Pages

Friday, September 14, 2012

మనిషికి శాపం!


పట్నం వెళ్ళిన తన కొడుకు ప్రతాపుడు, చీకటి పడిన తర్వాతగాని రాడనుకున్న అతడి తల్లి జ…ుమ్మ, సూర్యాస్తమ…ుం కాకుండానే తిరిగి రావడం చూసి, ‘‘ఈ రోజు అరటిగెల త్వరగా అమ్ముడు పోయినట్లుంది!'' అన్నది. ప్రతాపుడు కష్టజీవి. ఇంటి వెనక మురుగు నీరు పారేచోట అరటి మొక్కలు నాటాడు.
 
ముదిరిన అరటి గెలలు పట్నం తీసుకువెళ్ళి సంతలో అమ్మితే, ఎంత లేదన్నా గెలకు వందరూపాయిలు వస్తాయి. ప్రతాపుడి భార్య విమల, భర్తకోసం మంచి నీళ్ళు తీసుకు వచ్చి, ‘‘పిల్లల బడి జీతాలు రేపే కట్టాలట!'' అన్నది. ‘‘అలాగా! ఎన్నో నెలలుగా కష్టపడి పెంచిన అరటిగెల అమ్ముడు పోయినా, ఆ డబ్బు అనుభవించే ప్రాప్తంలేని బతుకు. అంతా నా ఖర్మ!'' అని విసుక్కుంటూ, అరటిగెల అమ్మగా వచ్చిన డబ్బు విమల చేతిలో పెట్టాడు ప్రతాపుడు.
 
‘‘అంతలా చిరాకు పడితే ఎలారా?'' అన్నది జ…ుమ్మ. ‘‘లేకపోతే నాన్న చేసిన పనికి ఆనంద పడాలా?'' అన్నాడు ప్రతాపుడు కోపంగా. ఆ మాటలకు జ…ుమ్మ తెల్లబోతూ, ‘‘పదేళ్ళ క్రితం పోయిన మీ నాన్నను, ఇప్పుడు ఆడిపోసుకుంటున్నావు దేనికి?'' అని అడిగింది. ప్రతాపుడు కొద్దిసేపు మౌనంగా వూరుకుని, ‘‘అమ్మా, జరిగిందేమిటో నీకు తెలి…ుంది కాదు.
 
నాన్న స్నేహితుడు నరసింహం పదిహేనేళ్ళ క్రితం, ఇక్కడి పొలాలు అమ్మేసుకుని పట్నంలో వ్యాపారం పెట్టి, నాన్నను కూడా రమ్మన్నాడు. నాన్నకు పుట్టిపెరిగిన ఊరువదలడం ఇష్టంలేదు. ఇప్పుడు మనకు మిగిలింది నాలుగెకరాలు. దాని మీద వచ్చే ఆదా…ుంతో ఐదుగురం బతకాలి. నాన్న కూడా వ్యాపారంలో దిగితే ఎంత బావుండేది!'' అన్నాడు.

దానికి జ…ుమ్మ నిట్టూర్చి, ‘‘బావుంది! ఆ పైవాడు ఎవరికి ఎంత రాస్తాడో, అంతే దక్కుతుంది,'' అన్నది. ‘‘అలావేదాంతం చెప్పకు. ఆ నరసింహం కొడుకు గోవిందం, నా ఈడువాడే. ఎంత సుఖంగావున్నాడు! పట్నానికీ, మన ఊరుకూ మధ్యవున్న అడవిలోని ఋషీశ్వరుడిని దర్శించడానికి గురప్రు బగ్గీలో వెళుతూ, నడిచి వస్తున్న నన్ను బగ్గీలో ఎక్కించుకున్నాడు. వాడి వైభోగం చూస్తూంటే నా గుండె రగిలిపోతోంది,'' అన్నాడు ప్రతాపుడు కోపంగా.
 
కొడుకు కోపం చూసి జ…ుమ్మ మరిమాట్లాడ లేదు. ఆ రాత్రి విమల, ‘‘మీరు కూడా వెళ్ళి ఆ ఋషీశ్వరుడిని చూడకూడదా? ఆ…ున కనికరిస్తే, మన జీవితాల్లో ఏమైనా మార్పురావచ్చు,'' అన్నది భర్తతో. భార్య సలహా నచ్చిన ప్రతాపుడు, ఆ మర్నాటి ఉద…ూనే ఋషీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఋషీశ్వరుడు, ప్రతాపుడిని చూస్తూనే, ‘‘ఏం, నా…ునా, అలా విచారంగావున్నావు?'' అని అడిగాడు నవ్వుతూ.
 
ప్రతాపుడు తన పరిస్థితి చెప్పుకుని, ‘‘మీ భక్తుడు గోవిందం ఒకప్పుడు, మా ఊరివాడే. ఆ…ున తండ్రి అతడికి లక్షƒల ఆస్తిపాస్తులు ఇచ్చాడు. మా నాన్న నాకు ఇచ్చింది ఏపాటి! నాకు నా జీవితం మీద రోతపుడుతున్నది,'' అన్నాడు ఆవేశంగా. ఋషీశ్వరుడు చిన్నగా నవ్వి, ‘‘జీవితంలో హెచ్చుతగ్గులు సహజం. కాలప్రవాహంలో మార్పులు అనివార్యం. అయినా, మీ నాన్నగారు ఇచ్చిన తరగని ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తించలేక పోతున్నావు.
 
అదే నీ ఆరోగ్యం! నువ్వు కష్టపడతావు; కడుపునిండా తింటావు. ఇంట్లో అందరూ నిన్ను అభిమానిస్తారు. దానికి మించిన భాగ్యం లేదు. అయినా, నీలో ఈ అసంతృప్తి, నీ మిత్రుణ్ణి చూశాకేగదా కలిగింది? అంతకు ముందు సుఖంగానేవున్నావు. నిజానికి అతణ్ణి గురించి తెలుసుకుంటే, నీలో అసూ…ు కారణంగా కలిగిన అసంతృప్తి కలిగేదికాదు,'' అన్నాడు.
 
‘‘గోవిందం భోగభాగ్యాలతో హాయిగావున్నాడు. అతడికేం కొరత?'' అని అడిగాడు ప్రతాపుడు. ‘‘అయితే విను! గోవిందంలో ఐశ్వర్యం తెచ్చే అన్ని వ్యాధులూ, ఈ వ…ుసుకే తిష్ఠ వేశాయి. కోట్లువుండి ఏం లాభం! తీపి తినాలంటే చక్కెర వ్యాధి, ఉప్పు తినాలంటే రక్తపు పోటు.

నాలుగడుగులు వే…ునీ…ుకుండా ఆ…ూసం. వీటికితోడు వ్యాపారంలో తట్టుకోలేని పోటీ నిద్రలేకుండా చేస్తోంది. మందుల కోసం, మనశ్శాంతి కోసం తరచూ ఇక్కడికి వస్తూంటాడు,'' అన్నాడు ఋషీశ్వరుడు. ‘‘అలాగా!'' అంటూ ఆశ్చర్యపో…ూడు ప్రతాపుడు. ఋషీశ్వరుడు ఒక క్షణం ఆగి, ‘‘కావాలంటే నిన్ను క్షణాలలో కోటీశ్వరుణ్ణి చే…ుగలను. ప్రశాంతమైన ఇప్పటి జీవితమే చాలో, మనశ్శాంతి లేని కోటీశ్వరుడి జీవితం కావాలో, నువ్వే నిర్ణయించుకో,'' అంటూ ప్రతాపుడితలమీద చేయిపెట్టాడు.
 
ఆ వెంటనే ప్రతాపుడికళ్ళు మూతలుపడినై. ప్రతాపుడు బ్రహ్మాండమైన భవనంలో హంసతూలికాతల్పం మీద పడుకునివున్నాడు. ఇంటినిండా సేవకులు. ఎదుట పళ్ళూ, పంచభక్ష్యపరమాన్నాలూ. అయినా, ప్రతాపుడు ఆ…ూసంతో లేవలేక పో…ూడు. సేవకులను గట్టిగా పిలవడం కూడా సాధ్యపడలేదు. అతి ప్ర…ుత్నం మీదలేచి కూర్చుని, నేల మీద కాలుమోపి ముందుకు అడుగు వే…ుబోయిన వాడలాగే పడిపో…ూడు.
 
అలా పడిపోయినవాడు భార్యనూ, తల్లినీ పిలిస్తే వాళ్ళు, సేవకులను పిలవసాగారు. ఆ వెంటనే ప్రతాపుడు, ‘‘వద్దు! వద్దు! నాకీ జీవితంవద్దు!'' అని అరుస్తూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఋషీశ్వరుడు మందహాసం చేస్తూ, అతడికి కనిపించాడు. ‘‘నాకళ్ళు తెరిపించారు, స్వామీ! కోటీశ్వరుడి బాధలు నాకు వద్దు. నన్ను కంటికి రెప్పలా చూసుకునే భార్య, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతికే తల్లి. నాకేంలోటు?'' అన్నాడు ప్రతాపుడు.
 
‘‘సంతోషం, నా…ునా! తృప్తి, ఆరోగ్యం, ఆనందం-ఇవి మనిషికి చాలా ముఖ్యం. అవి వుంటే కోట్లరూపా…ులతో పనిలేదు. మరొక సంగతి; మనిషికి అసూ…ు శాపం వంటిది. నీ మిత్రుడు గోవిందంను చూశాకే అది నీలో తలెత్తింది. అసంతృప్తికిలోన …్యూవు. ఇప్పుడది తొలగి పోయింది. ఇక నీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది, వెళ్ళిరా!'' అని ఆశీర్వదించాడు ఋషీశ్వరుడు. ప్రతాపుడు, ఋషీశ్వరుడి పాదాలకు నమస్కరించి, సంతోషంగా ఇంటికి తిరుగు ప్ర…ూణమ…్యూడు.

No comments:

Post a Comment