దుర్భిక్షదేశపు రాజు దుర్ముఖుడు గాఢంగా నిద్రిస్తూండగా కలలో
వికటాట్టహాసం వినిపించింది. ‘‘ఓరాజా, నీకు రోజూ సూర్యోదయూన్ని చూసే అలవాటు
ఉంది కదా? ఈ రోజు శుక్రవారం. ఎల్లుండి ఆదివారం సూర్యోదయం సమయంలో నీకు
మరణగండం ఉంది. ఆ గడువు దాటిందంటే నీకిక చావు లేదన్న మాటే!'' అంటూ కలలో ఒక
కంఠస్వరం రాజును హెచ్చరించింది. రాజు ఉలిక్కి పడిలేచాడు. ఒళ్ళంతా చెమటలు
పట్టగా, రాణిని మేల్కొలిపి తనకు వచ్చిన కలను గురించి చెప్పాడు.
‘‘కలలు కలలే. అవి నిజమవుతాయని భయపడకండి. హాయిగా నిద్రించండి,'' అంటూ
రాణి మాలినీదేవి అనునయించింది. అయితే, మృత్యుభయం పట్టుకున్న రాజు, క్షణకాలం
కూడా స్థిమితంగా ఉండలేక పోయూడు. అప్పటికప్పుడే సేనానిని పిలిపించాడు.
మంత్రి వివేకవర్థనుణ్ణి పిలిపించి, తనకు వచ్చిన పీడకలను వివరించాడు.
ప్రమాదం నుంచి బయట పడడానికి ఉపాయూలు ఆలోచించమని ఆజ్ఞాపించాడు.
మంత్రికి ఏమీ పాలుపోలేదు. రాజు కలలో వినిపించిన మాటలను నిజమని నమ్మితే
చేయకలిగిందేముంది అనుకున్నాడు. అయితే, రాజాజ్ఞ గనక, ఏదో ఒకటి చేయక తప్పదు.
రాజపురోహితుణ్ణీ, రాజ వైద్యుణ్ణీ రప్పించాడు. రాజు జాతక చక్రాన్ని
పరిశీలించిన పురోహితుడు, గ్రహాలస్థితిగతులను లెక్కించి, రాజుకు ముంచుకు
వచ్చే ముప్పేమీ లేదన్నాడు.
రాజు నాడిని పరీక్షించిన వైద్యుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని
చెప్పాడు. ఈలోగా సేనాని వచ్చి, ‘‘మహారాజా, అంతఃపురమంతటా వెతికాం. ఒక్కరూ
కనిపించలేదు. నగర వీధుల్లో అనుమానంగా కనిపించిన కొందరిని బంధించి
విచారించాం. వాళ్ళెవరూ ప్రమాదకారులుకారని తేలింది,'' అన్నాడు.
అయినా, రాజుకు మనసు కుదుటపడలేదు. ఆదివారం సూర్యోదయం దాటేవరకు తనకు
ఎలాంటి ఆపదా రాకుండా చూడమని మంత్రిని పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నాడు. రాజు
భయం పోగొట్టడానికి, మంత్రి పేరుమోసిన భూతవైద్యుణ్ణి పిలిపించాడు.
భూతవైద్యుడు ముగ్గులు వేసి, వాటి మధ్య పిండి బొమ్మలు ఉంచి వింత వింత
శబ్దాలు పుట్టిస్తూ ఏవేవో పూజలు చేశాడు. ఆ తరవాత, ��మహారాజా! ఇక ఏ
దుష్టశక్తీ తమరిని కొనగోట కూడా తాకజాలదు. నిర్భయంగా ఉండండి,�� అన్నాడు.
అయినా రాజు కొండచిలువనోట చిక్కిన జింక పిల్లలా మరణభయం నుంచి బయటపడలేక
పోయూడు. తెల్లవారి శనివారం వచ్చింది. రాజు అన్నపానీయూలు ముట్టుకోలేదు. రేపు
సూర్యోదయం కాగానే తన ఆయువు తీరిపోతుందన్న ఆలోచన మనసులో సుడులు
తిరుగుతూండగా మంత్రిని మళ్ళీ పిలిపించాడు. ��రేపు సూర్యుడు ఉదయించకుండా
అడ్డుకున్న వారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజ్యమంతటా చాటింపు వేయించు,�� అని
ఆజ్ఞాపించాడు.
ఆ మాట విన్న మంత్రి దిగ్భ్రాంతి చెందాడు. ��సూర్యోదయూన్ని ఆపడం ఎవరి
తరం? ప్రాణభయంతో రాజుకు మతి చెడింది,�� అనుకున్నాడు. అయినా రాజాజ్ఞ ప్రకారం
చాటింపు వేయించాడు. సాయంత్రమయ్యే సరికి, జ్ఞానశేఖరుడనే యువకుడు రాజు
వద్దకు వచ్చి, ��మహారాజా! మీ చాటింపు విన్నాను. సూర్యోదయూన్ని అడ్డుకుని
తమరిని ప్రాణాపాయం నుంచి తప్పించగలను,�� అన్నాడు. రాజు ఆ యువకుణ్ణి
ఆనందంతోనూ, విస్మయంతోనూ చూస్తూ, ��సూర్యోదయూన్ని ఎలా అడ్డుకోగలవు?�� అని
అడిగాడు. ��అది మాకు వంశానుగతంగా సంక్రమించిన రహస్యవిద్య. అయితే, మీరు
అందుకు ఓ పని చేయూలి,�� అన్నాడు యువకుడు. ��ఏమిటది?�� అని అడిగాడు రాజు
ఆతృతగా.
��రేపు వేకువ జామునే లేచి, రాజభవనంలోని తమశయ్యూగృహం తూరుపు గది కిటికీ
మాత్రం తెరిచి ఉంచి, ఉదయూద్రి కేసి చూస్తూ కూర్చోండి. సూర్యోదయం మీకు
కనిపించదు. అదేవిధంగా నగర వీధులలో ఘంటానాదం వినిపించేంతవరకు నగర ప్రజలు
ఒక్కరు కూడా ఇళ్ళ నుంచి వెలుపలికి రాకూడదని చాటింపు వేయించండి.
ఇక మీరు నిర్భయంగా ఉండవచ్చు, అని అభయమిచ్చి ఆ యువకుడు
వెళ్ళిపోయూడు. రాజు మనసు కొంత తేలిక పడింది. మరుసటి రోజు వేకువ జామునే రాజు
దుర్ముఖుడు తన శయ్యూగృహం తూరుపు గది కిటికీ దగ్గర కూర్చుని, ఊపిరి బిగ
బట్టుకుని ఉదయూద్రివైపే చూస్తున్నాడు. తూరుపు కొండ మీది చిక్కటి
అడవిలోనుంచి కారుమేఘాల్లాంటి దట్టమైన పొగలు లేచి ఆకాశాన్ని కమ్ముకున్నాయి.
గంట సేపుకుపైగా అలా పొగలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఈలోగా సూర్యుడు
ఉదయించే సమయం దాటి పోయింది. తాను ప్రాణాలతోనే ఉన్నానని నిర్ధారించుకున్న
రాజు గండంనుంచి బయట పడ్డానన్న సంతోషంతో శయ్యూగృహం నుంచి వెలుపలికి వచ్చాడు.
మరి కొద్ది సేపటికి తూరుపు దిక్కున పొగలు తొలగిపోగా ఆకాశంలో బారెడు
పొద్దెక్కి కనిపించింది. అయినా, రాజుకు ఏమీ కాలేదు. మరుక్షణమే నగర వీధులలో
ఘంటానాదం వినిపించడంతో, ప్రజలు తమ తమ ఇళ్ళ నుంచి ఆనందోత్సాహాలతో వెలుపలికి
వచ్చారు. అయితే, అర్ధరాజ్యం ఇమ్మంటూ జ్ఞానశేఖరుడు రాలేదు.
జ్ఞానశేఖరుడు రాడన్న నిజం మంత్రి వివేకవర్థనుడికి మాత్రమే తెలుసు.
ఎందుకంటే పీడకల వల్ల రాజును పట్టి పీడిస్తూన్న భయూన్ని పోగొట్టడానికి,
ఆయనే, జ్ఞానశేఖరుణ్ణి రాజు వద్దకు పంపి సూర్యోదయూన్ని ఆపుచేయగలనని నమ్మింప
జేశాడు. ఆ తరవాత నమ్మకస్థులైన అనుచరులతో వందల కొద్దీ బండ్లపై ఎండు గడ్డిని
నగరం చివరనున్న, తూరుపు కొండ అడవిలోకి తోలించాడు. ఈ గడ్డిపై నీటిని
చల్లించి సూర్యోదయ సమయూనికి కొంచెంముందు నిప్పు పెట్టించాడు. దానితో ఎగిసి
పడ్డ పొగల్లో రాజుకు సూర్యోదయం కనిపించలేదు. ఆ విధంగా రాజు భయూన్ని
పోగొట్టడంతో పాటు, పరమవివేకి అయిన మంత్రి వివేకవర్థనుడు ప్రజల మధ్య రాజు
గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా కాపాడాడు.
No comments:
Post a Comment