స్కందషష్ఠి ఉత్సవానికి ఆ ఊళ్ళో రకరకాల దుకాణాలతో పెద్ద సంత
ఏర్పాటయింది. రామేశం, కామేశం మరి నలుగురు గ్రామస్థులు కలిసి సంతకు
బయలుదేరారు. సంత మొదట్లో ఒకడు ఖర్జూరాలము్మతూ, ``ఇవి మామూలు ఖర్జూరాలు
కావు. రుచి చూసే కొనండి,'' అంటున్నాడు. రామేశం వాణ్ణి సమీపించ బోతూండగా
కామేశం ఆపి, ``ఎక్కడైనా సరే ప్రథమ తాంబూలం నాకే,'' అంటూ ముందుకు వెళ్ళి
పండు రుచి చూసి, ``నేను మెచ్చి కొన్నానంటే నీ సరుకంతా క్షణాల మీద అము్మడై
పోతుంది.
నాకు రెండు వీశల పళు్ళ తూకం వెయ్యి,'' అన్నాడు. మిగతా వాళు్ళ కూడా
అక్కడ పళు్ళ కొన్నారు. నిమిషాలలో ఈ సంగతి మిగతా దుకాణాదారులకు తెలియడంతో, ఏ
దుకాణం ముందు ఆగినా కామేశానికే ప్రథమ తాంబూలమివ్వసాగారు. అలా వాళు్ళ
కొన్ని దుకాణాలు దాటి ముందుకు వెళితే ఒకడు అందమైన పాలరాతి బొమ్మలు అము్మతూ
కనిపించాడు. వాడు ధర చాలా ఎక్కువ చెబుతున్నాడని కామేశం ముందడుగు వేయడానికి
తటపటాయించాడు.
రామేశం ముందుకు వెళ్ళి, ``ఈ ఊళ్ళో ఇంత ధరపెట్టి వీటిని
కొనేవాళు్ళండరు. ఇచ్చేధర చెప్పు,'' అన్నాడు. ``ఇవి మామూలు బొమ్మలు కావు!
తాజమహల్ కట్టిన పాలరాతితో చేసిన బొమ్మలు. పెద్ద బొమ్మ వరహా కొక్కటి.
చిన్నవి వరహాకి మూడు. మీరు అడిగారు కాబట్టి, పెద్దబొమ్మ ఒకటి కొంటే
చిన్నబొమ్మ ఒకటి ఉచితంగా ఇస్తాను,'' అన్నాడు బొమ్మలమ్మేవాడు. ``పెద్దవి
రెండు కొంటాను. మూడు చిన్న బొమ్మలు ఉచితంగా ఇవు్వ,'' అన్నాడు రామేశం.
బొమ్మలమ్మేవాడు ఒప్పుకున్నాడు.
మిగతావాళు్ళ వెనక్కు తగ్గి, ``ఇలాంటి బొమ్మలు కొనాలంటే కళల పట్ల
ఆసక్తిఉండాలి. ఏమంటావ్ కామేశం,'' అన్నారు కామేశంతో. ఆ మాట విన్న రామేశం,
``వీళు్ళ ఇలా అంటున్నారేమిటీ! నీకు కళలంటే చాలా అభిమానమనీ, ఇలాంటి బొమ్మలు
కొని కళాకారులను పోషించడం నీకు ఇష్టం గనక, ఇక్కడా ప్రథమ తాంబూలం నీకే
దక్కాలనుకున్నానే,'' అన్నాడు ఆశ్చర్యంగా కామేశాన్ని చూస్తూ.
రామేశం మాటలకు పొంగిపోయిన కామేశం, ``నా గురించి వీళ్ళకు తెలియదు కానీ,
ప్రథమ తాంబూలం నాకే దక్కాలన్న నీ మాట మీద గౌరవంతోనైనా, ఇక్కడ నేనొక బొమ్మ
కొంటాను,'' అంటూ ముందుకు వచ్చి, ఒక పెద్దబొమ్మ తీసుకుని బొమ్మలమ్మేవాడికి
ఒక వరహా ఇచ్చాడు. రామేశం బొమ్మలమ్మేవాడితో, ``మేమిద్దరం ఒకటేలే, రెండు
బొమ్మలు తీసుకుంటాం,'' అంటూ వాడికి మరో వరహా ఇచ్చాడు. బొమ్మలమ్మేవాడు ఆయనకు
బొమ్మతో పాటు మూడు చిన్న బొమ్మలు ఉచితంగా ఇచ్చాడు. వెలుపలికి వచ్చాక
రామేశం కామేశానికి మూడు చిన్న బొమ్మలు చూపించి, ``రెండు పెద్ద బొమ్మలు
కొన్నందుకు ఇవి ఉచితంగా వచ్చాయి.
వీటిలో ఒకటి తీసుకో. మిగతా రెండూ నావి,'' అన్నాడు. ``న్యాయంగా
పంచుకుంటే ఇద్దరికీ చెరో ఒకటిన్నర బొమ్మరావాలి. బొమ్మను విరగ్గొట్టలేం
కాబట్టి, అరబొమ్మకు ధరకట్టి నాకివ్వడం ధర్మం. లేదూ, బేరమాడి పెట్టినందుకు
అరబొమ్మ ధర నీకు కూలీగా ఇచ్చాననుకుంటాను,'' అన్నాడు కామేశం అసంతృప్తిగా.
``బేరమాడినందుకు నీ దగ్గర కూలి తీసుకుంటానని ఎలాగనుకున్నావు?
బొమ్మలమ్మేవాడు ఒక పెద్ద బొమ్మకొంటే ఒక చిన్న బొమ్మ ఉచితం అన్నాడు.
రెండు పెద్ద బొమ్మలు కొంటే మూడు చిన్న బొమ్మలు ఉచితం అన్నాడు. అంటే,
మొదటి బొమ్మకు ఒక చిన్న బొమ్మ, రెండో బొమ్మకు రెండు చిన్న బొమ్మలు ఉచితం.
నీకేమో ప్రథమ తాంబూలం మనసాయె. మరి మొదటి బొమ్మకు ఉచితంగా వచ్చింది ఒక్క
చిన్న బొమ్మే కదా?'' అన్నాడు రామేశం చిన్నగా నవు్వతూ. ఇది వింటూనే
మిగతావాళు్ళ ఫక్కున నవ్వారు. కామేశం, రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు.
No comments:
Post a Comment