Pages

Friday, September 14, 2012

స్వప్నసుందరి కథ!


ఒకానొకప్పుడు మహేంద్రగిరిని పరిపాలించిన రాజు మహేంద్రవర్మకు ఏడుగురు కుమా రులు, ఒక కుమార్తె. ఆమె పేరు స్వప్నసుందరి. రాజు ఏడుగురు కొడుకులకు వివాహం చేశాడు గాని, కూతురికి పెళ్ళి కాకముందే కన్నుమూశాడు.
 
చెల్లెలంటే ఏడుగురు అన్నలకూ ఎంతో ప్రీతి. అయితే వారి భార్యలకు మాత్రం ఆడపడుచు స్వప్నసుందరి అంటే గిటే్టది కాదు. అన్నలు రాజభవనంలో లేనప్పుడు ఆమెను దాసికన్నా హీనంగా చూస్తూ హింసించే వారు. ఒకనాడు, ‘‘ఇలా వేధించారంటే, మా అన్నలకు చెబుతాను,'' అన్నది స్వప్న సుందరి. ‘‘అలాగా! వారు వచ్చేదాక నువ్వు ఇక్కడ వుంటే కదా, మా మీద ఫిర్యాదు చే…ుడానికి? ఇప్పుడే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు ఇక్కడ స్థానం లేదు,'' అంటూ భవనం నుంచి గెంటేశారు.
 
‘‘సరే, వెళ్ళిపోతాను. అయితే, ఒక రాజ కుమారుణ్ణి వివాహమాడి తిరిగివస్తాను,'' అంటూ బ…ుటకు నడిచింది స్వప్నసుందరి. ‘‘వెళ్ళు వెళ్ళు. నీ రాక కోసం రాజ కుమా రులు కాచుకుని ఉన్నారు కదా!'' అంటూ పరిహసించిన వదినలు, ‘‘కావాలంటే చందన రాజునే వివాహమాడు. అయితే ఇక్కడికి మాత్రం తిరిగిరాకు!'' అని హెచ్చరించారు.
 
స్వప్నసుందరి వెళుతూండగా కడగొట్టు వదిన పరిగెత్తుకుంటూ వచ్చి, ఒక మూటను తెచ్చి ఇస్తూ, ‘‘ఆగు, ఆగు. ఇదిగో నీ దుస్తుల మూట. వీటిని నీ వివాహానికి ధరించవచ్చు. అందులో వున్న బి…్యుం, చందనమహా రాజుకు విందుభోజనం పెట్టడానికి పనికి వస్తుంది. తీసు కెళ్ళు!'' అన్నది హేళనగా. ఆ మాటకు, వెనకవున్న కోడళ్ళందరూ పకపకా నవ్వారు. స్వప్నసుందరి చందన రాజును తలుచు కుంటూ ముందుకు నడిచింది. అంతవరకు ఆ పేరెప్పుడూ ఆమె వినలేదు.

అయినా ఆ…ున్ను ఎలాగైనా చూడాలనుకున్నది. ఆమె కొంత దూరం వెళ్ళాక, కొందరు స్ర్తీలు ఎదుర…్యూరు. ఆమె వారిని, ‘‘చందనరాజు ఎక్కడుంటాడు? నేను ఆ…ున్ను చూడాలి!'' అని అడిగింది. ‘‘చందనరాజా? ఆ…ునెప్పుడో చనిపో …ూడు!'' అన్నది ఒక స్ర్తీ. ‘‘ఆ…ున రాజుగారా? ఏ రాజ్యానికి రాజు?'' అని అడిగింది స్వప్నసుందరి. ‘‘దక్షణాదిన ఉన్న ఏదో రాజ్యానికి రాజని విన్నాను,'' అంటూ ఆ స్ర్తీ గుంపుతో కలిసి వెళ్ళిపోయింది.
 
స్వప్న సుందరి దక్షణ దిశగా నడవసాగింది. చాలా రోజులు నడిచాక ఒక అడవిని సమీ పించింది. అడవిలో నిర్మానుష్యంగా వున్న చోట పెద్ద భవనం కనిపించడంతో ఆశ్చర్యంగా దానిని సమీపించింది. మనుషుల అలికిడి లేదు. తలుపులు తెరిచి ఉండడంతో ధైర్యాన్ని కూడగట్టుకుని లోపలికి అడుగుపెట్టింది. ముందున్న గదిలో ఒక కుక్క, ఒక పిల్లి కని పించాయి. ఆమెను చూడగానే కుక్క మెల్లగా మొరిగింది. పిల్లి మ్యావ్‌ మన్నది.
 
అవి ఆక లితో ఉన్నా…ుని గ్రహించిన స్వప్నసుందరి తన వద్దవున్న మూటను విప్పి అందులోని బి…్యుం కొంత తీసి వాటి ముందు చల్లింది. అవి ఆ బి…్యూన్ని కొంతసేపు వింతగా చూసి, ఆ తరవాత తృప్తిగా తిన్నాయి. ఆ పిమ్మట కుక్క భవనం లోపలికి వెళ్ళి నోటితో ఒక చిన్న మూటను తెచ్చి స్వప్నసుందరి ముందుంచి, ‘‘నాకు ఇంకొంచెం బి…్యుం ఇచ్చావంటే, నువ్వీ కుంకుమను తీసుకో వచ్చు,'' అన్నది మానవభాషలో.
 
స్వప్న సుందరి ఆశ్చర్యంతో, ‘‘ఆ కుంకుమ ప్రత్యేకత ఏమిటి?'' అని అడిగింది. ‘‘ఈ కుంకుమను నొసట పెట్టుకున్న స్ర్తీ, వివాహిత అయితే, భర్త సంపూర్ణ ఆ…ుుష్కుడ వుతాడు. పెళ్ళికానివారయితే కోరిన వరుడు లభిస్తాడు,'' అన్నది కుక్క. సుందరి మూట విప్పి మరికొంత బి…్యుం తీసి కుక్క ముందు చల్లి, కుంకుమ తీసుకుని బొట్టుపెట్టుకున్నది.
 
అంతలో పిల్లి కూడా లోపలికి వెళ్ళి ఇంకొక చిన్న మూటను తెచ్చి సుందరి ముందుంచి, ‘‘ఈ విభూతి తీసుకుని, నాకూ ఇంకొంచెం బి…్యుం పెట్టు,'' అన్నది. ‘‘దీనివల్ల నాకు ఏమిటి ఉపెూగం?'' అని అడిగింది సుందరి.

‘‘దీనిని నీ కళ్ళమీద రాసుకుంటే, నువ్వు మరెవరికీ కనిపించవు. నీకు అందరూ కనిపి స్తారు,'' అన్నది. సుందరి దానికీ ఇంత బి…్యుం ఇచ్చి ఆ విభూతిని తీసి జాగ్రత్తగా దుస్తుల్లో భద్ర పరచుకున్నది. ఆ తరవాత ఆ రెండు జంతువులూ చాలా సంతోషించి, ఆ భవనం ఒక రాక్షసుడిదనీ, అటువైపు వచ్చే బాటసారులను చంపి తింటూంటాడనీ, వాడు తినగా మిగిలిన నరమాంసాన్ని తమకు పెడుతూంటాడనీ, ఇన్నాళ్ళకు బి…్యుం తినడం చాలా రుచిగా ఉన్నా…ునీ చెప్పాయి.
 
వాడు వచ్చేలోగా అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని హెచ్చరించాయి కృతజ్ఞతతో. సుందరి తన వద్ద వున్న మొత్తం బి…్యూన్ని వాటికి ఇచ్చి, అక్కడి నుంచి హడావుడిగా బ…ులుదేరింది. ఆమె ఎంతో జాగ్రత్తగా నడుస్తూ ముందుకు వెళ్ళింది. అదృష్టవ శాత్తు రాక్షసుడు తారసపడలేదు. పొద్దు పోేులోగా అరణ్యం దాటి వెళ్ళాలనే ఉద్దే శంతో వేగంగా నడవ సాగింది.
 
అయినా వెళ్ళ లేక పోయింది. సూర్యాస్తమ…ుమై చీకటి కమ్ముకుంటూండగా దూరంగా మిణుకు మిణుకుమంటూ వెలుతురు కనిపించడంతో ఆశతో అటువైపు నడిచింది. ఆ వెలుతురు ఒక భవనం నుంచి వస్తున్న దని ఆమె గ్రహించింది. అది ఒక రాజభవనం లాగా ఉన్నది. అయినా అందులోనూ మను షుల ఆచూకీ లేకపోవడం ఆమెకు విస్మ…ుం కలిగించింది.
 
ఆమె మెల్లగా అందులోకి అడుగు పెట్టింది. భవనం మధ్య విశాల మంటపం, అందులో ఒక చెట్టు కింద ఎత్తయిన వేదిక కనిపించాయి. ఆ వేదిక మీద ఒక అందమైన …ుువకుడు వెల్లకిలా పడుకుని ఉండడం చూసి ఆమె తన కళ్ళనే నమ్మలేకపోయింది. అతన్ని కొంత సేపు తదేకంగా చూసింది. అతనిలో ఎలాంటి చలనమూ లేదు. ప్రాణాలతో ఉన్నట్టు లేదు; మరణించినట్టూ కనిపించడం లేదు.
 
వేచి చూడాలనుకుని, స్వప్నసుందరి ఒక మూలలో కూర్చున్నది. అర్ధరాత్రి సమ…ుంలో ఆ …ుువకుడిలో చలనం రావడం, వెన్నెల వెలుగులో స్పష్టంగా ఆమెకు కనిపించింది. కొంతసేపటికి, కళ్ళు నులుముకుంటూ అతడు లేచి కూర్చుని, ‘‘…ుక్షణులు ఎక్కడ? …ుక్షణులు ఎక్కడ?'' అన్నాడు తనలో తాను గొణుక్కుంటున్నట్టు.


‘‘ఇక్కడెవరూ …ుక్షణులు లేరే!'' అన్నది స్వప్నసుందరి అతన్ని సమీపిస్తూ. ‘‘ఎవరు నువ్వు? ఇక్కడికెలా వచ్చావు?'' అని అడిగాడు …ుువకుడు ఆశ్చర్యంగా. ‘‘నా పేరు స్వప్నసుందరి. మహేంద్రగిరి రాకుమారిని. తండ్రి గతించడంతో ఏడుగురు వదినెలు పెటే్ట బాధలు భరించలేక, భవనం వదిలి చందనరాజును వెతుక్కుంటూ వెళు తున్నాను.
 
ఆ…ున్ను వివాహమాడాలనుకుం టున్నాను,'' అన్నది స్వప్నసుందరి. ‘‘నేనే చందనరాజును. నేను కూడా ఒక రాకుమారుణ్ణే. పగటి పూట ప్రాణాలు లేకుండా పడివుండి, అర్ధరాత్రి సమ…ుంలో కొన్ని ఘడి…ుల సేపు మాత్రమే సజీవుడిగా ఉండే నన్ను నువ్వు ఎలా వివాహ మాడగలవో అర్థం కావడం లేదు,'' అన్నాడు …ుువకుడు. ‘‘అది సరే. రాకుమారా!
 
ఇంతకు ముందు తమరు …ుక్షణుల గురించి పలవ రించారు కదా? వారెవరు?'' అని అడిగింది స్వప్నసుందరి. ‘‘అదొక పెద్ద కథ. అదంతా చెప్పాలంటే సమ…ుం చాలదు. క్లుప్తంగా చెబుతాను, విను,'' అంటూ ఇలా చెప్పసాగాడు: చందనరాజు తండ్రికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. ఆ…ున తరచూ వేటకు వెళ్ళేవాడు. అలా ఒకనాడు వేటాడుతూ అడ విలో దారితప్పి ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
 
ముని, రాజుకు ఆశ్ర…ుం ఇచ్చాడు. మరు నాడు తెల్లవారగానే బ…ులుదేరుతూన్న రాజుకు ముని ఒక చందన పుష్పహారాన్ని ఇచ్చి, ‘‘రాజా! దీనిని రాణిగారిని ధరించ మని చెప్పు. ఈ హారానికి ప్రాణాన్నిచ్చే శక్తి ఉంది. త్వరలో నీ భార్య గర్భందాల్చి విగత జీవుడైన శిశువును ప్రసవిస్తుంది.
 
ఈ హారాన్ని శిశువుకు అలంక రించగానే అతడు సజీవుడు కాగలడు.
పుష్పహారం బిడ్డ నుంచి దూరం కాకుండా చూసుకోవడం మీ బాధ్యత!'' అని దీవించాడు. రాజు తిరిగివచ్చి రాణికి పుష్పహారం ఇచ్చి ధరించేలా చేశాడు. త్వరలోనే ఆమె గర్భం దాల్చి నెలలు నిండని శిశువును ప్రసవించింది. శిశువుకు చందన పుష్ప హారాన్ని వే…ుగానే ప్రాణం వచ్చి కేరింతలు కొట్టాడు. రాజ దంపతులు పరమానందం చెందారు. 

బిడ్డకు చందన రాజని నామకరణం చేశారు. బిడ్డ పెరిగి …ుుక్త వ…ుస్కుడ…్యూడు. అయినా ఎప్పుడూ మెడ నుంచి చందనమాలను తీ…ుకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకనాటి పున్నమిరేయి అతడు భవన ఉపరితలంపై పడుకుని నిద్రపోవడం చూసిన …ుక్షణీ స్ర్తీలు దిగివచ్చి, అతని చుట్టూ నాట్యం చే…ుసాగారు.
 
వారిలో ఒక …ుక్షణి అతన్ని వివాహ మాడాల నుకున్నది. చందనరాజు అందుకు విముఖత చూపలేదు గాని, వివాహ మాడాక తమతో …ుక్షలోకానికి రావాలని ఆ …ుక్షణి కోర డంతో, అతడు నిరాకరించాడు. దాంతో ఆగ్రహం చెందిన …ుక్షణి అతని మెడ నుంచి చందనమాలను లాక్కుని వెళ్ళిపోయింది. మరుక్షణమే చందన రాజు విగతజీవుడై నేలకు ఒరిగాడు.
 
తెల్లవారాక కుమారుడి స్థితిని చూసిన రాజు దిగ్భ్రాంతి చెందాడు. …ువరాజు మెడలో చందనమాల లేక పోవడం గమనించిన రాజు దానినెవరో దొంగి లించారని గ్రహించాడు. దాని కోసం రాజ భవనమంతా వెతికించాడు. ఫలితం లేక పోయింది. దానిని తెచ్చి అప్పగించిన వారికి గొప్ప బహుమతి ఇస్తానని ప్రకటించాడు. అయినా ప్రెూజనం లేకపోయింది.
 
ఆఖరికి కుమారుడి శరీరాన్ని ఖననమో, దహనమో చే…ుకుండా అలాగే భద్రపరిస్తే చందన మాల దొరికినప్పుడు ప్రాణాలతో లేచి రాగల డని ఆశించాడు. అందువల్ల అరణ్యంలో ఒక అందమైన భవనాన్ని నిర్మించి దాని మధ్య ఒక వేదికను ఏర్పాటు చేసి దానిపై …ుువరాజు భౌతిక కా…ూన్ని ఉంచాడు. వారానికోసారి రాజ దంపతులు అడవికి వెళ్ళి కొడుకు కా…ూన్ని చూసి వచ్చేవారు.
 
చందనరాజు ఇంతవరకు చెప్పేసరికి తెల్ల వార సాగింది. అతడు పడుకుని బిరబ్రిగు సుకు పో…ూడు. సుందరి, చందనరాజు మళ్ళీ ప్రాణాలతో లేచేవరకు, అంటే అర్ధరాత్రి వరకు అక్కడే ఉండాలని నిర్ణయించింది. కొంతసేపటికి రాజదంపతులు అక్కడికివచ్చి, కొడుకు కా…ుం వద్ద కూర్చుని దీనంగా విల పించి వెళ్ళారు. తన కళ్ళకు పిల్లి ఇచ్చిన విభూతిని పూసుకోవడం వల్ల స్వప్నసుందరి వారికి కనిపించలేదు. పొద్దుపోయింది. అర్ధరాత్రి సమ…ుంలో చందనరాజు శరీరంలో చలనం కనిపించింది. ‘‘రాకుమారా, …ుక్షణులు ఇక్కడికి ఎప్పుడు రాగలరో చెప్పారంటే, వారి నుంచి ఆ చందన మాలను సంగ్రహించగలను.

ఎదుటి వారికి కనిపించకుండా ఉండగల విద్య నాకు తెలుసు,'' అన్నది సుందరి. చందనరాజు ప్రత్యుత్తరం ఇచ్చేలోగా ఆకాశం నుంచి వింత సంగీతం వినిపించింది. ‘‘అదిగో …ుక్షణులు వస్తున్నారు. లేత ఎరుపు రంగు రెక్కల …ుక్షణి నా హారాన్ని తీసుకెళ్ళింది,'' అని చెప్పి …ుువరాజు మౌనంగా ఉండిపో…ూడు. …ుక్షణులు వచ్చి వేదిక చుట్టూ నాట్యం చేశారు.
 
లేత ఎరుపు రంగు రెక్కల …ుక్షణి …ుువరాజును సమీపించి చందనమాలతో స్పృశించింది. అతడు లేచి కూర్చున్నాడు. ‘‘నన్ను వివాహ మాడతావా లేదా, రాకు మారా?'' అని అడిగింది …ుక్షణి. ‘‘నిరభ్యంతరంగా వివాహమాడతాను. అయితే, నువ్వు ఇక్కడే ఉండాలి! సరేనా?'' అన్నాడు రాకుమారుడు. ‘‘అదెలా సాధ్యం! నేను మానవకాంతను కాదు కదా? మాలోకంలో తప్ప మరెక్కడా ఉండలేను,'' అంటూ లేచి …ుక్షణి ముందుకు అడుగువే…ుబోయి తుళ్ళి కిందపడింది.
 
అంటే, అదృశ్యంగా స్వప్న సుందరి ముందుకు ఉరికి …ుక్షణి మెడలో ఉన్న చందనమాలను క్షణంలో లాక్కున్నది! …ుక్షణి శరీర స్పర్శతో సుందరిలోని అదృశ్యశక్తి మా…ుమై, చందనమాల చేత బట్టు కుని నిజరూపంతో కనిపించింది. ‘‘మానవకాంత మనల్ని చూసేసింది!'' అంటూ లేతఎరుపురంగు రెక్కల …ుక్షణి కీచుమని అరవడంతో, ఆమెతో సహా …ుక్షణీ స్ర్తీలందరూ తృటిలో మా…ుమై పో…ూరు.
 
సుందరి వేదిక వద్దకు వెళ్ళి రాకుమారుడి మెడలో చందనమాల వేసింది. రాకుమారుడు మందహాసం చేస్తూ లేచి నిలబడి స్వప్న సుందరి చేయిని పట్టుకుని, ‘‘నాకు ప్రాణం ప్రసాదించిన, ప్రి…ుతమా! నా తల్లితండ్రుల వద్దకు వెళదాం రా,'' అన్నాడు. ఇద్దరూ రాజధానికి చేరారు.
 
కుమారుణ్ణి చూడగానే రాజదంపతులకు తమ ప్రాణాలు లేచివచ్చినట్టయింది. స్వప్నసుందరి కార ణంగా తమ బిడ్డ పునర్జీవితుడ…్యూడని తెలుసుకుని, ఎల్లలు లేని ఆనందం పొందారు. ఆమెను తమ కోడలు చేసుకోవడానికి సంతో షంగా అంగీకరించారు. స్వప్నసుందరికీ, చందనరాజుకూ ఘనంగా వివాహం జరిగింది. చిరకాలం ఆనందంగా జీవించారు.

No comments:

Post a Comment