Pages

Friday, September 14, 2012

సజ్జనసాంగత్యం!


మొగలిపట్టు గ్రామంలోని పెద్ద రైతుల్లో రామ…్యు ఒకడు. ఆ…ునది పెద్ద లోగిలి. నలుగురన్నదమ్ములు కలిసికట్టుగా జీవిస్తూ, ఉమ్మడిగా కట్టుకున్న ఆ పెద్ద ఇంటి లోగిలి, ప్రతి సా…ుంత్రమూ పిల్లల ఆటపాటలతో కోలాహలంగా వుంటుంది. అన్నదమ్ముల పిల్లలతో పాటు చుట్టుపక్కలవారి పిల్లలు కూడా అక్కడికి వస్తూంటారు.
 
ఒక రోజు సూర్యాస్తమ…ుమై చీకటి కమ్ముకుంటున్న వేళలో, వీధి గుమ్మంలో గురప్రు బండి ఆగిన శబ్దం విని, పిల్లలందరూ కుతూహలంగా తొంగి చూశారు. అప్పటికే వీధి అరుగు మీద కూర్చునివున్న రామ…్యు, అతని పెద్ద తమ్ముడు, బండిలోంచి దిగిన వృద్ధురాలికి ఎదురు వెళ్ళి, ‘‘బాగున్నావా, పెద్దమ్మా?'' అని పలకరిస్తున్నారు. ఆమెను చూడగానే పిల్లల ముఖాలు ఆనందంతో వెలిగిపో…ూయి.
 
‘‘బామ్మ వచ్చింది! బామ్మ వచ్చింది!'' అంటూ సంబరంగా ఆమెను చుట్టుముట్టారు. ఈ బామ్మ, రామ…్యుకు పెద్దతల్లి అయిన సావిత్రమ్మ, అక్కడికి నాలుగు కోసుల దూరంలోవున్న రేపల్లెలో వుంటుంది. ఆమెకు రామ…్యు కుటుంబంతో, ముఖ్యంగా పిల్లలతో అనుబంధం చాలా చిక్కనైంది. ఆమె చెప్పే రకరకాల కథలు వింటున్నంత సేపూ పిల్లలకు మరోధ్యాస అంటూ వుండదు. రాత్రి అయింది.
 
పిల్లలంతా భోజనాలు ముగించి నాలుగిళ్ళ వాకిట్లో చేరారు. బామ్మ, రామ…్యు చిన్నకొడుకు పదేళ్ళ గోపీ కేసి చూసి, ‘‘ఏమిట్రా గోపీ, మోచేతికి కట్టుకట్టావు?'' అని అడిగింది. ఆ ప్రశ్నకు గోపీ ఏదో చెప్పబోేుంతలో, రామ…్యు భార్య కల్పించుకుని, ‘‘మరేంలేదు అత్త…్యూ! వీడు పాఠశాలలో ప్రతి ఆకతాయి వెధవతోనూ స్నేహం చేస్తూంటాడు. ఏదో సమ…ుంలో కీచులాట జరిగి, ఇలా దెబ్బలు తిని ఇంటికొస్తూంటాడు,'' అన్నది.

అప్పుడు బామ్మ, గోపీని దగ్గరకు తీసుకుంటూ, ‘‘వీడూ ఆకతాేు అ…ుుంటాడు. ఆకతాయి అయితే తప్ప, మరొక ఆకతాయితో స్నేహం కుదరదు!'' అని, ‘‘ఒరే, గోపీ, అన్నిటికన్నా ఉత్తమమైనది సజ్జన సాంగత్యం - అంటే మంచివాళ్ళతో స్నేహం అన్నమాట. అలాంటి సజ్జనసాంగత్యాన్ని గురించి ఒక కథ చెబుతాను, అందరూ వినండి,'' అంటూ ఇలా చెప్పసాగింది: పూర్వం రామాపురంలో ఒక పెద్ద భూస్వామి వుండేవాడు, ఆ…ున పరమ ధార్మికుడు; ద…ూపరుడు.
 
ఆ…ునకు శ్రీకాంతుడనే కొడుకు వుండేవాడు. ఆ కురవ్రాడు తండ్రికి తగిన కొడుకులాగే ప్రవర్తిస్తూ, పిన్నవ…ుసులోనే మంచిపేరు తెచ్చుకున్నాడు. అదే ఊళ్ళో రాజ…్యు అనే రైతువుండేవాడు. సోమ…్యు అతడి కొడుకు. తండ్రి కష్టజీవి, సోమ…్యుకు పనంటే చిరాకు. అయితే, ఎంత దుడుకువాడైనప్పటికీ, చదువంటే చాలా ఆసక్తివుండేది.
 
అందుచేత, రాజ…్యు కొడుకును ఊళ్ళో నారా…ుణా చార్యులనే గురువు నడిపే పాఠశాలకు పంపించడం ప్రారంభించాడు. ఆ పాఠశాలకు సోమ…్యు ఈడువాడే అయిన శ్రీకాంతుడు కూడా వస్తూండేవాడు. వాడు సోమ…్యుతో గౌరవంగా, స్నేహంగా మాట్లాడేవాడు. కాని సోమ…్యు మాత్రం దుడుకుగా, పొగరుగా ప్రవర్తించేవాడు.
 
కొన్నాళ్ళకు శ్రీకాంతుడు, సోమ…్యు ఇద్దరూ, ఆచార్యుల వద్ద విద్యాభ్యాసం ముగించారు. శ్రీకాంతుడు తదుపరి విద్యకోసం, అక్కడికి రెండు కోసుల దూరంలోవున్న జమీందారుగారి పెద్ద పాఠశాలకు వెళ్ళ సాగాడు. రాజ…్యు, శ్రీకాంతుడి తండ్రిని అర్థించి, తన కొడుకు కూడా శ్రీకాంతుడితో కలిసి బండిలో వెళ్ళివచ్చేలా ఏర్పాటు చేశాడు.
 
ఒక నాడు సోమ…్యు, తనతో కలిసి చదువుతున్న జమీందారుగారబ్బాయి రాజు మీద దూరం నుంచి ఆకతాయితనంగా రాయి విసిరాడు. రాయి ఆ కురవ్రాడి తలకు తగిలి రక్తం రాసాగింది. జరిగింది వింటూనే ప్రధానోపాధ్యా…ుుడితో సహా విద్యార్థులందరూ ఒక్క పరుగున రాజు దగ్గరకు వెళ్ళారు.
 
ప్రధానోపాధ్యా…ుుడు విష్ణుశర్మ, వైద్యుడి కోసం కబురు పంపి, ఎవరో తెచ్చియిచ్చిన తడిగుడ్డను రాజు గా…ుం మీద నొక్కిపట్టుకుని, విద్యార్థులవైపు చూస్తూ, ‘‘ఎవరు రాజు మీద రాయివిసిరింది? విద్యార్థి అయివుండీ ఇంత దుందుడుకుగా ప్రవర్తించిన, ఆ మూర్ఖుడెవరు?'' అంటూ తీవ్రంగా ప్రశ్నించాడు.

అది వింటూనే సోమ…్యు బిక్కచచ్చి పో…ూడు. ఇంతలో ఒకరిద్దరు కురవ్రాళ్ళు, సోమ…్యు దూరంనుంచి రాయి విసరటం తాము చూశామని, ఆ…ునకు చెప్పారు. ఆ మాటలు వింటూనే విష్ణుశర్మ ఆశ్చర్యంగా, ‘‘సోమ…్యు మన శ్రీకాంతుడి స్నేహితుడు. వాడు ఇలాంటి పని ఎందుకు చేస్తాడు?'' అన్నాడు.
 
గురువు ఇలా అనగానే, సోమ…్యుకు, శ్రీకాంతుడి మంచితనమూ, తన నీచస్వభావమూ తెలిసివచ్చి, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అది గమనించిన విష్ణుశర్మ, వాడు రాయిని విసిరాడని చెప్పిన పిల్లలతో, ‘‘చూశారా, నేనింకా ఏమీ అనకుండానే సోమ…్యు ఎలా బాధపడుతున్నాడో! ఇంకెప్పుడూ చూసీ చూడని మాటలు చెప్పకండి,'' అన్నాడు. ఆ మరుక్షణమే రాజు, సోమ…్యు వైపు స్నేహంగా చూస్తూ, ‘‘సోమ…్యు, శ్రీకాంతుడికే కాదు, నాకూ స్నేహితుడే.
 
వాడిలాంటి కొంటెపనులు చె…్యుడు,'' అన్నాడు. ఇది విన్న సోమ…్యు నెమ్మదిగా విష్ణుశర్మను సమీపించి, తలవంచుకుని, ‘‘గురువుగారూ! రాజు మీద రాయి విసిరింది నేనే. రాజు, శ్రీకాంతులిద్దరూ మంచివాళ్ళుగనక, నన్ను నిర్దోషిగా చెబుతున్నారు. నన్ను శిక్షంచండి!'' అన్నాడు. విష్ణుశర్మ, సోమ…్యు ప్రవర్తనకు ఆనందిస్తూ ఏదో అనేలోగా రాజు, శ్రీకాంతులిద్దరూ, ‘‘గురువుగారూ! రాయి విసిరింది సోమే్యు అని మాకూ తెలుసు.
 
కాని, చేసిన తప్పుకు వాడు పశ్చాత్తాప పడుతున్నాడని గమనించి, మేం సోమ…్యు నిర్దోషి అని చెప్పాం. వాణ్ణి శిక్షంచకండి,'' అన్నారు. విష్ణుశర్మ వాళ్ళు చెప్పిన దానికి చాలా సంతోషించి, సోమ…్యుతో, ‘‘ఒరే, ఈ క్షణంలో నీకు సజ్జనసాంగత్యం లభించింది. ఎంత అదృష్టవంతుడివి!'' అన్నాడు. కథ ముగించిన బామ్మ, ‘‘పిల్లలూ! సజ్జనసాంగత్యం చేస్తే ఎలావుంటుందో మీక్కూడా తెలిసివచ్చిందా?'' అన్నది. పిల్లలంతా ఆనందంగా, ‘‘ఓ, బాగా తెలిసింది, బామ్మా! ఇక నుంచి మేంకూడా మంచి వాళ్ళతోనే స్నేహం చేస్తాం,'' అన్నారు.

No comments:

Post a Comment