చారులత, హేమలత ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు. ఇద్దరూ నడివయస్కులు. మంచి
చదువు సంధ్యలున్నవాళ్ళు. వాళ్ళ భర్తలు మంచి నేర్పూ, దక్షతా గలవాళ్ళవడంతో
చేస్తున్న వ్యాపారాల్లో రెండు చేతులా సంపాయిస్తున్నారు.
ఇంటిపనులు ముగియగానే, ఇద్దరు ఆడవాళ్ళూ, ఏదో ఒకరి ఇంటి అరుగు మీద
కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకునేవాళ్ళు. చూడడానికి స్నేహితురాళ్ళుగా
కనిపించినా ఇద్దరికిద్దరూ మరొకరిని వేళాకోళం పట్టించాలని
ప్రయత్నించేవాళ్ళు.
ఒకనాటి చల్లని సాయంత్రం వేళ ఇద్దరూ తీరిగ్గా కూర్చుని
మాట్లాడుకుంటున్న సమయంలో, వాళ్ళ భర్తల ఊసొచ్చి చారులత, ‘‘ఈమధ్య
కొన్నాళ్ళుగా మా ఆయన నన్ను లోగడంత ప్రేమగా, ఆదరంగా చూడడంలేదు,'' అన్నది.
దానికి హేమలత, ‘‘అవునా, మరి! చూశావూ, మా ఆయన ప్రవర్తన, మీ ఆయన
ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధం. నన్ను గతంలో కంటే, ఈమధ్య కొంత కాలంగా మరింత
ప్రేమగా, ఆదరంగా చూస్తున్నారు,'' అన్నది. ఇదివింటూనే చారులత, ‘‘అవునూ, మరి
మీ ఆయన పురావస్తువుల వ్యాపారిగదా!'' అన్నది.
No comments:
Post a Comment