Pages

Monday, September 10, 2012

గొప్పింటల్లుడు


మనోహరుడు చూడడానికి చక్కగా ఉంటాడు. అంతో ఇంతో చదువుకున్నాడు. మాధవితో అతడి పెళ్ళి జరిపించాలని తల్లిదండ్రులనుకున్నారు. చిన్నప్పటి నుంచీ తెలిసిన మాధవి అంటే మనోహరుడికి ఇష్టమే. అతడా విషయం మాధవితో పలుమార్లు చెప్పి ఉన్నాడు. ఒక రోజున జ్యోతిష్కుడొకడు మనోహరుడి చెయ్యి చూసి, ‘‘త్వరలోనే గొప్పింటల్లుడివవుతావు,'' అన్నాడు. డబ్బు మీద మోజున్న మనోహరుడికా మాట బాగా తలకెక్కింది.
 
 అంతగా డబ్బు లేని మాధవిని పెళ్ళాడాలా, వద్దా అని సందిగ్థంలో పడితే, ‘‘గొప్పింటి అల్లుడివి కావడానికి మొదట నువ్వు గొప్పవాడివికావాలి. మాధవే నీకు సరిజోడు. జ్యోతిష్కులు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మి, లేనిపోని ఆశలు పెట్టుకోకు,'' అని మందలించారు తల్లిదండ్రులు. ఆ మరునాడే ఆ ఊళ్ళో పాతికెకరాల పొలమున్న మోతుబరి రామస్వామి వాళ్ళింటికి వచ్చాడు.
 
తనకు మనోహరుడు నచ్చాడనీ, తన కూతురు కల్పనను పెళ్ళాడితే మూడెకరాల భూమి కానుకగా ఇస్తాననీ చెప్పాడు. మనోహరుడికి జ్యోతిష్కుడి మాట మీద గురి కుదిరి కల్పనను పెళ్ళాడాలనుకున్నాడు. ఆ విషయం మాధవికి తెలిసి బాధ పడింది.
 
ఆ రోజు సాయంకాలం గ్రామదేవత గుడివద్ద కనిపించిన మనోహరుణ్ణి, ‘‘కట్నం ఆశకులోనై చిన్నప్పటి నుంచి ఇష్ట పడిన నన్ను కాదనడం న్యాయమా?'' అని అడిగింది. ‘‘చిన్నప్పటి నుంచి నిన్ను నేను ఇష్టపడ్డానా? అసలే నీకు పిల్లికళ్ళు. నాకు కల్పన అందం ఎంతో నచ్చింది. అందుకే ఆమెను పెళ్ళాడాలనుకుంటున్నాను,'' అన్నాడు మనోహరుడు బింకంగా.

మాధవికి ఉక్రోషమొచ్చి, ��కల్పన తండ్రి మూడెకరాల పొలం కట్నమిస్తాననేసరికి నావి పిల్లికళ్ళయి పోయూయూ? నన్నిలా అన్నందుకు నా ఉసురు తగిలి వచ్చే జన్మలో నువ్వు పిల్లివై పోతావులే,�� అంటూ విసురుగా వెళ్ళిపోయింది. మనోహరుడు తల్లిదండ్రులకు జరిగింది చెప్పాడు. ఇక మాధవి అడ్డు లేదని గ్రహించి అతడి తండ్రి వెంటనే పురోహితుణ్ణి సంప్రదించి కల్పనతో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాడు.
 
నిశ్చితార్థం రేపనగా వాళ్ళ దూరపు బంధువు రంగస్వామి సకుటుంబంగా ఏదో పని మీద ఆ ఊరొచ్చి వాళ్ళింట్లో బస చేశాడు. ఆయన చాలా కాలంగా రాజధానిలో రాజు కొలువులో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన, భార్య మనోహరుణ్ణి చూసి, తమ కూతురు వందనకు ఈడూజోడూగా ఉంటాడని ముచ్చటపడి అతడి తల్లిదండ్రులకు చెప్పారు. మనోహరుడి తల్లిదండ్రులు మరునాడే అతడికి కల్పనతో నిశ్చితార్థమని చెబితే రంగస్వామి, ��అంతా విన్నాంలే.
 
చిన్నప్పటి నుంచీ అనుకున్న మాధవినే కాదన్నారు. ఇంకా నిశ్చితార్థమైనా కాని కల్పన గురించి ఆలోచన ఎందుకు? రామస్వామి మీకు మూడెకరాలు ఇస్తానన్నాడు కదా? పొలం ఎంతున్నా కష్టపడితే తప్ప ఫలసాయమందదు. పైగా సకాలంలో వర్షాలు కురవాలి. వరద ముంపు లేకుండా ఉండాలి. నేను మనోహరుడికి రాజుగారి ఆస్థానంలో ఉద్యోగమిప్పిస్తాను. వానొచ్చినా, వరదొచ్చినా జీతబత్తాలకు లోటుండదు.
 
శ్రమ తక్కువ, సుఖం ఎక్కువ. బోలెడు పలుకుబడి. ఆలోచించి చూడండి,�� అంటూ ఆశపెట్టాడు. మనోహరుడి తల్లిదండ్రులు సందిగ్థంలో పడ్డారు. కాని జ్యోతిష్కుడి మాట మీద మరింత గురి కుదిరిన మనోహరుడు, వందనను పెళ్ళిచేసుకోవాలనే నిర్ణయూనికి వచ్చాడు.
 
ఈ విషయం తెలిసిన కల్పన మనోహరుడి ఇంటికి వచ్చి, వందనను కలుసుకుని, ��చిన్నప్పటి నుంచీ అనుకున్న మాధవిని కూడా కాదని మనోహరుడు నన్ను ఇష్టపడ్డాడు. ఉద్యోగం ఎర చూపి మా ఇద్దరినీ వేరు చేయడం తగదు,�� అన్నది. వందన, ��ఉద్యోగం వస్తుందనే నన్ను చేసుకుంటున్నావా?�� అని మనోహరుణ్ణి అడిగింది.

అదేం కాదు. కల్పన చూడ్డానికి అందంగా ఉంటుందేగాని, విన్నావుగా ఆమె పౌరుషం తీరు. దెబ్బ తిన్న కుక్క మొరిగినట్టు. అది నాకు నచ్చలేదు. నువ్వు నచ్చావు. అందుకే నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను,鋳 అన్నాడు మనోహరుడు. కల్పనకు ఉక్రోష మొచ్చి, 荘వందన తండ్రి రాజాస్థానంలో ఉద్యోగమిప్పిస్తాననే సరికి నా మాట కుక్క మొరుగైపోయిందా? నన్నిలా అన్నందుకు నా ఉసురు తగిలి నువ్వు వచ్చే జన్మలో కుక్కగా పుడతావులే,鋳 అని చెప్పి వెళ్ళిపోయింది.
 
జరిగింది విన్న మనోహరుడి తల్లి, 荘నీ పెళ్ళి నీ ఇష్టం కానీ, అందుకు కన్నెపిల్లల ఉసురు పోసుకుంటున్నావు. ఇది సరైన పద్ధతి కాదురా,鋳 అని కొడుకును బాధతో మందలించింది. మనోహరుడు నవ్వి, 荘అవతల రాజాలాంటి జీవితం నాకోసం కాచుకుని ఉంది. వీళ్ళ శాపాలు నన్నేం చేస్తాయిలే,鋳 అన్నాడు. ఆ తరవాత రంగస్వామి వందనకూ, మనోహరుడికీ నిశ్చితార్థం చేసుకుందామన్నాడు. అయితే, మనోహరుడి తల్లిదండ్రులు నిశ్చితార్థం అవసరం లేదన్నారు.
 
కొడుక్కు రాజు కొలువులో ఉద్యోగం దొరికిన వెంటనే, వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించేద్దామన్నారు. రంగ స్వామి సరేనని మనోహరుణ్ణి తనతో రాజధానికి తీసుకువెళ్ళాడు. రాజుకొలువులో రంగస్వామిది చిన్న ఉద్యోగమే అయినా అతనికి రాజధానిలో పెద్ద పెద్ద వాళ్ళ పరిచయూలు ఉన్నాయి. అలా పరిచయమైన వారిలో అక్కడి ప్రముఖ వ్యాపారి రత్నస్వామి ఒకడు.
 
రంగస్వామి మనోహరుణ్ణి ఆయన వద్దకు తీసుకువెళ్ళి సంగతి చెప్పి, 荘మీరు రాజుకు సిఫారసు చేసి ఇతనికి ఆస్థానంలో కొలువు ఇప్పించండి. నా కూతురొక ఇంటిదైతే కలకాలం మీ పేరు చెప్పుకుంటాం,鋳 అన్నాడు. మనోహరుడి వివరాలు విన్నాక రత్నస్వామికి అతన్ని తన అల్లుడిగా ఎందుకు చేసుకోకూడదు అనిపించింది. ఆయన కూతురు జలజ కూడా మనోహరుడి రూపం చూసి మురిసిపోయి అతన్ని పెళ్ళాడడానికి ఒప్పుకున్నది.

రత్నస్వామి పెళ్ళి మాటెత్తగానే జ్యోతిష్కుడి మాట ఇప్పటికి నిజంగా నిజమయిం దని భావించిన మనోహరుడు వెంటనే ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన వందన జలజను కలుసుకుని, ‘‘చిన్నప్పటి నుంచీ అనుకున్న మాధవినీ, ఏరి కోరి వచ్చిన కల్పననూ కాదని నన్ను ఇష్టపడ్డాడు మనోహరుడు. ఐశ్వర్యం ఎర చూపి మా ఇద్దరినీ వేరు చేయడం నీకు తగదు,'' అన్నది.
 
జలజ వెంటనే మనోహరుణ్ణి పిలిపించి, ‘‘ఎందరినో కాదని ఇష్ట పడ్డ వందనను కాదని నన్ను పెళ్ళి చేసుకునేందుకు నా ఐశ్వర్యమే కారణమా?'' అని అడిగింది. ‘‘కాదు కాదు. నాకు సంగీతమంటే ఇష్టం. వందన పాడడానికి గళ మెత్తితే గార్దభస్వరమే. చక్కగా పాడే నువ్వు నాకు నచ్చావు. అందుకే నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను,'' అన్నాడు మనోహరుడు. వందన పట్టరాని కోపంతో, ‘‘జలజ ఐశ్వర్యం చూసేసరికి నాది గార్దభ స్వరమై పోయిందా? నన్నిలా అన్నందుకు నా ఉసురు తగిలి నువ్వు వచ్చే జన్మలో గాడిదవై పుడతావులే!'' అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
 
ఆ తరవాతి ముహూర్తంలో జలజకూ, మనోహరుడికీ వైభవంగా వివాహం జరిగిపోయింది. పెళ్ళయిన వారానికి రత్నస్వామిని సాటి వ్యాపారి ఒకడు, ‘‘ఏమయ్యూ, నీ కూతురికి ఎక్కడా సంబంధం దొరకనట్టు లేనివాడికిచ్చి చేశావు?'' అని అడిగాడు. అందుకు రత్నస్వామి నవ్వుతూ, ‘‘నా కూతురికి కోపమెక్కువ. లేనివాణ్ణి చేసుకుంటే పిల్లిలా పడివుంటాడు. నాకు సంపదలెక్కువ.
 
లేనివాడు అల్లుడైతే కుక్కలా కాపలా కాస్తాడు. మా ఇంటికి చాకిరి ఎక్కువ. లేనివాడైతే గాడిదలా చాకిరి చేస్తాడు. అదీ రహస్యం. తెలిసిందా?'' అన్నాడు. ఆ మాటలు మనోహరుడి చెవిన పడ్డాయి. గొప్పింట్లో తన స్థానమేమిటో, ధనాశ తనకు ఎంతటి ఆత్మగౌరవం లేని బతుకునిచ్చిందో, ముగ్గురు కన్నెపిల్లల ఉసురు పైజన్మలకు కాక, ఈ జన్మలోనే ఎలా తగిలిందో గ్రహించి విచారంగా నిట్టూర్చాడు.

No comments:

Post a Comment