Pages

Monday, September 10, 2012

భల్లూక మాంత్రికుడు


[అరణ్యగ్రామాల్లోని ప్రజలకు బందిపోట్ల బాధ లేకుండా చేసిన కాళీవర్మను, పొరుగు రాజుకు భ…ుపడి, జితకేతరాజు మరణశిక్ష విధించాడు. దిరిసెన తోపులో శిరశ్ఛేద సమ…ుంలో, ఎనుబోతుపై వచ్చిన తలారి నుంచి గండ్రగొడ్డలిని లాక్కుని కాళీవర్మ, ఆశ్వికనా…ుకుడి తల నరికాడు. అ మరుక్షణం జై, ఆదిభల్లూకా! అన్న పెద్ద కేక వినిపించింది. తరవాత-1]
 
ఆదిభల్లూకా, అన్న కేక వింటూనే ఆశ్వికులందరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు చూశారు. కాళీవర్మ గుర్రం మీది నుంచి కిందికి దూకి, తాను లోగడ ఆశ్వికుల నా…ుకుడికి ఇచ్చిన కత్తిని తీసుకుని, ఒరలో పెట్టుకున్నాడు. అంతలో కొండచరి…ుపైనుంచి దుముకుతున్న జలపాతం దగ్గిర, ఒక ఆజానుబాహుడైన వ్యక్తి కనిపించాడు.
 
‘‘ఇతడెవరో మాంత్రికుడై వుండాలి!'' అనుకుంటూ కాళీవర్మ, తానక్కడి నుంచి పారిపోేుందుకు ప్ర…ుత్నిస్తే, ఆశ్వికులు దారినడ్డగించగలరేమో అని, వాళ్ళ ముఖాలకేసి పరీక్షగా చూశాడు. ఆశ్వికుల్లో ఎవరిదృష్టీ అతడిమీద లేదు. అందరూ జలపాతం వెనకనుంచి, హఠాత్తుగా బ…ుటికి వచ్చిన వ్యక్తి కేసిభ…ూశ్చర్యాలతో చూస్తున్నారు.
 
ఇప్పుడు జలపాతం దాపులనుంచి కేక పెట్టినవాడు, దాని ముందున్న నీటిపా…ును దాటి, ఒడ్డుమీదికి వచ్చాడు. మనిషి మంచి బలశాలిలా ఉన్నాడు; చేతిలో దృఢమైన దండం వున్నది; దాని పిడిమీద ఒకే వజ్రంలో మలిచిన ఎలుగుబంటి తల మెరుస్తున్నది.

ఆ క్షణం వరకూ, ఆ ప్రదేశాన్నుంచి పారిపోవాలని ఆత్రపడుతున్న కాళీవర్మ, తమకేసి వస్తున్న ఆ వింత దుస్తులు ధరించినవాణ్ణి చూస్తూ కదలామెదలక వుండిపో…ూడు. ఆశ్వికులూ, ఎనుబోతు మీద వున్న తలారీ భ…ుకంపితులై చిన్నగా వణుకుతున్నారు.
 
ఎలుగ్గొడ్డు చర్మాలు ధరించినవాడు, వాళ్ళను సమీపించి, ‘‘నేను సమ…ూనికి ఆదిభల్లూకుడి పేరు స్మరించకపోతే, ఇక్కడ మరికొంత రక్తపాతం జరిగి వుండేదని, నాకు తెలుసు. నా పేరు భల్లూకమాంత్రికుడు!'' అన్నాడు.
 
ఒకటి రెండు క్షణాలు ఎవరూ మాట్టాడ లేదు. కాళీవర్మ కుడిచేత్తో కత్తినీ, ఎడమ చేత్తో తలారి నుంచి లాక్కున్న గండ్రగొడ్డలనీ పైకెత్తి పట్టుకుని, భల్లూక మాంత్రికుడితో, ‘‘అ…్యూ, అడక్కుండానే తమ పేరేమిటో సెలవిచ్చారు, బావుంది! ఇక ఇక్కడ, మీరన్నట్టు కొద్దిలో తప్పిన మరికొంత రక్తపాతం మాట! ఇప్పుడు నా దారిని ఎవరైనా అడ్డగిస్తే, మరికొన్ని కంఠాలు తెగి నేలపడనున్నవి,'' అంటూ గుర్రాన్ని అదిలించాడు.
 
‘‘ధైర్యశాలివిరా, …ుువకా! ఒక్క క్షణం ఆగు!'' అని భల్లూకమాంత్రికుడు తన మంత్రదండంతో, ఎనుబోతు మీద కదలా మెదలక వున్న తలారిని చిన్నగా పొడిచి, ‘‘ఒరే, ముసుగులో వున్న నువ్వు, ఈ దిరిసెనవన పిశాచానివా లేక రాజుగారి ప్రధాన తలారివా?'' అని అడిగాడు.
 
‘‘అ…్యూ, నేను ఏ పిశాచాన్ని కాదు; ముమ్మాటికీ రాజుగారి ప్రధాన తలారినే. ఆ…ున శిక్ష వేసినవాళ్ళ తలలు నరకటం నా పని,'' అన్నాడు తలారి.
 
‘‘అలా అయితే, శిరశ్ఛేదశిక్ష తప్పించు కోవటమే గాక, ఒక రాజసేవకుడి తల కూడా నరికి పారిపోజూస్తున్న నిందితుణ్ణి నువ్వేం చే…ుబోతున్నావు?'' అన్నాడు భల్లూకమాంత్రికుడు. ‘‘అ…్యూ, నేను నిరా…ుుధుణ్ణి! నా గండ్రగొడ్డలిని నిందితుడైన ఈ కాళీవర్మ బలప్రెూగంతో లాక్కున్నాడు,'' అన్నాడు తలారి బొంగురుపోయిన గొంతుతో.
 
ఈ మాంత్రికుడెవడోగాని తన మీదికి తలారినీ, ఆశ్వికుల్నీ ఉసికొల్పుతున్నాడని గ్రహించిన కాళీవర్మ, గండ్రగొడ్డలిని తలారి కేసి చాస్తూ, ‘‘ఒరే, ముసుగు పిశాచీ, ఇదిగో నీ గొడ్డలి! నా దారిని అడ్డగించగలవేమో చూడు!'' అన్నాడు. ఆ వెంటనే తలారి తన ముసుగు తీసి దూరంగా విసిరివేస్తూ, తడబడే మాటల్తో, ‘‘కాళీవర్మా, నువ్వు మహాశూరుడివి; దిరిసెన వన భైరవుడి సాక్షగా చెబుతున్నాను.

నా అహం కూడా దిగిపోయింది,'' అన్నాడు. ‘‘అహంతోపాటు తాగిన మైకం కూడా దిగిపోయి వుండాలి, ఇక దారి తొలుగు!'' అని, కాళీవర్మ, దూరంగా వున్న ఆశ్వికులతో, ‘‘మీ మాటేమిటి? మీ నా…ుకుడికి పట్టిన దుర్గతి జూశారు గదా?'' అన్నాడు. ‘‘శిరశ్ఛేద శిక్ష అమలు చే…ువలసిన వాళ్ళలో ఒకరు చావగా, రెండవవాడు లొంగిపో…ూడు. ఈ సంగతేదో రాజుగారికి చెబుతాం. దార్లు అడ్డగించి కుత్తుకలు నరికించుకునేంత అమా…ుకులం కాదు, మేము!'' అన్నారు ఆశ్వికులు.
 
‘‘బుద్ధిగల మాట చెప్పారు!'' అని కాళీవర్మ గుర్రాన్ని అదిలించి, అక్కడి నుంచి బ…ులుదేరబోేుంతలో, భల్లూక మాంత్రికుడు, ‘‘భల్లూకపాదగురో! ఎట్టకేలకు మనకు కావలసిన జాతకుడు దొరికాడు,'' అంటూ ఒక్క కేకపెట్టి, కాళీవర్మ గురప్రు కళ్ళెపు తాళ్లు పట్టుకుని, ‘‘కాళీవర్మా! ఇక్కడ మహామంత్రవేత్త అయిన భల్లూకమాంత్రికుడు వున్న సంగతే నువ్వు మరిచినట్టున్నదే!'' అన్నాడు.
 
కాళీవర్మకు చిన్నప్పటినుంచీ మాంత్రికులన్నా, భూతవైద్యులన్నా, గణాచార్లన్నా ఏమాత్రం గౌరవభావం లేదు. అలాటివారిని ఎంతమందినో లోగడ అతడు తను పుట్టి పెరిగిన గ్రామంలో, చుట్టుపక్కల వున్న గ్రామాల్లో చూసివున్నాడు. భల్లూకమాంత్రికుడి మాటలు వింటూనే కాళీవర్మ, అతడేదో తనను చులకన చేసి మాట్లాడుతున్నాడని కోపం తెచ్చుకుని, ‘‘అ…్యూ, తమ పేరు భల్లూకమాంత్రికుడా? వింటేనే భీతికొల్పేట్టుగా వుంది.
 
మీరు ఇంతకు ముందే మరొక భల్లూకుడి పేరు కూడా పలికారు; ఆ…ునెవరు?'' అన్నాడు. కాళీవర్మ తన పేరును ఇంత అపహాస్యం చేసి మాట్టాడినా భల్లూకమాంత్రికుడు కోపం తెచ్చుకోకపోగా, చిరునవ్వు నవ్వుతూ, ‘‘నా గురువుగారి పేరు భల్లూకపాదుడు, నా పేరు భల్లూకమాంత్రికుడు. ముందు ముందు జరుగనున్న మహాద్భుతాలు చూసి, మహదానంద పడబోేు నువ్వు, పేర్లలో వున్న ఈ చిన్న పోలికను చూసి గజిబిజి పడిపోకు,'' అన్నాడు.
 
‘‘ఇల్లొదిలి బ…ులుదేరిన తరవాత, ఇప్పటివరకూ ఎదురైన గజిబిజిల్తోనే మొహం మొత్తింది. ఇక త్వరగా మా గ్రామం చేరి, పొలం సేద్యం చేసుకుంటూ, ఉన్న దానితో తృప్తిపడతాను,'' అంటూ కాశీవర్మ గండ్రగొడ్డలిని, తలారి కేసి విసిరివేసి, గుర్రాన్ని గట్టిగా అదిలించాడు.

గుర్రం కదిలి, పదీ పన్నెండడుగులు నడిచి, ఇక దౌడు తీ…ుబోేుంతలో వెనకనుంచి భల్లూకమాంత్రికుడు పెద్ద గొంతుతో, ‘‘కాళీవర్మా, ఆగు! నీకెదురుగా వస్తున్న వాళ్లెవరో చూశావా?'' అన్నాడు. ఆ హెచ్చరిక వింటూనే కాళీవర్మ కొంచెం తల ఎత్తి ముందుకు చూశాడు. ఒక పెద్ద దిరిసెన చెట్టు వెనకనుంచి, ముగ్గురు ఆశ్వికులు వేగంగా వస్తున్నారు. వారిలో మధ్య వున్నవాడు పట్టుదుస్తులూ, పెద్ద తలపాగా ధరించి వున్నాడు.
 
పక్కలనున్నవాళ్ళు కవచధారులు; వాళ్ళ చేతుల్లో కత్తులూ, భుజాల మీద తళతళ మెరుస్తున్న డాళ్ళూ వున్నవి. వాళ్ళను చూస్తూనే కాళీవర్మ, గుర్రం కళ్ళాన్ని గట్టిగా వెనక్కు గుంజి ఆపాడు. కవచధారులైన ఆశ్వికుల మధ్య పట్టుదుస్తుల్లోవున్నవాడు, చేెుత్తి కాళీవర్మను చూపుతూ తలారితో, ‘‘ఒరే, నగర ప్రధాన తలారీ! ఈ నిందితుడికి శిరశ్ఛేద శిక్ష విధించారు రాజుగారు. ఇంకా శిక్ష అమలుచే…ులేదేం?'' అన్నాడు కోపంగా.
 
తలారి గడగడ వణికిపోతూ, ఎనుబోతు మీదినుంచి దిగి, ఏం జవాబివ్వాలా అని ఆలోచిస్తున్నంతలో భల్లూకమాంత్రికుడు, తలారిని ప్రశ్నించిన అతడిని సమీపించి, ‘‘నువ్వేగదా, జితకేతురాజుకు ప్రధానా మాత్యుడైన జీవగుప్తుడు?'' అని ప్రశ్నించాడు. రాజు పట్లగాని, తన పట్లగాని ఒక్క గౌరవవాచకం కూడా లేకుండా, అలా ప్రశ్నించిన వీడెవడో కపటబైరాగి అయి వుంటాడనుకుని మంత్రి జీవగుప్తుడు కళ్ళెరచ్రేసి, ‘‘ఎవడీ బైరాగి? ముందితణ్ణి ఇక్కడి నుంచి తన్ని తగలె…్యుండి,'' అన్నాడు.
 
ఆ ఆజ్ఞ వింటూనే మంత్రి పక్కన వున్న ఆశ్వికులు కత్తులు దూ…ుబోయిన వాళ్ళల్లా, భల్లూకమాంత్రికుడి మంత్ర దండం కేసి చూసి, నివ్వెరపో…ూరు. గుర్రాలు పెద్దగా సకిలిస్తూ, వెనక్కు నాలుగడుగలు వేసినై. ఏం జరిగిందో అర్థంకాని మంత్రి జీవగుప్తుడు, ఆశ్చర్యంగా తన అంగరక్షకులిద్దరికేసీ చూసి, ‘‘ఏం జరిగింది? అలా వణికిపోతున్నారేం?'' అని అడిగాడు.
 
‘‘అ…్యూ, పులికాదు, ఆ బైరాగి చేతిలోని మంత్రదండం పిడికి బిగించి వున్న ఎలుగుబంటి తల కేసి చూడండి! అది ఇంతకుముందు నోరు తెరిచి, కోరలు చాచి, కళ్ళల్లో నిప్పురవ్వలు రేపింది,'' అన్నారు ఆశ్వికులు.

జీవగుప్తుడు, భల్లూకమాంత్రికుడి మంత్రదండపు ఎలుగు తలాటం కేసి పరీక్షగా చూసి, హేళనగా నవ్వి, ‘‘ఏమో్ు, బైరాగీ! నీ మాట తీరూ, చేష్టలూ చూస్తూంటే, పెద్ద పొగరు బోతులావున్నావు. ఏమైనా టక్కుటమార విద్యలూ, ఇంద్రజాలం నేర్చినవాడివా?'' అని అడిగాడు. మంత్రి ఇలా అనగానే భల్లూకమాంత్రికుడు గుడ్లురుముతూ అతడి ముఖం కేసి తీక్షణంగా చూసి, ‘‘సన్యాసి ముదిరతే, బైరాగి అవుతాడని సామెత; తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు! నేను సన్యాసినీ కాను, బైరాగినీ కాను -- భల్లూకమాంత్రికుణ్ణి! జై, ఆది భల్లూకా!''
 
అంటూ ఒక కేకపెట్టి, మంత్రదండంతో పక్కనవున్న ఒక ఎండిన చెట్టుబోదెను గట్టిగాకొట్టాడు. మంత్రదండం దెబ్బకు చెట్టుబోదె నుంచి ఛఠీమంటూ నిప్పు రవ్వలు లేచి, మరుక్షణం చెట్టు భగభగమనే మంటలతో నిలుపునా కాలిపోసాగింది. మంత్రి జీవగుప్తు డెక్కివున్న గుర్రం వెనక కాళ్ళమీద లేచి, పెద్దగా నకిలిస్తూ దూరంగా పరిగెత్తింది. ఒకటి రెండు క్షణాలపాటు అక్కడవున్న ఎవరి నోటా మాట పెగలలేదు.
 
దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న కాళీవర్మ, గుర్రాన్ని అదిలించి భల్లూకమాంత్రికుడి దగ్గిరకు వచ్చి, గుర్రం దిగి, ‘‘ఆ హా, నువ్వు మామూలు మా…ులమారి ఐంద్రజాలికుడివి కాదు; మహామంత్రవేత్తవు! కపటీ, దుష్టుడూ అయిన ఈ జితకేతరాజు మంత్రిని హడలెత్తించినటే్ట, ఇతడి ప్రభువునూ, నీ మంత్రశక్తితో భ…ుకంపితుణ్ణి చేసి, కాస్త బుద్ధిగా రాజ్యపాలన చేసేట్టు ఎందుకు చే…ుకూడదు?'' అన్నాడు. ‘‘భళీ, నువ్వు ధైర్యశాలివే కాదు; బుద్ధిశాలివి కూడారా, …ుువకా!
 
నా మనసులో వున్నదానిని, ఇటే్ట పసికటే్టశావు!'' అని భల్లూకమాంత్రికుడు, కాళీవర్మను మెచ్చుకుని, మంత్రి జీవగుప్తుడితో, ‘‘మంత్రీ, నాశక్తి ఎలాంటిదో చూశావుగదా! ఇక ఇప్పుడిక్కడ ఆజ్ఞలివ్వ వలసినది నువ్వా? నేనా?'' అని అడిగాడు. మంత్రి జీవగుప్తుడు నిలువునా కాలిపోతున్న చెట్టుకేసే చూస్తున్నాడు. అతడికి తానేదో ప్రాణాపదలో చిక్కుకున్నట్టు భ…ుంపట్టుకున్నది.
 
భల్లూకమాంత్రికుడు మరోసారి గద్దించుతూ అదే ప్రశ్న అడిగే సరికి, అతడు వణుకుతున్న గొంతుతో, ‘‘అ…్యూ, భల్లూకమాంత్రికా! మీ అమోఘమైనశక్తుల్ని కళ్ళారా చూశాను. ఇక్కడే కాదు, తమకు తీరుబాటుంటే, రాజప్రాసాదానికి వచ్చి, అక్కడా జితకేతు రాజుగారికి ఆజ్ఞలూ, సలహాలూ ఇవ్వవచ్చు!'' అన్నాడు.

‘‘ఎంతటి మహామంత్రికి, ఎలాంటి దుర్గతి పట్టింది!'' అంటూ కాళీవర్మ చుట్టూ వున్న ఆశ్వికుల కేసీ, ఎనుబోతు దగ్గిర దిగాలుపడి వున్న తలారికేసీ చూశాడు. భల్లూకమాంత్రికుడు, తన మంత్రదండాన్ని పైకెత్తి పట్టుకుని, ‘‘నా ఆజ్ఞ లేమిటో అందరూ జాగ్రత్తగా వినండి!'' అని తలారితో, ‘‘ఓరీ, తలలు నరకటం చేతనైన నీకు, తెగిన తలలు తిరిగి శరీరానికి అంటించి కుట్టటం కూడా చేతనైవుండాలి, అవునా? వెంటనే ఆశ్వికనా…ుకుడి తలను మొండానికి కుట్టి, గుర్రం మీద కూర్చోబెట్టి, పడకుండా తాళ్ళతో బిగించు,'' అన్నాడు.
 
తలారి క్షణాల మీద ఆ పని ముగించి, ఆశ్వికనా…ుకుణ్ణి ఒక గుర్రం మీద పెట్టి, తాళ్ళతో బిగించాడు. కాని, హడావిడిలో వాడు ముఖాన్ని వీపు వైపుకు పెట్టి కుట్టటంతో, గుర్రం మీద పెడతల కళేబరం స్వారీ చేస్తున్నట్టయింది. జరిగిన పొరబాటు చూసి భల్లూకమాంత్రికుడితోబాటు, ఒక్క మంత్రి జీవగుప్తుడు తప్ప; అందరూ బిగ్గరగా నవ్వారు.
 
మాంత్రికుడు, జీవగుప్తుడి కేసి కళ్లెరచ్రేసి, ‘‘ఓయీ, మంత్రీ నువ్విప్పుడు తలారి వాహనమైన ఎనుబోతునూ, నీ వాహనాన్ని తలారీ అధిరోహించబోతున్నారు,'' అన్నాడు. జీవగుప్తుడు మారు మాట్టాడకుండా వడవడ వణుకుతూ వచ్చి, ఎనుబోతు మీద ఎక్కి కూర్చున్నాడు. అలాగే తలారి పోయి మంత్రి గుర్రం ఎక్కి, కళ్ళెపుతాళ్ళు పట్టుకున్నాడు. అందర్నీ నగరం కేసి బ…ులుదేరమన్నాడు, భల్లూకమాంత్రికుడు.
 
జితకేతరాజు మంత్రికి జరిగిన అవమానం చూసి, ఆనందపడుతూ కాళీవర్మ, ‘‘ఈ ఊరేగింపు చూసి నగరప్రజలు తప్పక వినోదిస్తారు! ఇక నా దారిన నేను పోయి, మా గ్రామం చేరతాను,'' అంటూ గుర్రాన్ని అదిలించేంతలో భల్లూకమాంత్రికుడు మంత్రదండం పైకెత్తి, ‘‘కాళీవర్మా, నా ఆజ్ఞ వినలేదా?'' అన్నాడు. ‘‘ఆజ్ఞా! ఎవడు నన్నిక్కడ ఆజ్ఞాపించగలవాడు?'' అంటూ కాళీవర్మ ఒర నుంచి కత్తి దూశాడు. 

No comments:

Post a Comment