పతాపరాయుడు అనే జమీందారు, సూర్యభూపతి అనే మరొక జమీందారు కుమార్తె
అనంతలక్ష్మి అనే ఆమెను వివాహ మాడాడు. ప్రతాపరాయుడి జమీకన్న, సూర్యభూపతి
జమీలో మరొక యూభై గ్రామాలు అధికంగా వుండేవి. వివాహం జరిగినప్పటి నుంచి
అనంతలక్ష్మికి, తను తక్కువ స్థాయి జమీందారును వివాహ మాడానన్న అసంతృప్తి
మనసులో మెదులుతూండేది. ఆ కారణంగా, భర్తను సూటీపోటీ మాటలతో దెప్పి పొడుస్తూ,
దివాణంలో చిన్నా పెద్ద ఉద్యోగులందరిచేతా చాటుమాటుగా గయ్యూళి జమీందారిణి
అనిపించుకునేది. ప్రతాపరాయుడు మాత్రం భార్య గయ్యూళితనాన్ని పట్టీ పట్టనట్లు
చూస్తూండేవాడు.
వాళ్ళ వివాహానికి యూభై ఏళ్ళు నిండినై. ఆ రోజు ఉదయూనే ఇద్దరూ
గురప్రుబగ్గీలో దాపులనున్న కొండ ప్రాంతానికి వెళ్ళి, అక్కడవున్న
చెట్టుచేమల్నీ, ఆ చుట్టు పక్కల మేస్తున్న పశువుల మందలనూ చూసి ఆనందించ
సాగారు.
ఉన్నట్టుండి అనంతలక్ష్మి, భర్తకు, అక్కడ గొర్రెల మందలో వున్న ఒక
పొటేలును చూపుతూ, ‘‘మన వివాహానికి యూభై ఏళ్ళు నిండిన శుభ సమయంలో, ఆ
పొటేలును కోయించి దివాణంలో అందరికీ విందు భోజనం ఏర్పాటు చేద్దాం,'' అన్నది.
అందుకు ప్రతాపరాయుడు అయిష్టంగా తలపంకిస్తూ, ‘‘యూభైఏళ్ళ నాడు జరిగి పోయిన
పొరబాటుకు, ఈ రోజు ఆ పొటేలును శిక్షించడం ఎందుకు?'' అన్నాడు.
No comments:
Post a Comment