Pages

Friday, September 14, 2012

తెలివిగల కోడలు!


రామనాధపురంలో సంపన్నుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. ఆ…ునకు లేకలేక ఒక మగ బిడ్డ పుట్టాడు. తన సంపదలకు వారసుడు పుట్టా డన్న ఆనందం కొద్దీ బిడ్డకు భాగ్యనాధుడని పేరు పెట్టి మురిసిపో…ూడు వర్తకుడు. అయితే, భాగ్యనాధుడు బాల్యంలో సక్రమంగా చదువు కోకుండా అల్లరిచిల్లరగా తిరుగుతూ మంద మతిగా పెరిగి పెద్దవాడ…్యూడు.
 
అతని చుట్టూ చేరే మిత్రులు ఎదుట పొగుడుతూ, వెనక పరిహసించేవారు. ఈ పరిస్థితి వర్తకుడికి ఎంతో వేదన కలి గించింది. ‘‘మనల్ని భాగ్య వృద్ధాప్యంలో ఆదు కుంటాడనే ఆశ నాకు లేదు,'' అనేవాడు భార్యతో తరచూ. ఒకనాడు వర్తకుడు అలా అన్నప్పుడు, ‘‘మీరు అలా విచారపడడం తప్ప, వాడికెప్పు డయినా వ్యాపారపు పనులు అప్పగించి, వాణ్ణి దారిలో పెటే్ట ప్ర…ుత్నం చేశారా?'' అన్నది భార్య నిష్ఠూరంగా.
 
వర్తకుడికి అందులో నిజం ఉన్నట్టు తోచింది. ఆ రాత్రి భోజనం చేస్తూం డగా కొడుకుతో, ‘‘భాగ్యా, రేపటి నుంచి నువ్వు నాతో దుకాణానికి వచ్చి, వ్యాపారంలోని మెళ కువలు నేర్చుకో. అప్పుడే నా తదనందరం మన వర్తక వ్యాపారాలను స్వ…ుంగా చూసుకో గలవు,'' అన్నాడు. మరునాడు ఉద…ుం భాగ్యనాధుడు తండ్రితో కలిసి దుకాణానికి వెళ్ళాడుగాని, అతడి దృష్టి వ్యాపారం మీద నిలబడలేదు.
 
దుకా ణంలో పనిచేసే వారితో, వెచ్చాలు కొనడానికి వచ్చేవారితో పిచ్చాపాటీ మాట్లాడడంతోనే గడి పేశాడు. రెండో రోజు దుకాణానికి వచ్చాడు గాని, ఎవరితోనో కలిసి ఎక్కడికో వెళ్ళి, సా…ుం కాలానికి తిరిగివచ్చాడు. వ్యాపారంలో తల మునకలుగా ఉన్న వర్తకుడు దీన్ని గమనించ లేదు.
 
మూడో రోజు, దుకాణానికి వచ్చిన భాగ్య నాధుడు కొంతసేపటికల్లా అక్కడినుంచి వెళ్ళినవాడు ఆ తరవాత అటుకేసి తిరగలేదు. కొన్ని రోజులు గడిచాయి. వర్తకుడి భార్య, ‘‘మనవాడికి పెళ్ళీడు వచ్చింది. మంచి పిల్లను తెచ్చి పెళ్ళి చేసేస్తే, బాధ్య తలు గుర్తెరిగి నడుచు కోగలడనుకుంటాను,'' అన్నది భర్తతో.

వర్తకుడు ఆ మాటకు మొదట, ‘‘ఇలాంటి మందమతికి, ఎవడు పిల్లనిస్తాడు?'' అని, ఆ తరవాత కొంత సేపు ఆలో చించి, ‘‘సరే, వెధవాయికి మరొక అవ కాశం ఇచ్చి చూద్దాం. నువ్వు పిల్లను చూసేలోగా వాడికి ఒక పరీక్ష పెడదాం,'' అన్నాడు వర్తకుడు. ‘‘ఏమిటా పరీక్ష?'' అని అడిగింది భార్య.
 
‘‘రేపు వాడి చేతికి మూడు రూపాయిలివ్వు. ఒక రూపాయి పెట్టి ఏదైనా కొనుక్కుని తిన మని చెప్పు. రెండో రూపాయిని నదిలోకి విసిరి వే…ుమని చెప్పు. మూడో రూపాయికి-వాడు తినడానికి, తాగడానికి, నాటి పెంచడానికి, పశువు తినడానికి కొనుక్కురమ్మని చెప్పు,'' అన్నాడు వర్తకుడు. మరునాడు తల్లి, మూడు రూపాయి నాణాలు తన చేతిలో పెట్టి, చెప్పిన మాటలు విని భాగ్య నాధుడు ఆశ్చర్యపో…ూడు.
 
ఆ తరవాత అంగడి వీధికి వెళ్ళి ఒక రూపాయి పెట్టి పకోడీలు కొనుక్కుని తింటూ నదీ తీరం కేసి నడిచాడు. జేబులోని ఒక నాణాన్ని తీసి, నదిలోకి విసర బోయినవాడు, అలాగే ఆగిపో…ూడు. నదిలోకి రూపాయి నాణాన్ని విసరడం మూర్ఖత్వం కాదా అనిపించింది. మరి, అలా వే…ుకపోతే తల్లి మాటను పాటించనట్టు అవుతుంది కదా? ఎటూ తేల్చుకో లేక పక్కనే కనిపించిన ఎత్త యిన బండమీదికి వెళ్ళి చతికిలబడ్డాడు.
 
హఠాత్తుగా ఎవరో తన వెనక నిలబడినట్టు గ్రహించి తల తిప్పి చూశాడు. గుడి పూజారి కూతురు భాగీరథి చిన్నగా నవ్వుతూ కనిపిం చింది. ‘‘నదిలోకి అమాంతం దూకడం ఎలాగా అని ఆలోచిస్తున్నావా ఏం?'' అని అడుగుతూ ఎదుటికి వచ్చింది భాగీరథి. ఆమె తన మిత్రుడు హరి చెల్లెలన్న చొరవ కొద్దీ, ‘‘లేదు భాగీరథీ, ఈ నాణాన్ని నదిలోకి వేద్దామా? వద్దా? అని ఆలోచిస్తున్నాను,'' అంటూ భాగ్యనాధుడు తన సమస్యను చెప్పాడు.
 
అంతా ఓర్పుతో విన్న భాగీరథి గలగలా నవ్వుతూ, ‘‘నాణాన్ని నదిలోకి విసిరివేయొద్దు. నిజానికి ఆ నాణాన్ని ఖర్చు పెట్టకుండా ఇంటికి తీసు కువచ్చి ఇవ్వాలన్నదే మీ అమ్మ ఉద్దేశం,'' అన్నది. ‘‘మరి, ఒక్క రూపాయితో నాలుగు వస్తు వుల్ని ఎలా కొనడం?'' అన్నాడు భాగ్యనాధుడు.
 
భాగీరథి మళ్ళీ గట్టిగా నవ్వుతూ, ‘‘భాగ్యా, మందమతిలా అలా బెంబేలు పడిపోతున్నా వెందుకు? మీ అమ్మగారు కొనుక్కురమ్మన్నది ఖర్బూజా పండు. అందులో తినడానికీ, తాగ డానికీ, నాటి పెంచడానికీ, పశువుకు మేతా అన్నీ ఉన్నాయి కదా?'' అన్నది. ‘‘ఆ సంగతి నాకు స్ఫురించనే లేదు, భాగీ రథీ,'' అంటూ అతడు పైకి లేచాడు.

‘‘నా వెంట రా, నీకో మంచి ఖర్బూజా పండును కొనిపెడతాను,'' అన్నది భాగీరథి. ఆ తరవాత అతడు ఖర్బూజా పండును అమ్మ చేతికి ఇచ్చినప్పుడు ఆమె ఆనందంతో భర్త దగ్గరికి పరిగెత్తుకుపోయి, ‘‘చూశారా, మనవాడు ఏం తెచ్చాడో? వాడు మందమతి కాదండీ. చాలా తెలివైనవాడు,'' అన్నది. ‘‘వాణ్ణి ఇలా పిలువు,'' అన్నాడు వర్తకుడు.
 
భాగ్యనాధుడు వచ్చి ఎదుట నిలబడ్డాడు. ‘‘ఈ ఖర్బూజా పండును కొనే ఆలోచన నీకు స్వయంగా వచ్చి వుండదు. ఎవరి సలహా మీద దీనిని కొన్నావు?'' అని అడిగాడు తండ్రి. భాగ్యనాధుడికి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. అందువల్ల ‘‘హరి చెల్లెలు భాగీరథి,'' అన్నాడు నిజాయితీగా. ‘‘ఎవరూ, పూజారిగారమ్మాయే కదా? తెలి వైన పిల్ల.
 
ఇంకా ఏఏ సలహాలు ఇచ్చిందే మిటి?'' అని అడిగాడు తండ్రి తలపంకిస్తూ. ‘‘నాణాన్ని నదిలోకి విసిరివేయొద్దని చెప్పింది. ఇదిగో రెండో రూపాయి,'' అంటూ రూపాయిని తీసి తండ్రి చేతిలో పెట్టి ఇంటి లోపలికి వెళ్ళాడు భాగ్యనాధుడు. వర్తకుడు చిన్నగా నవ్వుతూ భార్య కేసి చూస్తూ, ‘‘మనవాడికి తగిన వధువు దొరికింది!'' అన్నాడు.
 
‘‘ఎవరూ, ఆ పూజారిగారమ్మా యేనా?'' అని అడిగింది భార్య. ‘‘మరెవరు? ఆమె తెలివయిన అమ్మాయి. భాగ్యాను జాగ్రత్తగా చూసుకో గలదు,'' అన్నాడు వర్తకుడు. ఆ తరవాత భార్యా భర్తలు వెళ్ళి పూజారి దంపతులను చూసి, భాగీరథిని తమ ఇంటి కోడలు చేసుకోవాలన్న తమ కోరి కను చెప్పారు. వాళ్ళూ అందుకు సమ్మతించారు. త్వరలోనే పెళ్ళి జరిగిపోయింది.
 
పెళ్ళయిన మరునాడు ఇంటి వద్దేఉండి పోయిన భాగ్యనాధుణ్ణి బలవంత పెట్టి అతని తండ్రితో పాటు దుకాణానికి పంపింది భాగీరథి. భాగ్యనాధుడు దుకాణానికైతే వెళ్ళాడు గాని, అక్కడ కుదురుగా కూర్చోలేక పోయూడు. వాడి వాలకం చూసి వాణ్ణి ఇంటికి వెళ్ళమన్నాడు తండ్రి. ఒక వారం గడిచింది. ఆచారం ప్రకారం భాగ్యనాధుడు భార్యను తీసుకువెళ్ళి అత్తవారింట వదిలి వచ్చాడు. మర్నాటి నుంచి అతడు శ్రద్ధగా, తండ్రితో పాటు దుకాణంలో కూర్చుని వ్యాపారం చేయసాగాడు.
 
అది తండ్రికి ఎంతో ఆనందం కలిగించింది. మరొక వారం గడిచింది. తండ్రికి తనయుడి శక్తిసామర్థ్యాలను రుజువు చేసుకో వాలనిపించింది. ‘‘రేపు పట్నానికి వెళ్ళి గ్రామంలో అమ్మడానికి తగిన సరుకులు కొనుక్కునిరా. కావలసిన డబ్బు ఇస్తాను. వెంట నౌకరును తీసుకెళ్ళి, కావాలంటే అక్కడే బస చేసి, నెమ్మదిగా ఎల్లుండే రా,'' అన్నాడు. భాగ్యనాధుడు చాలా సంతోషించాడు.

మర్నాడు ఉదయమే ఒక నౌకరును వెంటబెట్టు కుని గురబ్బ్రండిలో ఉత్సాహంగా పట్నానికి బయలుదేరాడు. వాళ్ళు పట్నం చేరేసరికి మధ్యాహ్నమయింది. ఇద్దరూ సంత వీధికి వెళ్ళి కావలసిన వస్తువుల ధరలను విచారించి తెలుసు కున్నారు. రేపు పొద్దునే డబ్బులు చెల్లించి కొనుక్కోవచ్చన్న ఉద్దేశంతో, అప్పటికే సాయం కాలం కావడంతో, సత్రం కోసం వెతికి, ఒక సత్రంలో దిగారు.
 
ఆ సత్రం యజమాని ఒక స్ర్తీ. ఆ స్ర్తీ వారికి భోజనం వడ్డిస్తూ, అక్కడ జూదమాడే సదుపాయం ఉన్న సంగతిని ప్రస్తా వించింది. ఆ మాటవినగానే భాగ్యనాధుడికి చదరంగం ఆడి, కొంత డబ్బు సంపాయించ వచ్చనే ఉత్సాహం కలిగింది. వెంటనే ఆటకు దిగాడు. మసక వెలుతురులో చదరంగం ఆట ఆరంభమయింది. తొలి రెండు ఆటలలోనూ తనే గెలవడంతో భాగ్యనాధుడికి మితిమించిన ఆత్మవిశ్వాసం కలిగింది. అయినా మూడో ఆట ఓడిపోయూడు.
 
నాలుగో ఆట తాను గెలు స్తాననుకుంటూన్న సమయంలో ఒక పిల్లి అటు కేసి గెంతడంతో దీపం ఆరిపోయింది. సత్రం యజమానురాలు దీపం ముట్టించడానికి కొంత… సేపు పట్టింది. ఆ తరవాత కొనసాగిన ఆటలలోనూ భాగ్యనాధుడు ఓడిపోయూడు. మధ్య మధ్యలో పిల్లి వచ్చి దీపం కుందెను పడ దోయడం, ఆ తరవాత ఆడే ఆటలో భాగ్యనాధుడు ఓడి పోవడం, సత్రం యజమానురాలు గెలుపొందడం జరు గుతూ వచ్చింది.
 
సత్రం యజమానురాలు సైగచేయడం వల్లే ఆ పిల్లి సమయూనికి వచ్చి దీపం కుందెను పడదోస్తున్నదన్న విషయం భాగ్యనాధుడు గ్రహించలేక పోయూడు. తన దగ్గరున్న డబ్బంతా పోగొట్టుకునేంత వరకు ఆడాడు. అంతటితో ఆగక ఇంకా ఆడి, ఆమెకు బాకీ పడ్డాడు. మరునాడు తెల్లవారాక, సత్రం యజమాను రాలు బాకీ పడిన సొమ్మును తీసుకురావ డానికి నౌకరును గ్రామానికి పంపమనీ, వాడు డబ్బుతో తిరిగి వచ్చేంతవరకు భాగ్యనాధుణ్ణి తోటపనులు, వంటపనులు చేయడంలో తనకు సాయపడమనీ పురమాయించింది.
 
సరుకులు కొనడానికి వెళ్ళిన కొడుకు రాక పోయేసరికి భాగ్యనాధుడి తల్లిదండ్రులు దిగులు పడసాగారు. మూడో రోజు సాయం కాలం నౌకరు వచ్చి జరిగింది చెప్పాడు. అంతలో తల్లిగారింటి నుంచి తిరిగి వచ్చిన భాగీరథి, జరిగిన సంగతి తెలుసుకుని, తను వెళ్ళి భర్తను తీసుకువస్తానని అత్తామామలకు నచ్చ జెప్పి, మగవేషం ధరించి, నౌకరును వెంట బెట్టుకుని పట్నానికి బయలుదేరింది.

పట్నం చేరగానే, నౌకరును బండితో సహా దూరంగా ఉండమని చెప్పి, తను మాత్రం సత్రం వద్దకు వెళ్ళింది. సత్రం యజమాను రాలి చేతిలో తన యజమాని ఎలా మోస పోయిందీ, మాటిమాటికీ దీపపు కుందెను పడదోసిన పిల్లి సంగతీ, నౌకరు భాగీరథికి వివరంగా చెప్పడంతో, ఆమె దుస్తుల్లో ఒక ఎలుకను దాచుకుని మరీ వెళ్ళింది. సత్రంలో ఒక గదిని తీసుకుంది. జూదం ఆడడంలో తనకు ఆసక్తి ఉన్నట్టు సూచన ప్రాయంగా సత్రం యజమానురాలికి చెప్పింది.
 
రాత్రి భోజనాలయ్యూక ఆట ఆరంభమ యింది. వచ్చిన వ్యక్తి చాలా తెలిగల ఘటం అని సత్రం యజమానురాలు ఇట్టే గ్రహిం చింది. ఆమె పిల్లి కోసం సైగ చేస్తున్న సమయం చూసి, భాగీరథి తన దుస్తుల్లో ఉన్న ఎలుకను వెలుపలికి వదిలి పెట్టింది. పిల్లి ఎలుక వెంట పరిగెత్తింది. సత్రం యజమానురాలు ఆటలో ఓడిపోయింది. వెళ్ళిన పిల్లి ఆ తరవాత తిరిగి రాకపోవడంతో, పిల్లి సాయం లేదు గనక, ఆ తరవాత ఆడిన ప్రతి ఆటలోనూ సత్రం యజ మానురాలు ఓడిపోయింది.
 
తన భర్త ఓడి పోయిన డబ్బుకు రెండింతలు భాగీరథి రాబట్టు కున్నది. మరునాడు తెల్లవారగానే భాగీ రథి అక్కడి నుంచి నౌకరు వద్దకు వచ్చి, భర్త సత్రం యజమానురా లికి బాకీ పడ్డ డబ్బు లిచ్చి, భర్తను విడిపించుకుని రమ్మని చెప్పింది. సత్రం యజమానురాలు డబ్బు పుచ్చుకుని భాగ్యనాధుణ్ణి వాడి వెంట పంపింది. భాగ్యనాధుడు గురబ్బ్రండిలో కూర్చున్న తన భార్య భాగీరథిని చూసి ఆశ్చర్యపోయూడు. అతన్ని విడిపించు కోడానికి తాము ఎలాంటి పథకం వేసిందీ నౌకరు వివరించాడు.
 
అది విని సంతోషించిన భాగ్యనాధుడు నౌకరునూ, భార్యనూ వెంట బెట్టుకుని వెళ్ళి సంతలో కావలసిన వస్తువులు కొనుక్కుని గ్రామానికి తిరుగు ప్రయూణమయ్యూడు. వారిని చూసిన వర్తకుడూ, ఆయన భార్యా పరమానందం చెందారు. జరిగినదంతా భాగీ రథి అత్తమామలకు వివరించింది. అంతా విన్న వర్తకుడూ, అతని భార్యా, ‘‘భాగ్యనాధుడు అసలు మారడు. అయితే, తెలివిగల మా కోడలి చేతుల్లో మా సంపదా, మా బిడ్డ భవిష్యత్తూ సురక్షితంగా ఉండగలదని మాత్రం రూఢిగా చెప్పగలం,'' అన్నారు ఒక్కసారిగా.

No comments:

Post a Comment