బుద్ధవరం అనే ఒక చిన్న పట్టణంలో, నారన్న అనే మంచి మాటకారి
బిచ్చగాడుండేవాడు. వాడు బిచ్చం కోసం తిరిగే వీధుల్లో ఒక చోట పెద్ద వడ్డీ
వ్యాపారివుండేవాడు. నారన్నకు మామూలు ఇళ్ళల్లో బిచ్చం సులువుగా దొరికినా,
అది వాడి రోజువారీ తిండికి సరిపోయేదికాదు. వడ్డీ వ్యాపారి నుంచి అయితే, ఏదో
కొంత భారీగా డబ్బు ముట్టుతుందని, వాడి ఆశ.
కానీ, వడ్డీవ్యాపారి భవనద్వారం దగ్గరుండే కాపలావాడు, నారన్న అటుకేసి
నాలుగడుగులు వేయగానే, పోపొమ్మంటూ కసురుకునేవాడు. వడ్డీ వ్యాపారి కంటబడడం
ఎలాగా అని వాడు బాగా ఆలోచించి, ఒకనాడు వ్యాపారి ఇంటికాపలావాడు కొంచెందూరంలో
ఎవరితోనో మాట్లాడు తుండగా, ధైర్యం చేసి ద్వారం గుండా లోపల ప్రవేశించి,
‘‘అయ్యూ, వడ్డీ వ్యాపారిదాతగారూ!'' అంటూ కేకపెట్టాడు. నారన్న అలా భవనం
లోపలికిరావడం, ఆ కేకలూ విని వ్యాపారి పనివాళ్ళు, వాణ్ణి బయటకు
నెట్టేసేందుకు ప్రయత్నించారు.
ఐతే, వాడు మరింతగా కేకలు పెట్టడం ప్రారంభించాడు. భవనం పైగదిలో వడ్డీ
లెక్కలు చూసుకుంటున్న వ్యాపారి కిందికి దిగి వచ్చి, గొడవకు కారణం
తెలుసుకుని, నారన్నకు ఐదు రూపాయిలిస్తూ, ‘‘ఒరే, నీదేదో వీరముష్టిలా వుంది!
ముష్టి అడిగే పద్ధతి ఇది కాదు. నువ్వింత గొడవ చేయకపోతే, ఐదు కాదు పది
రూపాయలిచ్చి వుండేవాణ్ణి,'' అన్నాడు.
నారన్న డబ్బును జోలెలో వేసుకుని, వడ్డీ వ్యాపారితో, ‘‘అయ్యూ, ఇంతవరకు
ఒళ్ళు హూనమయ్యేలా మీ పనివాళ్ళు వడ్డించింది చాలు. అయినా, మీ వృత్తి వడ్డీ
వ్యాపారం. అదెలా చేయూలో మీకు నేను సలహాయివ్వలేదు. నేను వృత్తి బిచ్చగాణ్ణి.
నాకు బిచ్చం ఎలా ఎత్తాలన్నదాన్ని గురించి సలహాలివ్వకండి!'' అంటూ అక్కడి
నుంచి వెనుదిరిగాడు
No comments:
Post a Comment