హాయిగా కలలు కంటూ నిద్ర పోయూక, మగతగా కళ్ళు తెరి చాను. ఆ కలలో ఎందు
కోమరి అందరూ బద్ధకంగా కనిపించారు. ఆ కలకూ నేను చదివిన ‘హారీ పాటర్'కూ ఏదో
సంబంధం ఉందని మాత్రం తెలుస్తోంది. అంతకు మించి మరేదీ గుర్తులేదు. ఆ
శనివారాన్ని ఎంత సరదాగా గడపాలో ఆలోచిస్తూ పడక నుంచి లేచాను. స్నానం గదిలోకి
వెళ్ళి టూత్‌బ్రష్‌ను తీసుకో బోతూ దానికి అతికించి ఉన్న చిన్న కాగితం
ముక్కను తీసి చదివాను.
‘‘శ్రద్ధా, మేమొక ముఖ్యమైన పనిమీద అర్జంటుగా వెళుతున్నాం. డైనింగ్
టేబుల్ దగ్గరికి వెళ్ళి చూడు-అమ్మ.'' నేను ఆదుర్దాగా డైనింగ్ టేబుల్
దగ్గరికి వెళ్ళి చూశాను. అక్కడో పెద్ద ఉత్తరం కని పించింది. ఆరోజు నేను
చేయవలసిన పనుల జాబితా అది. సరదాగా గడపాలనుకున్న వేసవి శనివారం కల కరిగిపోసా
గింది. మొదటి పని వాషింగ్ మెషీన్ ద్వారా బట్టలుత కడం. హడావుడిగా మురికి
బట్టలన్నిటినీ తీసి మెషీన్‌లో వేసి స్విచ్ ఆన్ చేశాను.
అన్నీ సరిగ్గానే జరిగాయి, ఉన్నట్టుండి మెషీన్ వింత శబ్దం చేస్తూ
నీళ్ళను వెలికి చిమ్మేసింది. ఏం చేయడానికీ తోచక నా స్నేహితురాలిని రమ్మని
ఫోన్ చేద్దామని రిసీవర్ అందుకు న్నాను. నేను డయల్ చేసిన లైన్ కట్టయి
పోయింది. కాని అంతలో నాకు కొద్దిగా పరిచిత మైన వింత కంఠస్వరం నన్ను డాబా
మీదికి వెళ్ళమని ఆదేశించింది. ఉలిక్కిపడి కాస్త కంగారు పడుతూ రిసీవర్‌ను
పడేస్తున్నట్టు దాని స్థానంలో ఉంచాను.
కంఠస్వరం
ఎవరిదై ఉంటుందా అని ఆలోచిస్తున్నంతలో టెలివిజన్ నుంచి వింత శబ్దంతో భయంకర
మైన రెండు పెద్ద పెద్ద కళ్ళు కనిపించి వెనువెంటనే అదృశ్య మయ్యూయి. సరే,
వాటన్నిటినీ పట్టిం చుకోకుండా ‘శాండ్‌విచ్' తయూరు చేయడానికి వంట గదిలోకి
వెళ్ళాను. ఆపని పూర్తయ్యేలోగా మళ్ళీ అదే కంఠస్వరం. ఇప్పుడు ఫోన్ ుంచి
కాదు; పక్కనే ఉన్న తమ్ముడి గదిలోని మ్యూజిక్ సిస్టమ్ నుంచి.
ఇప్పుడు మాత్రం కాస్త భయపడ్డాను. ఆ కంఠస్వరం ఆదేశించి నట్టు డాబా
మీదికి ఎందుకు వెళ్ళాలి? అను కుంటూనే, నిదానంగా బాల్కనీ మెట్లెక్కాను.
తలుపు తెరవగానే అక్కడ ఒక చచ్చిన కాకి. దాని ఒళ్ళంతా పసుపు కుంకుమలు. కాకికి
రెండు వైపులా పుర్రెలు. చుట్టూ రకరకాల ఎముకలు. లేత ఎండలో ఆ దృశ్యాన్ని
చూసి దిగ్భ్రాంతితో అక్కడే నేలకు ఒరిగి అలాగే స్పృహ కోల్పోయూను. అలా
ఎంతసేపు ఉన్నానో ఏమో తెలి యదు.
కాలింగ్ బెల్ శబ్దం వినిపించడంతో కళ్ళు తెరి చాను. వెళ్ళి తలుపు
తెరిచి చూస్తే అక్క డెవరూ కనిపించలేదు. చుట్టు పక్కల పరిశీలించి చూశాను.
అందమైన ఓ ప్యాకెట్, దాని మీద నా చిరునామా కనిపిం చింది. మెల్లగా చేతిలోకి
తీసుకు న్నాను. అందులో ఇంకేమైనా వుందో ఏమో అన్న అనుమానంతో ప్యాకెట్‌ను
మెల్లగా తెరిచాను. ఆశ్చర్యం. అందులో ‘నాన్సీ డ్రూ అండ్ ది బ్లూ బియూర్‌డ
రూం' అనే అందమైన పుస్తకం కనిపిం చింది.
పరీక్షగా
చూడగా, తొలిపేజీలో ‘శ్రద్ధకు... ఎం ఆర్ ఎక్‌స నుంచి' అని వుంది. చదవడం
అంటే మహా ఇష్టం గనక, ఆ పుస్తకాన్ని తీసుకుని శరవేగంతో స్టడీ టేబుల్
దగ్గరికెళ్ళి కూర్చుని అప్పటికప్పుడే చదవడం మొదలుపెట్టాను. సైకోల గురించీ,
హంత కుల గురించీ వివరించే పుస్తకం అది. ఏదో అలికిడి అయి తలెత్తి చూస్తే,
కిటికీ తెరలకు ఆవల మూడు ఆకారాలు వెళ్ళడం లీలగా కనిపించింది. లేచి హడావుడిగా
వెళ్ళి తలుపు తెరిచి చూశాను.
అమ్మ, నాన్న, అన్నయ్య అదోలా నవ్వుతూ కనిపించారు. ఆ రోజు జరిగిన
వాటినన్నిటినీ తలుచు కుంటూన్నప్పుడు హఠాత్తుగా నా మనసులో తోచింది, ‘ఈ రోజు
ఏప్రిల్ పూల్‌సడే' అన్న విషయం. ఆ తరవాత ఒక్కొక్కటిగా అన్నీ అర్థమై
పోయూయి. మా నాన్న ఒక డాక్టర్. చచ్చిన కాకి, పుర్రెలు... ఆయన పనే అయి
వుంటుంది. మా అన్నయ్య తెలివైన మెకానిక్. టెలిఫోన్ స్వరాలు, టీవీ దృశ్యాలు
అతడు సృష్టించినవే. వాళ్ళకు నేను గట్టిగా బుద్ధి చెప్పాలనుకు న్నాను గాని,
ఆ తరవాత అన్నిటినీ సరదాగా తీసుకున్నాను.
No comments:
Post a Comment