికి పరిగెత్తు తూండగా, కాలికి ఏదో అడ్డుపడి బోర్లా పడ్డాడు.
 
దాన్ని చూసిన రంగన్న కుక్క, మొరు గుతూ రామశాస్ర్తి మీదికి ఉరకబోయింది. హడలి పోయిన రామశాస్ర్తి, ‘‘అయ్యో! కాపాడండి!'' అని అరవసాగాడు. దాంతో రంగన్నతో పాటు ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు కూడా మేలుకుని రావడంతో రామశాస్ర్తి నాణాల బిందెతో పట్టుబడిపోయూడు. ‘‘ఛీ! నువ్వూ ఒక మనిషివేనా?'' అంటూ గ్రామస్థులు రామశాస్ర్తిని కొట్టబోయూరు. అయితే రంగన్న అడ్డుకుని వాళ్ళకు సర్ది చెప్పి పంపేశాడు. రామశాస్ర్తి క్షమించమని రంగన్న పాదాలపై పడ్డాడు.
 
‘‘నీ తప్పును గ్రహించావు కదా? అది చాలు. అయినా, క్షమించమని అడగవలసింది నన్ను కాదు. నీ మనస్సాక్షిని! నీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏదీ చేయకు. ఇక మీదట దురాశకు పోయి లేని పోనివి చెప్పి గ్రామ ప్రజలను పీడించకు. నిజాయి తీగా, కష్టపడి జీవించడం నేర్చుకో. అదే చాలు!'' అన్నాడు రంగన్న. ‘‘బుద్ధి వచ్చింది రంగన్నా.
 
ఇకపై నిజాయి తీగా, మంచి మార్గంలో నడుచుకుంటాను,'' అంటూ తలవంచుకుని ఇంటిదారి పట్టిన రామ శాస్ర్తి, అవమానంతో గ్రామ ప్రజలకు ముఖం చూపలేక తెల్లవారేలోగా ఊరువదిలి ఎటో వెళ్ళి పోయూడు.

No comments:

Post a Comment