బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించేటప్పుడు ఒక మహాధనికుడుండేవాడు.
ఆయన తొమ్మిదవ కోటి పూర్తిచేసి, పడగ ఎత్తే సమయూనికి ఒక కొడుకు పుట్టాడు.
అందుచేత కొడుక్కు ఆప్యాయంగా, నవకోటి నారాయుడు అని పేరు పెట్టాడు.
నారాయుడికి తండ్రి లేదనకుండా కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అందుచేత
కురవ్రాడు ఆడింది ఆట, పాడింది పాట అయింది.
అతడు దుష్టులతోను, దుండగీళ్ళతోను సహవాసం చేయసాగాడు. ఏమైతేనేం,
యుక్తవయసు వచ్చేసరికి తండ్రి ఒక చక్కటి పిల్లను చూసి నారాయుడికి అతి
వైభవంగా పెళ్ళి జరిపించాడు. మరి కొద్ది కాలానికే ఆయన కాలం చేశాడు. నారాయుడి
అజాగ్రత్త, దురలవాట్ల కారణంగా తండ్రి చేర్చిన ధనమంతా హారతి కర్పూరంలా
హరించుకు పోయింది. దానికి తోడు చిన్నప్పటి నుంచీ నారాయుడు హద్దూ పద్దూ
లేకుండా చేస్తూ వచ్చిన బాకీలన్నీ తడిసి మోపెడై, తండ్రి పోయేసరికి, కాల
సర్పాలలాగ వచ్చి పట్టుకున్నాయి.
ఋణ దాతలందరూ ఒక్కసారిగా వచ్చి చుట్టుకున్నారు. ఈ స్థితిలో నారాయుడికి
జీవితమంటే నిస్పృహ తోచింది. గత్యంతరం కానక, చివరకు చస్తే మేలనిపించింది.
ఏమీ బదులు చెప్పలేక, నారాయుడు వారితో, ‘‘అయ్యూ! నేను గంగ ఒడ్డున ఫలానా
మర్రిచెట్టు కింద ఉంటాను. అక్కడ మా పూర్వులు వదిలి వెళ్ళిన నిక్షేపమున్నది.
మీ మీ పత్రాలన్నీ పట్టుకుని అక్కడకు రండి,'' అని చెప్పాడు.
అవుననుకొని అందరూ ఆ మర్రిచెట్టు వద్దకు వెళ్ళి సిద్ధంగా వున్నారు.
నారాయుడు నిక్షేపం కోసం వెతుకులాడుతున్నట్టు నడిరాత్రి వరకు అటూ ఇటూ
తచ్చాడి, వాళ్ళు ఆదమరుపుగా వుండటం చూసి, గభీమని గంగలోకి దుమికేశాడు. ‘జయ్
పరమేశ్వరా!'' అని అతడు జాలిగా కేక వేసేంతలో ప్రవాహవేగం అతణ్ణి ఎంత దూరమో
లాక్కు పోయింది.
ఆ కాలమందు బోధిసత్వుడు ఒక లేడిగా జన్మించి, తక్కిన లేళ్ళ మందలకు
దూరంగా, గంగా తీరాన, లతలు పొదలు అల్లుకున్న ఒక మామిడి తోటలో నివాసం
ఏర్పరచుకున్నాడు. ఈ లేడి అన్ని విధాలా ప్రత్యేకత కలది-బంగారు శరీరచ్ఛాయ,
లక్కవంటి కాళ్ళడెక్కలు, వెండికొమ్ములు, రత్నపుపొడలలాగా జిగజిగ మెరిసే
చక్కటి కన్నులు-ఇటువంటి అపూర్వ సౌందర్యంతో ప్రకాశిస్తున్నది లేడి.
ఈ లేడికి అర్ధరాత్రి సమయూన విపత్తులో వున్న ఒక మానవుడి ఆక్రందనం
వినిపించింది. ��ఏమిటీ దీనాలాపం!�� అనుకొంటూ, బంగారు లేడి లేచి,
ఎదురీదిపోయి నారాయుడి వద్దకు చేరుకొన్నది. అతన్ని ప్రవాహం నుంచి కాపాడి
గట్టుకు చేర్చి, ��నీకు వచ్చిన భయంలేదు, నాయనా!�� అంటూ అది వాడికి ధైర్యం
చెప్పి, వీపుపైన ఎక్కించుకొని బసకు తీసుకుపోయింది. అతడు తేరుకునే వరకూ ఆ
లేడి అరణ్యంలో నుంచి ఫలాదులు తెచ్చి, నారాయుడికి ఆకలి దప్పులు తీర్చింది.
తరవాత ఒకరోజున, ��నాయనా! నిన్ను ఈ అరణ్యం దాటించి మీ రాజ్యానికి దోవ
చూపిస్తా. క్షేమంగా వెళ్ళిపో. అయితే ఒకే ఒక్క కోరిక-రాజుగానీ మరే
శ్రీమంతుడుగానీ నిన్ను ఎంతగా ఆకర్షించినప్పటికీ, ఫలానిచోట బంగారు లేడి
ఉన్నది అనే సంగతిమట్టుకు వెల్లడించవద్దు. ఇదే నా కోరిక,�� అని చెప్పింది.
సరేనన్నాడు నారాయుడు. ఈ వాగ్దానం నమ్మి, బంగారు లేడి వాడిని తన
వీపుపైన ఎక్కించుకొని కాశీరాజ్యానికి పోయే బాట మీద వదిలిపెట్టింది. సరిగ్గా
నారాయుడు కాశీపట్టణం చేరుకున్న రోజునే ఒక చిత్రం జరిగింది. అంతకు క్రితం
పట్టపురాణికి కలలో ఒక సుందరమైన బంగారు లేడి కనిపించి, ధర్మబోధ చేసిందట.
రాణి తన భర్త వద్దకు వచ్చి, ��అసలు లోకంలో ఉండక పోయినట్టయితే ఇటువంటి
లేడిరూపం నా కెందుకు కనబడుతుంది? దాన్ని వెంటనే నాకు పట్టి తెస్తేనే తప్ప,
జీవాలు నిలవవు,�� అంటూ పట్టుపట్టింది.
తక్షణమే రాజు చేసిన ఏర్పాటు ఏమంటే: ఒక ఏనుగు మీద అంబారీ, అంబారీలో
బంగారు బరిణె, బరిణె లోపల వెయ్యి మొహిరీలు - వీటితో అది ఊరేగుతుంది. బంగారు
లేడిని గురించిన భోగట్టా తెలిపే వారికి బరిణెలోని మొహిరీలను బహుమతిగా
ఇస్తారు. ఈ విధమైన ఒక ప్రకటన స్వర్ణపత్రం మీద లిఖింపించి, సేనాని
ఊరూరాదండోరా వేయించాడు. సరిగా ఈ దండోరా వేసే సమయూనికి నారాయుడు కాశీనగరంలో
అడుగు పెట్టాడు.
అతడు
సేనాని వద్దకు వచ్చి, ��అయ్యూ, మీకు కావలసిన ఆ బంగారులేడిని గురించి
నాకంతా తెలుసు. నన్ను ప్రభువు దగ్గరకు తీసుకుపొండి,�� అన్నాడు. తరవాత
నారాయుడు రాజునూ, పరివారాన్నీ వెంటబెట్టుకుపోయి, అరణ్య మధ్యంలో బంగారు లేడి
నివసించే ఏకాంత స్థలం చూపించి, తను అల్లంత దూరాన నిలబడ్డాడు. రాజుగారి
పరివారం ఒక్కసారిగా గొల్లుమని కేకవేశారు. లేడి రూపంలో వున్న బోధి సత్వడు ఆ
శబ్దం విన్నాడు.
��ఎవరో గొప్ప అతిథి వచ్చి వుండాలి. స్వాగతమిద్దాం,�� అనుకుంటూ అతడు
లేచి, రాజు నిలబడ్డచోటికి పోబొయ్యూడు. లేడి యొక్క వేగానికి రాజు
ఆశ్చర్యపోయూడు. విల్లమ్ములు తీసుకొని, లేడికి ఎక్కు పెట్టాడు. అప్పుడు లేడి
మృదుమధురమైన కంఠస్వరంతో ఇలా అన్నది: ��రాజా! ఆగు, తొందరపడకు, నా ఉనికిని
గురించి నీకు చెప్పినవారెవరు?�� రాజు చెవులకు ఈ మాటలు అమృత తుల్యంగా
వినబడినై.
ఆయనకు తెలియ కుండానే విల్లమ్ములు కిందపడినై. నిదానమైన మధుర స్వరంతో
బోధిస త్వుడు, ��రాజా! నా ఉనికిని నీకు తెలిపిన దెవరు?�� అని మళ్ళీ
ప్రశ్నించాడు. రాజు నారాయుడిని వేలు ఎత్తి ఆనవాలు చూపించాడు. అప్పుడు
బోధిసత్వుడు ఇలా ధర్మం చెప్పాడు : ��లోకంలో మానవుణ్ణి మించిన కృతఘు్నడు
లేడని శాస్త్రాలు చెప్పిన మాట నిజం.
జంతుభాష తెలుసుకోవచ్చు, పక్షిభాష తెలుసుకోవచ్చు. కాని మనిషి మాట అర్థం
చేసుకోవడం బ్రహ్మతరం కాదు,�� అంటూ తను నారాయుడిని రక్షించి పరిచర్యలు
చేసి, అతని వద్ద నుంచి వాగ్దానం తీసుకుని సాగనంపిన వృత్తాంతమంతా రాజుకు
వివరించాడు. రాజు ఉగ్రుడై, ��ఇదా సమాచారం! ఇటువంటి కృతఘు్నడు, మహాపాపి
లోకానికి పీడ.
ఒక్క బాణంతో వీణ్ణి హతమారుస్తాను,�� అని బాణం తీశాడు. బోధిసత్వుడు
ఆయనను వారించి, ��రాజా! చంపవద్దు. ప్రాణం తీస్తే ఏముంది? బ్రతికివుంటే
ఏనాటికైనా వాడికే బుద్ధి వచ్చి బాగుపడతాడు. నీ వాగ్దానం ప్రకారం
వాడికీయవలసిన బహుమతులు కూడా ఇచ్చివెయ్యి. ఇదే న్యాయం,�� అని హితబోధ చేశాడు.
రాజు అలాగే చేశాడు. బోధిసత్వుడిలోని ఔదార్యమూ, క్షమా మొదలైన మహత్తర
గుణాలన్నీ అప్పుడు బోధపడినై రాజుకు. బోధిసత్వుడు మహానుభావుడని గుర్తించి,
ఆయనను తన రాజ్యం నడిపించే సారథిగా ఎంచుకొన్నాడు.
No comments:
Post a Comment