కాంచనదేశపు రాజు ధీరసింహుడి ఆస్థాన నర్తకి వసంతమాలిని. సామాన్య
కుటుంబంలో పుట్టినప్పటికీ, ఆమె చిన్నప్పటి నుంచీ నాట్యం పట్ల విశేష ఆసక్తి
కనబరుస్తూ, యుక్త వయస్కురాలయ్యేసరికి సాటి లేని మేటి నర్తకిగా పేరు
తెచ్చుకున్నది. ఆమె ప్రతిభను గుర్తించిన రాజు ఆమెను ఆస్థాన నర్తకిగా
చేశాడు.
ఆమె
నాట్య విన్యాసాలనూ, అపురూప భంగిమలనూ చూసి అందరూ ముగ్థులయ్యేవారు.
వసంతమాలిని ప్రతిభాసంపన్నురాలైన నర్తకిగానే కాకుండా, మంచి గుణగణాలు,
వినయవిధేయతలు, దయూస్వభావంగల అరుదైన కళాకారిణిగా కూడా ప్రజల మన్ననలు
పొందింది. ఆ యేడు పట్టపురాని యూమినీదేవి జన్మదినోత్సవాన్ని
పురస్కరించుకుని, రాజధానిలో జరిగే ఉత్సవాలలో ఒక అంశంగా ప్రజాసమక్షంలో
ఆస్థాన నర్తకి వసంతమాలినిని ఘనంగా సత్కరించాలని రాజు ధీరసింహుడు
నిర్ణయించాడు.
అయితే, రాజాస్థానంలోని ఇతర కళాకారులకు, పండితులకు ఇది ఏమాత్రం
నచ్చలేదు. తమకు దక్కని అరుదైన గౌరవం రాజనర్తకికి లభించడం చూసి ఓర్వలేక
పోయూరు. అసూయతో కుమిలి పోయూరు. సమయం దొరికినప్పుడు ఆమెను కించపరచాలని తహ తహ
లాడసాగారు. మహారాణి జన్మదినోత్సవం నాటి సాయంకాలం గొప్ప సభ ఏర్పాటయింది.
వేదిక మీద ఏర్పాటు చేసిన ఆసనంలో వసంతమాలిని ఎంతో వినయంగా ఒదిగి
కూర్చున్నది.
రాజు ధీరసింహుడు ఆమెను విలువైన కానుకలతో సత్కరించి, ఆమె
నాట్యకౌశలాన్ని మెచ్చుకుని, మన వసంతమాలిని అప్సరసలకు సాటిరాగల అపూర్వ
నాట్యకళాకారిణి. ఆమె మన ఆస్థానంలో ఉండడం మన అదృష్టం. ఆమె అద్భుత నాట్యాన్ని
తిలకించే అదృష్టం దేవతలకు లేదు, అన్నాడు. ఆ మాటలకు ప్రజలు కరతాళ ధ్వనులతో
ఆనందాన్ని తెలియజేశారు.
అయితే, రాజుగారికి కొద్ది దూరంలో కూర్చున్న ఒక పండితుడు
లేచి,మహాప్రభువులు, క్షమించాలి. తమరు అపూర్వ కళాపోషకులు. పొట్టపోసుకోవడం
కోసం వచ్చిన వసంతమాలినిని ఆస్థాన నర్తకిని చేయడం అపురూప కళాపోషకులైన తమ
ఔదార్యానికి నిలువుటద్దం. అంత మాత్రాన ఈమెను అప్సరసలతో పోల్చడం, ఆ
దేవకాంతలను అవమానించడమే అవుతుంది కదా! అన్నాడు.
అతడు మాట ముగించేలోపలే మరొక నాట్య కళాకారుడు లేచి, నేను ఎందరో
నర్తకీమణుల ప్రతిభను చూసినవాణ్ణి... వసంతమాలిని నాట్యంలో నయగారం కన్నా,
నవ్వులపాలే ఎక్కువ. ఆమెను తమ హస్తాలతో సన్మానించడం మన రాజ్యం చేసుకున్న
పాపం! అన్నాడు. ఆ మాటలకు సభలో గుసగుసలు ఆరంభమయ్యూయి. ఇదంతా గమనించిన ఆస్థాన
విదూషకుడు గంగాధర శాస్ర్తి లేచి, మహాప్రభూ, దేవలోకం, మన రాజ్యం చేసుకున్న
పాపపుణ్యాల సంగతేమోగాని, ఆస్థాన నర్తకి వసంతమాలిని మాత్రం పుణ్యం, పాపం
రెండూ చేసుకున్నది, అన్నాడు.
విదూషకుడి మాటలు రాజు ధీరసింహుడిలో ఆసక్తిని రేపాయి. ��ఇక్కడున్న
వారంతా, మహాపాపం, అవమానం అంటూంటే, తమరేమో మన నర్తకికి పాపపుణ్యాలు రెండూ
అంటగడుతున్నారు. కాస్త వివరించి చెప్పండి,�� అన్నాడు. అందుకు విదూషకుడు,
��కళాపోషకులైన తమ రాజ్యంలో జన్మించడం వసంతమాలిని చేసుకున్న పుణ్యం. అందుకే
ఆమె నేర్చిన కళకు సార్థకత సమకూరి, ఈ రోజు తమ చేత ప్రజాసమక్షంలో ఇలా
సన్మానించబడుతోంది.
అయితే, పుణ్యంతో పాటు ఏ జన్మలో చేసుకున్న పాపమో తెలియదు; ఆమెను
వెన్నంటి వస్తోంది,�� అని ఆగాడు. ��ఆ విషయం కూడా విడమరచి చెబితే బావుంటుంది
కదా?�� అని అడిగాడు రాజు ఎంతో కుతూహలంగా. ��తోటి కళాకారిణికి లభిస్తూన్న
సన్మానాన్ని చూసి ఓర్వలేని వాళ్ళ ఎదుట నాట్యం చేయవలసి రావడం, ఆమె చేసుకున్న
పాపం,�� అన్నాడు విదూషకుడు గంభీరంగా.
అంతకు ముందు ఆమెపై విమర్శలు గుప్పించినవారు సిగ్గుతో తలలు
వంచుకున్నారు. అప్పుడు రాజు, ��వెన్నెలలు వెదజల్లని జాబిలి అందాన్ని ఎవరూ
ఆస్వాదించలేరు. అలాగే సాటి మనిషిలోని మంచినీ, శక్తిసామర్థ్యాలనూ గుర్తించి
గౌరవించలేని వారి పాండిత్యం నిష్ర్పయోజనం. అది అలాంటి వారి వ్యక్తిత్వానికి
మాయని మచ్చ అవుతుంది.
అలాంటివారు నా ఆస్థానంలో ఉన్నందుకు విచారిస్తున్నాను,�� అన్నాడు. ఆ
తరవాత, చమత్కారంతో అసూయూపరుల అసలు రూపాలను బయటపెట్టిన విదూషకుణ్ణి
వసంతమాలిని చేతుల మీదుగా ఘనంగా సత్కరించాడు. ప్రజలు ఆనందోత్సాహాలతో
చప్పట్లు చరిచారు.
No comments:
Post a Comment