శాంతిపురం అనే గ్రామంలో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు.
ఇద్దరి పొలాలూ పక్కపక్కనే ఉండేవి. ఇద్దరిలో రామయ్య పేదవాడే కాని చాలా మంచి
వాడనే పేరుంది. భీమయ్య ధనికుడైనప్పటికీ ఎదుటివారి మేలు చూడలేని
పరమస్వార్థపరుడు. ఒకరోజు రామయ్య తన పొలం దున్నుతూ తనకు, ‘ఎన్నాళ్ళీ
కష్టాలు? ఏ దేవుడైనా కరుణిస్తే బావుణ్ణు కదా?' అనుకోసాగాడు. అంతలో నాగలి
కర్రుకు పెద్దరాయి అడ్డు పడి ఎడ్లు ఆగిపోయూయి.
రామయ్య పలుగు తెచ్చి రాయిని తొలగించాడు. ఆ రాయి కింద ఒక పాత
ఇనుపపెట్టె కనిపించింది. ఆ పెట్టెను తెరిచి చూస్తే, పాతకాలపు బంగారు నగలు!
రామయ్య ఆశ్చర్యానందాలతో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అదే సమయంలో
అటుకేసి వచ్చిన పక్క పొలం భీమయ్య, ఆ నగల పెట్టెను చూశాడు. రామయ్యకు పట్టిన
అదృష్టాన్ని చూడగానే అతడి కడుపు మండిపోయింది.
వాటిని కాజే యడం ఎలాగా అని ఆలోచిస్తూ రామ య్యను సమీపించి, ‘‘ఏమిటి
రామయ్యూ, నగలా? ఇలా ఇవ్వు చూద్దాం,'' అంటూ వాటిని తీసు కుని ఒక్కొక్కటిగా
పైకి తీసి చూస్తూ, ‘‘అరరె, ఇవన్నీ మా అమ్మ నగలు. చాలా కాలం క్రితం పోయూయి.
ఎన్నో చోట్ల వెతికిం చాము. కని పించ లేదు.
చివరకు
ఇక్కడ దొరికాయన్నమాట!'' అంటూ వాటిని తనతో తీసుకు పోబోయూడు. వెంటనే రామయ్య ఆ
పెట్టెను లాక్కొని, ‘‘ఇవి మీ అమ్మ నగలు కావు. అంతా అబద్ధం. ఇవి నాకు నా
పొలంలో దొరికాయి. దేవుడు ఇచ్చినవిగా భావిస్తున్నాను,'' అన్నాడు దృఢంగా.
భీమయ్య పట్టరాని కోపం నటిస్తూ, ‘ఇవి ముమ్మాటికీ మా అమ్మనగలే.
పద, గ్రామాధికారి దగ్గరికి. ఎవరివో తేల్చుకుందాం,'' అన్నాడు. ఇద్దరి
వాదనలూ విన్న గ్రామాధికారికి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియ లేదు.
భీమయ్య స్వార్థ పరుడనే విషయం గ్రామాధికారికి తెలుసు. రామయ్య నిజా యితీ
పరుడన్న సంగతీ ఆయనకు తెలుసు. అసలు సత్యాన్ని నిరూపించడం ఎలాగా అని
ఆలోచించిన గ్రామాధికారి, నగల పెట్టెను తన దగ్గరే ఉంచుకుని, తీర్పు రేపు
చెబుతానని ఇద్దరినీ పంపేశాడు.
మరునాడు గ్రామాధికారి తీర్పు కోసం రామయ్య, భీమయ్య వచ్చారు. గ్రామాధి
కారి ఎలాంటి తీర్పునిస్తాడో చూద్దామని గ్రామ ప్రజలు కూడా రచ్చబండ వద్ద గుమి
గూడారు. గ్రామాధికారి వచ్చి, పెట్టెను తెరిచి పరిశీలనగా చూస్తూ, ‘‘మీ
ఇద్దరి వాదనలూ విన్న తరవాత ఈ నగలు ఎవరికి చెందాలన్న విషయం గురించి .....''
అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ గురప్రుడెక్కల చప్పుడు వినిపించ డంతో వెనక్కు
తిరిగి చూశాడు.
రెండు గుర్రాలపై వచ్చిన రాజభటులు కిందికిదిగి, గ్రామాధికారిని
సమీపించి, ‘‘మహా రాజుగారు, వేటకు వచ్చి, సమీప అరణ్యం వద్ద విడిది చేసి
ఉన్నారు. తమరిని వెంట బెట్టుకురమ్మన్నారు,'' అన్నారు. అంతలో వాళ్ళ దృష్టి
గ్రామాధికారి ముందు తెరిచి వున్న పెట్టెలోని నగల మీద పడింది. వాళ్ళు
ఆశ్చర్యంతో ఆ నగలను చేతిలోకి తీసు కుని పరిశీలనగా చూసి, ఒకరి ముఖాలొకరు
చూసుకుంటూ, ‘‘ఇవి మహారాణిగారి ఆభర ణాలు. కొంతకాలం క్రితం దొంగిలించ
బడ్డాయి.
ఇవి మీకెక్కడివి?'' అని అడిగారు. గ్రామాధికారి రామయ్య, భీమయ్యల తగవు
గురించి చెప్పాడు. ‘‘అంటే, ఇద్దరూ తోడు దొంగలన్న మాట! పదండి మహారాజుగారి
దగ్గరికి,'' అని గద్దించారు భటులు. భీమయ్య గడగడ వణుకుతూ గ్రామాధి కారి
కాళ్ళపై బడి, ‘‘అయ్యూ, ఈ నగలతో నాకెలాంటి సంబంధమూ లేదు. ఇవి రామ య్యకు అతడి
పొలంలో దొరికాయి. దుర్బు ద్ధితో వాటిని కాజేయూలనుకున్నాను.
నన్ను క్షమించి రక్షించండి,'' అన్నాడు. ‘‘భీమయ్యూ, నీ దుర్బుద్ధిని నీ
నోటి గుండా బయట పెట్టించాలనే ఈ పథకం వేశాను. వీరు రాజభటులు కారు. నా
మనుషులే. నీవికావని ఒప్పుకున్నావు కాబట్టి ఈ నగలను రామ య్యకు ఇస్తున్నాను.
మంచి వాణ్ణి వంచించా లనుకున్న నీ దుర్బుద్ధికి వంద వరహాలు జరి మానా
విధిస్తున్నాను. ఇక మీదటనైనా బుద్ధిగా మసలుకో,'' అన్నాడు గ్రామాధికారి
గంభీరంగా.
No comments:
Post a Comment