నెరిసిన గడ్డం, ముడతలు పడ్డ చర్మం; రూపంలో వృద్ధుడే గాని కున్వర్
సింగ్ హృదయం నవయౌవనం! చూపుల్లో తీక్షణ్యం!! అంటూ కీర్తించబడ్డ ఆ వృద్ధ
సింహం శత్రువులపై ఉరకడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ అరణ్యం మధ్య
కూర్చున్నాడు. అది ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం జరుగుతూన్న 1857వ
సంవత్సరం.అనేక అపజయూల అనంతరం అతి ప్రయత్నం మీద బ్రిటిష్ దొరతనం ఆయన
రాజ్యాన్ని ఆక్రమించుకోగలిగింది కాని, కున్వర్ సింగ్‌ను
పట్టుకోలేకపోయింది.
బీహార్‌లోని జగదీశ్‌పూర్ పాలకుడైన రాజా కున్వర్ సింగ్‌ను,
ఒకానొకప్పుడు ఉజ్జయినిని పరిపాలించిన విక్రమాదిత్యుడి వంశానికి చెందిన
వాడని స్థానిక పూర్వగాథలు పేర్కొంటాయి. అరణ్యమంటే ఆయనకు మహా ఇష్టం. బాల్యం
నుంచే మిత్రులతో కలిసి అక్కడ దాగుడు మూతలు ఆడుకునే వాడట. యువకుడిగా ఎదిగాక
గెరిల్లా యుద్ధ పద్ధతులను అభ్యసించాడు.
అది ఆయనకు ఉత్తరోత్తరా శత్రువులను చిత్తు చేయడానికి ఎంతగానో ఉపకరిం
చింది. భారత ఉపఖండంలోని చిన్న చిన్న రాజ్యాలను ఒక్కొక్కటిగా బ్రిటిష్
ఈస్టిండియూ కంపెనీ ఏదో విధంగా కబళిస్తూన్న కాలఘట్టం అది. దాని పేరాశ నుంచి
జగదీశ్‌పూర్ కూడా తప్పించుకోలేక పోయింది. అయినా, దాని పాలకుడైన రాజా
కున్వర్ సింగ్ కొందరు విశ్వాసపాత్రులైన అనుచరులతో సమీప అరణ్యంలోకి
తప్పించుకుని వెళ్ళి, తిరిగి వచ్చి ఆక్రమించుకోవడానికి అనువైన సమయం కోసం
ఎదురుచూడసాగాడు.
శత్రుసేనలు రాజధానిలో జొరబడి రాజభవనాన్ని సమూలంగా నాశనం చేశాయి.
విగ్రహాలతో సహా దేవాలయూలను ధ్వసం చేశాయి. దాంతో జగదీశ్�పూర్�ను మాత్రమే
కాకుండా యూవత్� భారతదేశానికి పరాయిపాలన నుంచి విముక్తి కలిగించాలని
కున్వర్� సింగ్� ఆలోచించసాగాడు. లక్నోను జయించడానికి బ్రిటిష్� సైనికులు
ఔధ్�కు వెళుతున్నారని తెలిసింది.
వెంటనే తన అనుచరులతో మరి కొన్ని విప్లవ శక్తులను సమీకరించుకుని,
శత్రుసేనలను ఎదుర్కోవడానికి కున్వర్� సింగ్� బయలుదేరాడు. గెరిల్లా యుద్ధంలో
నేర్పరి అయిన రాజా కున్వర్� సింగ్� అనేక పోరాటాల్లో గెలుపొందాడు.
జగదీశ్�పూర్� సైనికులు బ్రిటిష్� సేనానాయకుణ్ణి, సైనికులను అజిమ్�గఢ్� కోట
ప్రాంగణంలో బందీలుగా చేశారు. అయితే, జగదీశ్�పూర్� కేసి వెళ్ళకుండా
కున్వర్�సింగ్�ను ఎలాగైనా అడ్డుకోవాలని బ్రిటిష్� పాలకులు నిర్ణయించారు.
గవర్నర్� జనరల్� కానింగ్� ప్రభువు, కున్వర్� సింగ్� అపూర్వ
శక్తిసామర్థ్యాలు, ధైర్యసాహసాలు తెలిసినవాడుగనక, ప్రమాదకరమైన పరిస్థితిని
పసిగట్టి-భారతీయ సైనిక విధానాలు బాగా ఎరిగిన లార్��డ మార్��క కెర్�ను
కున్వర్� సింగ్�ను బంధించడానికి పంపాడు. అంతకు ముందే బలమైన బ్రిటిష్�
సైన్యం భయంకరమైన ఆయుధాలతో అజిమ్�గఢ్� పొలిమేరలను చేరుకున్నది.
శ్వేతాశ్వాన్ని అధిరోహించిన రాజా కున్వర్� సింగ్� ఫిరంగులు, తుపాకుల
భయంకర ధ్వనుల మధ్య మెరుపు వేగంతో ఖడ్గయుద్ధం చేసి శత్రువుల తలలు తెగటార్చి
తన అనుచరులకు స్ఫూర్తిని కలిగించాడు. అధిక సంఖ్యాబలం, ఆయుధ బలం ఉన్నప్పటికీ
బ్రిటిష్� సేనలు అనేక ఓటములు చవిచూడవలసి వచ్చింది. ఆఖరికి తుపాకుల బలంతో
అజిమ్�గఢ్�ను చుట్టుముట్టి బందీలుగా వున్న తమ వారిని విడిపించ గలిగాయి.
శత్రువుల బలం, బలహీనతల లాగే తన వారి బలాబలాలను స్పష్టంగా బేరీజు వేయగల
రాజా కున్వర్� సింగ్�-బ్రిటిష్� సేనలను అజిమ్�గఢ్� కోట నుంచి వెలుపలికి
రానీయకుండా అడ్డుకున్నాడు. శత్రుసేనల కన్నుగప్పి జగదీశ్�పూర్�కు చేరుకుని
దురాక్రమణ దారులను తరుమగొట్టాలని పథకం రచించాడు. అందుకు ధైర్యవంతులైన
సైనికులను జాగ్రత్తగా ఎంపిక చేసి మార్గ మధ్యంలో వున్న వంతెనకు కాపలాకాయమని
సూచనలిచ్చాడు.
అజిమ్�గఢ్� కోటలో బందీలుగా ఉన్న బ్రిటిష్� సైనికులను విడిపించాలంటే
జనరల్� లుగార్��డ నాయకత్వంలోని సనలు ఆ వంతెనను దాటుకుని రావాలి. తమ సేనలను
నగరంలోకి జొరబడనీయకుండా చేయడానికి మాత్రమే కున్వర్� సింగ్� సేనలు తమను
అడ్డుకుంటున్నాయని జనరల్� లుగార్��డ భావించాడు.
అయితే, దానివెనక వేరొక పథకం ఉన్న విషయం అతడు పసిగట్టలేక పోయూడు.
జనరల్� లుగార్��డ, అతడి సైనికులు ఎన్నిసార్లు ప్రయత్నించినా, పదవీచ్యుతుడైన
రాజు కొద్దిపాటి సైనికులను దాటుకుని ముందుకు వెళ్ళలేక పోయూరు. వంతెన మీద
అడుగు పెట్టలేకపోయూరు. అయితే, ఉన్నట్టుండి, పథకం ప్రకారం రాజుగారి సైనికులు
వెనక్కు తగ్గడంతో బ్రిటిష్� సేనలు వంతెనదాటి ఆవలికి వెళ్ళగలిగాయి గాని,
అక్కడ రాజుగారి సైనికులు ఒక్కరూ లేకపోవడం చూసి, ��ఏమిటీ మాయ!�� అని
విస్తుపోయూయి.
కొందరు సైనికులు వంతెనవద్ద తమను అడ్డుకుంటూండగా; వృద్ధ రాజూ, సైనికులూ
శత్రువుల కన్నుగప్పి ఘజిపూర్� మార్గం గుండా గంగాతీరాన్ని చేరుకుంటున్నారని
తెలియవచ్చింది. వెంటనే బ్రిగేడియర్� డుగ్లా నాయకత్వంలో బ్రిటిష్� సేనలు
వారి కేసి బయలుదేరాయి. మార్గమధ్యంలో అవి అక్కడక్కడ కున్వర్� అనుచరుల
గెరిల్లా దాడులను ఎదుర్కోవలసి వచ్చింది.
అయినా, త్వరితగతిలో వెళ్ళి ఒక గ్రామం వద్ద బసచేసి ఉన్నరాజుగారి సేనలను
సమీపించాయి. నిర్విరామ ప్రయూణం కారణంగా అలిసిపోయిన వృద్ధరాజు కున్వర్�
సింగ్� ఏనుగులతో, భయంకర ఆయుధాలతో ముట్టడించిన బ్రిటిష్� సేనలను దీటుగా
ఎదుర్కోలేకపోయూడు. ఓటమి తప్పదేమో అన్న పరిస్థితి సమీపించగానే రాజు, తన
సహజమైన వ్యూహాలను అమలు పరిచాడు.
సైనికులు పలు జట్లుగా విడిపోయి, విభిన్న మార్గాలలో తప్పించుకుని
వెళ్ళి-ఒక నిర్దిష్ట ప్రదేశంలో, నిర్దిష్ట సమయంలో కలుసుకోవాలని
ఆజ్ఞాపించాడు. అంతా అనుకున్నట్టే జరిగింది. రాజు సేనలతో గంగా తీరాన్ని
సమీపించాడు. వెనక్కు తిరిగి చూస్తే దూరంలో బ్రిటిష్� సేనలు వస్తున్నట్టు
తెలియవచ్చింది. కొద్ది పాటి సేనలతో అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడం
వివేకమనిపించలేదు.
చాలినన్ని పడవలు లేకపోవడం వల్ల రాజూ, ఆయన అనుచరులూ బాలిల్లా సమీ పంలో
ఏనుగుల మీద ఎక్కి గంగానదిని దాటనున్నారన్న వదంతిని వ్యాపింపజేశాడు. ఆ వదంతి
ఆశించిన విధంగానే బ్రిటిష్� సేనాధిపతి చెవిన పడింది. తిరుగుబాటు నాయకుణ్ణి
ఏనుగుతో సహా గంగలో ముంచే సమయం ఆసన్నమయిందని పొంగిపోయూడు. హడావుడిగా
సైనికులతో వెళ్ళి బాలిల్లా రేవు వద్ద రాజు రాకకోసం ఎదురు చూస్తూ పొదల చాటున
మాటువేశాడు.
అయితే, ఎంత సేపటికీ రాజు అటు కేసి రాలేదు. ఆ ప్రదేశానికి దిగువ
ఏడుమైళ్ళ దూరంలోని శివపూర్� ఘాట్� వద్ద కావలసినన్ని పడవలతో నదిని
దాటుతున్నట్టు వార్త అందింది. బ్రిటిష్� సేనలు హుటాహుటిగా అక్కడికి చేరాయి.
అంతలో రాజుగారి సైనికులందరూ ఆవలి తీరం చేరారు. చివరగా రాజు వెళుతూన్న పడవ
మాత్రం నదిలో సగం దూరంలో కనిపించింది.
శత్రువుల తుపాకీగుండు ఆయన ఒకచేతి మణికట్టును ఛేదించడంతో రక్తం
కారసాగింది. రాజు రెండవ చేత్తో కత్తిని ఎత్తి, ��గంగామాతా! ఇదిగో నీ
ముద్దుబిడ్డ సమర్పిస్తూన్న తుది కానుక!�� అంటూ ఆచేతిని తెగ నరికి గంగాజలంలో
పడేలా చేశాడు! ఆ తరవాత ఆయన ఆవలి తీరం చేరి, ఎనిమిది నెలల క్రితం విడిచి
వెళ్ళిన రాజధానిని చేరుకుని పాలనా పగ్గాలు చేపట్టాడు. అయితే, ఈ సంగతి
అర్రాలో బసచేస్తూన్న బ్రిటిష్� సేనా నాయకుడు జనరల్� లీగ్రాండ్�కు కంటక
ప్రాయమయింది.
బలమైన బ్రిటిష్� సేనల నుంచి ఈ ముసలి రాజు ఎలా తప్పించుకుని
అధికారాన్ని చేపట్టగలిగాడా అని ఆశ్చర్యపోయూడు. మళ్ళీ జగదీశ్�పూర్� కేసి తన
సేనలను నడిపించాడు. అయినా అజేయుడైన గాయపడ్డ వృద్ధ రాజు శత్రువులను
ఎదుర్కొని నాశపరిచాడు. 1858 ఏప్రిల్� నెలలో ఆయన అధికారం మళ్ళీ
నెలకొల్పబడింది. కొన్ని రోజుల తరవాత నరకబడ్డ చేతిగాయం సమస్య కారణంగా
కాలధర్మం చెందాడు.
ఆయన అనంతరం తమ్ముడు రాజా అమర్� సింగ్� రాజయ్యూడు. ధైర్యసాహసాలలో,
దేశభక్తిలో అన్నకు సాటి రాగల అమర్�సింగ్�, తన కోట పతనమయ్యేంతవరకు బ్రిటిష్�
వారితో యుద్ధం చేశాడు. ఆఖరికి కోట నుంచి తప్పించుకున్నాడు గాని, ఆ తరవాత
ఆయనకు ఏమయిందో ఎవరికీ తెలియదు.
No comments:
Post a Comment