Pages

Friday, September 14, 2012

ఆకలిమందు


ఒక దేశంలో ఒక ఏడు కరువు ఏర్పడింది. ఆ దేశపురాజు మంత్రులనూ, తదితర ప్రభుత్వోద్యోగులనూ సమావేశపరచి, ‘‘మన దేశంలో ఆకలి చావులు రోజురోజుకూ ఎక్కువై పోతున్నాయి. ఆకలిని శాశ్వతంగా నివారించేటందుకు వైద్యుల చేత ఆకలి కలగకుండా మందు త…ూరుచేయిస్తాను,'' అన్నాడు.
 
ఏమంటే ఏమి ముంచుకొస్తుందో నని సభికులు ఏమీ అనకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వృద్ధమంత్రి సుబుద్ధి మాత్రం, ‘‘మహారాజా, మన దేశానికి కరువు కొత్తది కాదు. దాన్ని నివారించాలంటే, నీటి పారుదల సౌకర్యాలు పెంచి దేశాన్ని సస్యశ్యామలం చె…్యూలి. అంతేగాని, ఆకలిమందుతో కాటకాన్ని అరికట్టటం జరిగేపని కాదు,'' అన్నాడు.
 
‘‘ఎందుకు జరగదో నేనూ చూస్తాను,'' అంటూ రాజు ముసలి మంత్రి మీద విరుచుకుపడ్డాడు. ఆ…ున మంత్రిని శకునపక్ష అనీ, తాను అనుకున్న ప్రతి ఆలోచనకూ అభ్యంతరం చెబుతాడనీ అన్నమీదట, మిగిలిన వాళ్ళంతా రాజుగారి ఆలోచన దివ్యంగా ఉందన్నారు. రాజు దేశంలోని వైద్యులందరనీ పిలిపించి, ‘‘మీకు ఒక నెలరోజులు గడువిచ్చాను, ఆకలికి మందు త…ూరుచె…్యుండి,'' అన్నాడు.
 
వైద్యులు నిర్ఘాంతపో…ూరు. వారిలో ఒకరు, ‘‘ప్రభువులు క్షమించాలి, ఆకలి కలగకుండా చె…్యుటానికి ఔషధం ఏ వైద్యగ్రంథంలోనూ చెప్పబడలేదు,'' అన్నాడు. ‘‘అయితే మీరు త…ూరు చే…ులేరన్న మాట... ఈ నకిలీ వైద్యులందరినీ కారాగారంలో బంధించండి. నిష్రెూ్పజకులు,'' అన్నాడు రాజు రౌద్రంగా తన సేనానితో. ఒక ముసలివాడు, ‘‘మహారాజా,ఈ వైద్యులను విడుదల చేయించండి. ఒక వారం రోజులలో నేను మీరు కోరిన ఔషధం త…ూరు చేసి ఇ…్యుగలను,'' అన్నాడు.

‘‘వైద్యుడంటే అలా ఉండాలి,'' అని రాజు వైద్యులందరినీ విడుదల చేయించాడు. తరవాత కొన్ని రోజులకు ఆ ముసలివాడే రాజు వద్దకు వచ్చి, తాటికా…ు ప్రమాణమంత మందు తెచ్చి ఇచ్చి, మనిషికి ఒక గురిగింజ ఎత్తు ఆ మందు తినిపించినట్టయితే జన్మలో మళ్ళీ ఆకలి ఉండదన్నాడు. రాజు ఆ లేహ్యాన్ని అందుకుని, ముసలి వాణ్ణి సన్మానించి, ఆ లేహ్యాన్ని నగర వాసులకు పంచాడు.
 
రాజప్రాంగణంలో ఎవరూ మందు తినలేదు గనక వారికి ఆకలి మామూలుగానే ఉండిపోయింది. కాని నగరంలో అందరికీ ఆకలి పోయినట్టు వార్త వచ్చింది. వృద్ధ మంత్రి రాజు వద్దకు వచ్చి, ‘‘మహారాజా, ప్రజలు పనిపాటలు మానేశారు. వారి కిప్పుడు ఆకలి బాధలేదు గనక, ఎంతసేపూ వినోదాలలోనూ, వేడుకలోలనూ, నిద్రలోనూ కాలం గడుపుతున్నారు. చిన్నా, పెద్దా తారతమ్యం పోయింది,'' అన్నాడు.
 
‘‘అన్నిటికన్న పెద్దది, ఆకలి సమస్య పోయింది గదా!'' అన్నాడు రాజు. మరిరెండు రోజులకు మంత్రి రాజుతో, ‘‘మహారాజా, అందరూ కులవృత్తులు మానేశారు. నేతగాళ్ళు బట్టలు నె…్యుటం లేదు.
 
క్షురకులు క్షురకర్మ చె…్యుటం లేదు. ప్రజలు గడ్డాలూ మీసాలూ పెరిగి అరణ్య మృగాలలాగా ఉన్నారు. అన్ని వస్తువులకూ కరువు ఏర్పడింది. వెనక తిండి గింజలు మాత్రమే లేవు. ఇప్పుడు ఏ వస్తువూ దొరకటం లేదు. దొరికితే ఎత్తు కెత్తు బంగారం పోసి కొనవలిసి వస్తున్నది,'' అన్నాడు. రాజు ఈ మాటలు విని, ఏమీ అనకుండా ఊరుకున్నాడు.
 
మరో రోజు మంత్రి రాజుతో, ‘‘మహారాజా, ప్రజలు శాసనధిక్కారం చేసి, తిరగబడు తున్నారు. అరాజకం ఏర్పడుతున్నది,'' అన్నాడు. రాజుకు కోపం వచ్చింది , ‘‘ప్రజలు ఇంత కృతఘు్నలా? సైన్యాన్ని సిద్ధంగా ఉంచమని సేనాపతికి చెప్పండి,'' అన్నాడు ఆ…ున. ‘‘ఇంకా మనకు సేన ఎక్కడున్నది, మహారాజా? సైనికులలో చాలా మంది కొలువు చాలించుకుని వెళ్ళిపో…ూరు,'' అన్నాడు మంత్రి.
 
ఇంతలో సేనాపతి కంగారుపడుతూ వచ్చి, ‘‘మహారాజా, మన విరోధి చండ ప్రచండుడు తన సేనలతో వచ్చి, మన రాజధానిని చుట్టుముట్టాడు,'' అని చెప్పాడు. ‘‘ఇప్పుడు ఏం చేసేటట్టు?'' అన్నాడు రాజు ఆదుర్దాగా. ‘‘శత్రువుకు లొంగిపోవటం తప్ప గత్యంతరం లేదు, మహారాజా,'' అన్నాడు సేనాపతి. అతను ఇలా అంటూండగానే శత్రు సైనికులు వచ్చారు. వాళ్ళనా…ుకుడు రాజును సమీపించి, ‘‘మీ రాజ్యం మాకు హస్తగతమయింది.
 
అనవసరంగా ప్రతిఘటించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు,'' అన్నాడు. ‘‘ఇంకెక్కడి ప్రతిఘటన? ఈ ఆకలి మందు నన్నీ గతికి తెచ్చింది. నే నిప్పుడు మీకు బందీని,'' అంటూ రాజు కదిలాడు. అంతలో ఊతకర్ర పొడుచుకుంటూ ముసలి వైద్యుడు వచ్చి, ‘‘ఆకలి మందు అన్ని అనర్థాలకూ మూలమని నేను చెబితే విన్నారా, మహారాజా?'' అన్నాడు.
 
‘‘అందుకే అనుభవిస్తున్నాను,'' అన్నాడు రాజు. ‘‘ఇప్పటికైనా అసలు విష…ూన్ని గ్రహించారు. సంతోషం!'' అంటూ వైద్యుడు తన వేషాన్ని తీసేశాడు. ఆ…ున మంత్రి సుబుద్ధే! ‘‘ప్రభువులు క్షమించాలి. మంత్రాలకు చింతకా…ులు రాలవు. మందు మాకులతో ఆకలి సమస్య తీరదు.
 
మీచేత సరిఅయిన ప్రణాళికలు అమలు జరిపించాలని ఈ నాటకం ఆడాం. శత్రుసైనికులందరూ మన సైనికులే. దేశసంపదను సద్వినిెూగం చె…్యుటానికి ప్రణాళికలు త…ూరుచేయించి, దేశాన్ని సస్యశ్యామలం చేసి, కాటకాన్ని రూపు మాపండి,'' అన్నాడు మంత్రి సుబుద్ధి.

No comments:

Post a Comment