Pages

Saturday, September 15, 2012

దుఃఖకారణం!


అనంతవరంలో, కుమారస్వామి అనే భూస్వామి వుండేవాడు. ఆయన గొప్ప ధర్మదాత. తన గ్రామవాసులకేకాక, ఆపదల్లోవున్న ఇతర గ్రామాలవాళ్ళక్కూడా లేదనకుండా సాయం చేస్తుండేవాడు. ఆయన తన తొంభైయవ ఏట కాలధర్మం చెందే ముందు, తన ఆస్తిలో సగం దేవాలయూల్లో జరిగే ధర్మకార్యాలకూ, మిగిలిన సగం బంధుమిత్రులకూ చెందేలా వీలునామా రాశాడు.
 
ఆయనకు గ్రామానికి ఉత్తరానవున్న శ్మశానంలో ఉత్తరక్రియలు జరుగుతున్నవి. కుమారస్వామి పట్ల భక్తిగౌరవాలుగల అనేక మంది అక్కడ గుమిగూడారు. వాళ్ళల్లో అతి పేదదుస్తుల్లో వున్న ఒక నడివయసు వ్యక్తి, గుండెలవిసేలా దుఃఖించసాగాడు. ఇది చూసి జాలిపడిన పొరుగు గ్రామం పెద్ద ఒకడు అతణ్ణి సమీపించి, ‘‘మరేమనుకోకు.
 
ఇంతగా దుఃఖిస్తున్నావు. కుమారస్వామి, నీకేమైనా బంధువా?'' అని అడిగాడు. కాదన్నట్టు తలాడించాడు పేదవాడు. ‘‘మరి ఆయనకు ఆప్తమిత్రుడివి కాదు గదా!'' అన్నాడు గ్రామపెద్ద. ‘‘ఆ రెండు కానందువల్లే, నాకు దుఃఖం ఆగడం లేదు,'' అన్నాడు పేదవాడు.

No comments:

Post a Comment