ఒకానొకప్పుడు చోళరాజ్యాన్ని ధర్మాత్ముడైన ఒక రాజు పరిపాలించేవాడు.
ధర్మ పరిపాలన సాగించడంతో పాటు ప్రజలకు దానధర్మాలు చే
యడం అన్నా, కవి
పండితులను కానుకలతో సత్కరించడం అన్నా ఆ రాజుకు ఎంతో మక్కువ. ఆ
యన వద్దకు
దానం అంటూ వచ్చి వట్టి చేతులతో తిరిగివెళ్ళినవారు లేరు. ఆ
యన సాటిలేని
గొప్ప దాతగా పేరుగాంచాడు.
రాజధానిలో నూతన సంవత్సరారంభ వేడుకలు ఘనంగా జరుపుకోవడం అక్కడి
సంప్రదా
యం. ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా ఆటపాటలతో ఉత్సవాలు గొప్పగా
జరిగాయి. ఆఖరి అంశం కానుకలు అందుకోవడం. వరుసలు వరుసలుగా నిలబడి ప్రజలు
కావలసిన కానుకలు పుచ్చుకుని సంతోషంగా వెళ్ళసాగారు. అందరూ వెళ్ళి పో
యాక ఒక
బ్రాహ్మడు మాత్రం అక్కడ నిలబడి వుండడం రాజు గమనించాడు. అతడు చూడడానికి మరీ
అంత పేదవాడిలాగానూ లేడు. రాజు అతన్ని దగ్గరికి పిలిచి, ‘‘ఏం కావాలో
సెలవివ్వండి బ్రాహ్మణోత్తమా! ధన కనక వస్తువాహనాలు ఏవైనా కోరుకోండి. ఈ
క్షణమే ఇస్తాను,'' అన్నాడు.
‘‘అవన్నీ వద్దు ప్రభూ,'' అన్నాడు బ్రాహ్మడు విన
యంగా. ‘‘మరేం
కావాలి?'' అని అడిగాడు రాజు. ‘‘ప్రభువులు స్వ
యంగా చెమటోడ్చి సంపాయించిన
దానినే నేను కానుకగా పుచ్చుకోగలను. ఇక్కడ ఉన్నవాటిలో అలాంటిది ఏదైనా
ఉన్నదా?'' అన్నాడు బ్రాహ్మడు. ఆ మాటవిని రాజు విస్మ
యం చెందాడు.
బ్రాహ్మణ్ణి చూస్తే పరమసాధువులా కనిపిస్తున్నాడు. రాజు కొంతసేపు ఆలోచించాక
బ్రాహ్మడి కోరికలో న్యా
యముందనిపించింది. అక్కడున్న వస్తువులకేసి రాజు
ఒకసారి తేరిపార చూశాడు. వాటిలో ఒక్కటీ తను స్వ
యంగా కష్టించి సంపాయించింది
లేదు. అక్కడ ఉన్నవన్నీ పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన ప్రజాధనం
ద్వారా కొన్నవే.
‘‘బ్రాహ్మణోత్తమా, ఇక్కడ ఉన్నవి ఏవీ నేను స్వ
యంగా కష్టించి ఆర్జించినవి కావు. అయినా, నువ్వుకోరిన వాటిని కానుకగా స్వీకరించవచ్చు.
తమ అనుపమ పాండిత్యానికీ, జ్ఞానానికీ కానుకగా వాటిని సగౌరవంగా సమర్పించుకుంటాను. ఏంకావాలో సెలవివ్వండి,'' అన్నాడు.
‘‘క్షంతవ్యుణ్ణి ప్రభూ! ఇక్కడ ఉన్నవాటిలో ఏ ఒక్కదాన్నీ ముట్టుకోలేను.
న్యా
యమైన వాటినీ, ధర్మబద్ధమైన వాటినీ మాత్రమే తీసుకోగలను,'' అన్నాడు
బ్రాహ్మడు పునరాలోచన లేకుండా.
ఇలాంటి సంతోషకరమైన సందర్భంలో దానమంటూ వచ్చిన బ్రాహ్మణ్ణి వట్టి
చేతులతో పంపడం తన కీర్తికి భంగకరం కాదా అని రాజు మనసులో మథనపడసాగాడు.
బ్రాహ్మడికి ఎలాగైనా సంతోషం కలిగించాలన్న ఉద్దేశంతో, ‘‘అలాగే,
బ్రాహ్మణోత్తమా, రేపు వచ్చి, నీ ఇష్టానుసారం నేను స్వ
యంగా కష్టించి
ఆర్జించినదాన్ని కానుకగా పుచ్చుకునివెళ్ళు,'' అన్నాడు.
చిరునవ్వుతో బ్రాహ్మడు మెల్లగా వంగి రాజుకు నమస్కరించి, అక్కణ్ణించి వెళ్ళిపో
యాడు.
రాజు అంతఃపురానికి వెళ్ళి, చిరిగిన దుస్తులతో పేదవాడిలా వేషం
వేసుకుని, రాజభవనాన్ని వదిలి పనికోసం వెతుక్కుంటూ ఎక్కడ పని దొరుకుతుందా
అని ఒంటరిగా కాలినడకనే బ
యలుదేరాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరూ ఆ
యనకు
చే
రడానికి ఎలాంటి పనీ ఇవ్వలేదు.
ఆఖరికి
ఆ
యన సముద్రతీరం చేరుకున్నాడు. అప్పుడే పల్లెకారులు కొందరు చేపల వేటకు
పడవలపై సముద్రంలోకి వెళ్ళడానికి సిద్ధమౌతున్నారు. ‘‘అ
య్యా, నేనూ మీతో
వచ్చి చేపలు పట్టడానికి మీకు సా
యపడతాను,'' అని అడిగాడు మారువేషంలోని రాజు.
అయినా ఎవరూ ఆ
యన్ను వెంట తీసుకువెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఆఖరికి ఆ
యన
అక్కడేవున్న ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఇవ్వమని
మొరపెట్టుకున్నాడు. ఆ
యన వేషం చూసి కనికరించిన ఆ వృద్ధుడు, ‘‘ఈ రోజు నాకు
ఒంట్లో నలతగా వుంది. సముద్రంలోకి వెళ్ళలేను.
నాపడవలో నువ్వు వెళ్ళి చేపలు పట్టుకురా. పెద్ద చేపకు రాగి నాణెం, చిన్న చేపకు గవ్వ ఇస్తాను. సమ్మతమేనా?'' అని అడిగాడు.
సమ్మతమే అని చెప్పి రాజు, వలను తీసుకుని పడవలో సముద్రంలోకి కొంత దూరం
వెళ్ళి వల విసిరాడు. కొంతసేపు ఆగి వలను పైకి లాగాడు. అందులో ఒక పెద్ద చేప,
ఒక చిన్న చేప ఉన్నాయి. తనకు చేపలవేటలో అనుభవం లేదు.
రాత్రంతా సముద్రం మీద వున్నా ఇంతకన్నా ఎక్కువ చేపలు పట్టగలనన్న
నమ్మకంలేదు గనక, అప్పటికప్పుడే తీరానికి తిరిగివచ్చి, వృద్ధుణ్ణి
కలుసుకున్నాడు. రెండు చేపలను చూసి సంతోషించిన ఆ వృద్ధుడు చెప్పిన మాట
ప్రకారం ఒక రాగి నాణెం, ఒక గవ్వ ఇచ్చాడు.
రాజు అతనికి కృతజ్ఞతలు చెప్పి, వెనుదిరిగి వచ్చి, రాజభవనం
చేరుకున్నాడు. రాత్రంతా కాపలా కాసిన భటులు తెల్లవారు జామున ఆదమరిచి
నిద్రపోతున్నారు.
మరునాడు రాజు సభలో కొలువు తీరాడు. బ్రాహ్మడు రాజ దర్శనం కోసం వచ్చాడు.
ఆ
యన్ను చూడగానే రాజు, ‘‘బ్రాహ్మణోత్తమా, గత రాత్రి నేను స్వ
యంగా శ్రమ
పడి ఒక రాగి నాణెం, ఒక గవ్వ సంపాయించాను. నీ అభీష్టానుసారం నువ్వు దానిని
స్వీకరించు. ఇంకా కావాలంటే చెప్పు. ఖజానానుంచి కావలసినంత ఇప్పిస్తాను,''
అన్నాడు.
‘‘వద్దు, ప్రభూ! అది ప్రజాధనం గనక దాన్ని ముట్టుకోదలచలేదు.
క్షమించండి. మీరు శ్రమపడి సంపాయించి తెచ్చినదాన్ని పరమ సంతోషంతో
పుచ్చుకుంటాను, ఇవ్వండి,'' అన్నాడు.
రాజు ఆ రాగి నాణెం, గవ్వ తీసి ఇచ్చాడు. బ్రాహ్మడు వాటిని పరమానందంతో
పుచ్చుకుని, కళ్ళకు అద్దుకుంటూ, ‘‘ప్రభువులు చెమటోడ్చి సంపాయించిన ధనం ఇది.
దీనికి వెలకట్టలేము. అమూల్యమైనది. ధర్మ ప్రభువులు చిరకాలం వర్థిల్లాలి,''
అంటూ రాజుకు మరొకసారి వంగి నమస్కరించి ఇంటికి బ
యలుదేరాడు.
ఇంటి దగ్గర బ్రాహ్మడి భార్య, రెండవ రోజు రాజదర్శనానికి వెళ్ళిన భర్త
ఎలాంటి విలువైన కానుకలతో తిరిగివస్తాడో అని అమిత ఆసక్తితో ఎదురు
చూస్తున్నది. ధనంతో పాటు విలువైన కానుకలు తీసుకురాగలడని కలలు కనసాగింది.
చిరునవ్వుతో భర్త రాగానే, తప్పక విలువైన కానుకలే తెచ్చి ఉంటాడన్న నమ్మకంతో,
‘‘ఏం తెచ్చారేమిటి?'' అని అడిగింది.
‘‘చాలా విలువైనదే తెచ్చాను. ఒక విధంగా అమూల్యమైనదే అని చెప్పాలి.
ఎందుకంటే ఇలాంటి కానుకను మన రాజ్యంలో ఏ ఒక్కరూ రాజు నుంచి పుచ్చుకోలేదు!'' అన్నాడు బ్రాహ్మడు.
‘‘అలాగా! ఏదీ చూపండి మరి,'' అని తొందరపెట్టింది భార్య.
బ్రాహ్మడు ఉత్తరీ
యంలో ముడివేసుకుని రొండిన దోపుకున్న రాగి నాణెం,
గవ్వ తీసి భార్య అర చేతిలో పెడుతూ, ‘‘ఇది రాజు స్వ
యంగా కష్టపడి
ఆర్జించినది. ఖజానాలోని మణి మాణిక్యాల కన్నా, స్వర్ణ ఆభరణాల కన్నా
విలువైనది. ఎందుకంటే అవన్నీ ప్రజలనుంచి రాబట్టినవి. అదీ తేడా!'' అన్నాడు
ఎంతో గొప్పగా.
‘‘ఏమిటండీ, ఇది. ఒక రాగి నాణెం, ఒక గవ్వ. వీటినేమో చాలా అమూల్యమైనవి
అంటున్నారు. మీకేమయింది? వెళ్ళేప్పుడు మామూలుగానే ఉన్నారుగా?'' అంటూ
బ్రాహ్మడి భార్య కోపంతో వాటిని వాకిట్లోకి విసిరికొట్టింది. రాగి నాణెం
ఉత్తర దిశగా, గవ్వ దక్షణ దిశగా దొర్లుకుంటూ వెళ్ళాయి.
భార్యతో పోట్లాడటం ఇష్టంలేక బ్రాహ్మడు మౌనంగా ఊరుకున్నాడు. ఆ తరవాత
ప్రశాంత చిత్తంతో అనుదిన చర్యలలోకి దిగాడు. భార్య కూడా తమ గతి ఇంతే అనుకుని
ఇంటి పనులలో నిమగ్నమైపోయింది. ఇద్దరూ రాగి నాణెం, గవ్వ సంగతి మరిచిపోయి,
రాత్రి భోజనాల
య్యాక హాయిగా నిద్రపోయారు.
తెల్లవారాక ఆ బ్రాహ్మణ దంపతులు వాకిట్లోకి వచ్చి, అక్కడి దృశ్యాన్ని
చూసి దిగ్భ్రాంతి చెందారు. రాగి నాణెం పడిన చోట బంగారు చెట్టు కనిపించింది.
చెట్టునిండా బంగారు నాణాలు. గవ్వ పడిన చోట వెండి చెట్టు. చెట్టు కొమ్మలకూ
రెమ్మలకూ వెండి నాణాలు!
అమితానందంతో
దంపతులు నాణాలు కోసుకున్నారు. బ్రాహ్మడు వెళ్ళి బంగారాన్నీ, వెండినీ అమ్మి
ధనం తెచ్చాడు. ‘‘రాజు నుంచి ఇంతవరకు ఇలాంటి కానుకను ఎవరూ పుచ్చుకోలేదని
నేను చెప్పాను కదా. చూశావా ఇప్పుడు?'' అన్నాడు భార్యతో.
‘‘రాగి నాణాన్నీ, గవ్వనూ హీనంగా చూసినందుకు నన్ను క్షమించండి,'' అని క్షమాపణలు చెప్పుకున్నది భార్య.
ఆ తరవాత భార్యాభర్తలు ఎలాంటి కొరతా లేకుండా, హాయిగా తృప్తిగా జీవించారు. సకల సౌభాగ్యాలు గల సంపన్న గృహస్థులన్న పేరు తెచ్చుకున్నారు.
No comments:
Post a Comment