పనీ పాటూ లేకుండా పొద్దస్తమానం అల్లరి చిల్లరగా తిరిగే రంగడూ, గంగడూ
గాయపడ్డ ఒక పెద్దమనిషిని చేతుల మీద మోసుకుని వైద్యుడి వద్దకు వచ్చారు.
వైద్యుడు ఆయన గాయూన్ని శుభ్రం చేసి మందువేసి కట్టుకట్టి నాడిపరీక్ష చేస్తూ,
‘‘ఈయనకు గాయమెలా తగిలింది?'' అని అడిగాడు.
‘‘రెండు పొట్టేళ్ళు ఢీకొంటుంటే ఎరప్రొట్టేలు గెలుస్తుందని నేనూ,
నల్లపొట్టేలు గెలుస్తుందని గంగడూ పందెం కాశాం. దాంతో మామధ్య గొడవ పెరిగి
కొట్టుకునే స్థితివచ్చింది. ఆ సమయంలో దారిన వెళుతూన్న కనకయ్య అనే ఈ
పెద్దమనిషి మా తగవు తీర్చడానికి ‘‘ఆగండి, ఆగండి!'' అంటూ మా మధ్యకు
జొరబడ్డాడు.
నేను గంగడి మీదికి విసిరిన రాయి, ఈయన తలకు తగలడంతో గాయపడ్డాడు,''
అన్నాడు రంగడు. ‘‘కనకయ్య మెదడుకు దెబ్బ తగల్లేదు కదా?'' అని అడిగాడు గంగడు
ఆదుర్దాగా. ‘‘అలాంటి ప్రమాదం ఏదీ లేదు. అయినా, అదే గనక ఉంటే మీ స్వభావం
తెలిసీ ఆయన మీ మధ్యకు వచ్చేవాడు కాదు కదా! పైదెబ్బే, నెత్తురు చూసిన భయంతో
స్పృహ కోల్పోయూడు. అంతే,'' అన్నాడు వైద్యుడు చిన్నగా నవ్వుతూ.
No comments:
Post a Comment