లాహోల్‌ను స్పితీ నదితో కలిపే కుంజాంలా కనుమ సమీపంలోని లోయలో
చంద్రతల్ అనే తటాకం ఉండేది. శీతాకాలంలో తటాక జలాల పైభాగం
గడ్డకట్టుకుపోయేది. వేసవి కాలంలో దట్టమైన పచ్చటి గడ్డితో కొండ చరి యలు ఎంతో
అందంగా కనిపించేవి. మంచు కిరీటాలతో కొండ శిఖరాల ప్రతిబింబాలు తటాక జలాలలో
మనోహర దృశ్యాలను ఆవిష్క రించేవి. పరిసర ప్రాంతాలలోని గ్రామాల నుంచి గొర్రెల
కాపరులు తమగొర్రెల మందలతో అక్క డికి చేరేవారు.
గొర్రెలకు కావలసినంత పచ్చగడ్డి లభించడం వల్ల, శీతాకాలం సంకేతాలు మొదల
య్యేంత వరకు అక్కడే మకాం చేసేవారు. చంద్రతల్ తటాక సమీపంలో ఉన్న హాన్సే
గ్రామంలో నీమా అనే యువకుడు అన్న, వదినెలతో కలిసి నివసిస్తూండేవాడు. వదినె
డోల్నా గయ్యూళి. శీతాకాలంలో నీమా ఇంటి దగ్గర ఉండేప్పుడు - కట్టెలు చీల్చడం,
నీళ్ళు తేవడం లాంటి ఇంటి పనులన్నిటినీ అతనికి పురమాయించేది వదినె డోల్నా.
పొద్దస్తమానం తిడుతూ ఉండేది.
‘‘ఒక
పని చేసీ, చేయక ముందే అలా కూర్చుంటావేమిటి? తొందరగా పెళ్ళి చేసుకుని
పెళ్ళాన్ని తెచ్చుకో. నీ పనులూ, నా పనులూ అన్నీ నీ పెళ్ళాం చేసి పెడుతుంది.
అప్పుడు హాయిగా కూర్చుని కావలసినంత విశ్రాంతి తీసుకోవచ్చు,'' అని సాధిస్తూ
ఉండేది. ఎప్పుడెప్పుడు వేసవి వస్తుందా, ఎప్పుడె ప్పుడు గొర్రెలను తోలుకుని
కొండచరియలకు వెళదామా అని నీమా ఎల్లప్పుడూ ఎదురు చూస్తూండేవాడు. వేసవికాలం
ఆరంభం కాగానే, వదినె ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకుని, గొర్రెలను తోలుకుని
కొండల మీదికి వెళ్ళే వాడు. కాళ్ళ కింద పచ్చిక తగలగానే గొర్రెలు సంతోషంతో
ఎగిరేవి.
నీమా గొర్రెలను మేయడా నికి వదిలి, దాపుల నున్న గుహను శుభ్రం చేసి,
తెచ్చుకున్న ఆహారపదార్థాలను ఒక మూలలో పెట్టి, గొర్రెల రక్షణకు వృత్తాకారంలో
తడికల దడి నిర్మించేవాడు. అవన్నీ పూర్తయ్యూక గుహ ముందు ఎండుటాకులు
పరుచుకుని వెల్లకిలా పడుకుని ముల్కీలా కొండ శిఖరం మీది మేఘా లను చూస్తూ
కాలం గడిపేవాడు. సాయంకాలానికి వెళ్ళి, గొర్రెలను మళ్ళించి తడికల దడిలోకి
తోతేవాడు.
తరవాత ఆకలికి ఇంత తిని, ప్రజలు కథలు కథలుగా చెప్పు కునే చంద్రతల్
జలదేవతను గురించి కలలు కంటూ నిద్రపోయేవాడు. అది ఒక పున్నమి రాత్రి. నీమా
తటాకం సమీపంలో చలిమంట ముందు కూర్చుని ఉన్నాడు. చంద్రతల్ నిర్మల జలాలలో
నిండు చంద్రుడి బింబం అందంగా ప్రతిఫలిస్తున్నది. ఉన్నట్టుండి ఒక స్ర్తీ
కంఠస్వరం వినిపించింది. మొదట నీమా తన భ్రమ అనుకున్నాడు గాని, కంఠస్వరం
వినిపించిన దిశ కేసి చూస్తే తెల్లటి దుస్తులతో ఒక అందమైన యువతి తటాకం
ఒడ్డుకు దగ్గరగా నిలబడి ఉంది.
ఆమె నీమా కేసి మెల్లగా నడిచి వచ్చి, ‘‘నేను చంద్రతల్ జలదేవతను.
నిన్ను చాలా రోజు లుగా చూస్తున్నాను. నీతో స్నేహం చేయూలను కుంటున్నాను.
నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పేరేమిటి?'' అని అడిగింది మృదువైన కంఠ
స్వరంతో. ‘‘నా పేరు నీమా. హాన్సే గ్రామం మాది. వేసవిలో పచ్చిక లభిస్తుంది
గనక, గొర్రెలు తోలుకుని వస్తాను. ఎవరూ చూడనప్పటికీ, చంద్రతల్ జలదేవత
గురించి పలువురు చెప్పు కోవడం చాలా విన్నాను,'' అన్నాడు నీమా సంతో షంగా
నవ్వుతూ.
‘‘నీమా, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు వసంత కాలం.
వెళ్ళినప్పుడు శీతాకాలం. నువ్వు నిద్ర పోతూండడం చూస్తే నా కెంతో ఆనందం
కలుగుతుంది. నేను రాత్రి సమయంలో మాత్రమే తటాకం నుంచి వెలు పలికి రాగలను. ఈ
రాత్రే నువ్వు మేలుకుని ఉండడం చూడడం తటస్థించింది. అందువల్లే తెగువతో నీ
దగ్గరికి వచ్చాను.
నువ్వు నాతో రాగలవా?'' అని అడిగింది జలదేవత ఎంతో ఆప్యాయంగా. నీమా
ఒక్కక్షణం అవాక్కయి పోయూడు. ఆ తరవాత తేరుకుని, జలదేవత చేయిపట్టు కుని తటాకం
కేసి అడుగులు వేశాడు. ఇద్దరూ తటాకంలో అడుగు పెట్టారు. దేవత చేయి
పట్టుకోవడం వల్ల నీమా కూడా దేవతలాగే నీళ్ళ మీద నడవసాగాడు!
తటాక మధ్యానికి చేరు కోగానే, దేవత ఒక మంత్రదండాన్ని తీసి పైకీ,
కిందికీ ఊపింది. అంతే! అక్కడ నీళ్ళు రెండుగా విడిపోవడంతో, మెట్లు
కనిపించాయి. ఇద్దరూ మెట్లగుండా కిందికి దిగివెళ్ళి ఒక అందమైన భవనాన్ని
చేరుకున్నారు. భవనం గోడకు పొదగబడిన మణులు, మాణిక్యాలు, రత్నాలు, రాత్రుల్లో
నక్షత్రాలు మెరిసినట్టు మెరుస్తున్నాయి. భవనం నేల బంగారంతో తాపడం
చేసినట్టు నిగనిగలాడు తున్నది. భవనంలో తిరుగుతూన్న వందలాది దేవతారూపాలు
వారిని గౌరవ మర్యాదలతో భవనంలోపలికి తీసుకువెళ్ళాయి.
తనను అక్కడికి తీసుకు వెళ్ళిన దేవత, వారికి రాణి అయివుంటుందని నీమా
గ్రహిం చాడు. మిగిలిన దేవతలు తెచ్చి ఇచ్చిన పట్టు వస్త్రాలను నీమా
ధరించాడు. వాళ్ళు అతని దుస్తుల మీద సుగంధ పరిమళా లను చిలకరించారు. ఆ తరవాత
వాళ్ళు, సుమధుర ఫలాలనూ, బంగారు పాత్ర లలో పానీయూన్నీ తెచ్చి నీమా ముందుం
చారు. సీతాకోకచిలుక రెక్కలతో తయూరు చేసిన విసనకరన్రు అందించారు.
దేవత దాంతో మెల్లగా విసురుతూండగా నీమా నిద్రపోయూడు. తెల్లవారుతూండగా
అతనికి మెల కువ వచ్చింది. దేవత నీమాను తీసుకు వచ్చి చంద్రతల్ కొలను గట్టున
వదిలి, రాత్రికి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. తడికలదడి నుంచి
గొర్రెలను వదల డానికి నీమా హడావుడిగా వెళ్ళాడు. ఆ రోజంతా నీమా చంద్రతల్
దేవతను తలుచుకుంటూ సంతోషంగా గడిపాడు. చెప్పిన ప్రకారం ఆ రాత్రి దేవత మళ్ళీ
వచ్చింది.
నీమాను తన భవనానికి తీసుకు వెళ్ళి, మరునాడు తెల్లవారే సరికి పైకి
తెచ్చి వదిలింది. ఇలాగే కొన్నాళ్ళు గడిచాయి. అంతలో వేసవి ముగిసి, శీతాకాలం
ఆరంభ మయింది. చలిగాలులు వీచసాగాయి. నేలపై మంచు కనిపించింది. సాయంకాలానికి
తటాకం పైభాగం గడ్డకట్టడం ఆరంభమయింది. ఆనాటి సాయంకాలం దేవత రాగానే, నీమా -
ముల్కీలా కొండచరియలో పచ్చగడ్డి అయి పోవడంతో, తాను గొర్రెలను లోయకు తోలుకు
పోవాలని చెప్పాడు. అవి ఉంటే తప్ప తాము బతకలేమని తెలియజేశాడు. ఆమాట వినగానే
దేవత విచారపడింది.
ఆ తరవాత, ‘‘నీమా, వసంత రుతువులో పువ్వులు పూయడం ఆరంభించి, కొండ
చరియలలో గడ్డి పచ్చగా మారడం ప్రారంభం కాగానే తప్ప కుండా వస్తానని నువ్వు
మాట ఇవ్వాలి. ఈ శీతాకాలం ముగిసేంత వరకు నేను నీ కోసం కాచుకుని ఉంటాను.
అయితే, ఒక్క విషయం గుర్తుంచుకో. మనం కలుసుకున్న సంగతి వేరె వ్వరికీ
చెప్పకూడదు సుమా. చెప్పనని మాట ఇవ్వు,'' అన్నద్ది. నీమా అలాగే అనిమాట
ఇచ్చాడు.
జలదేవత తటాకం మధ్యకు వెళ్ళి, మంత్రదండాన్ని ఊపి, కిందికి
వెళ్ళేంతవరకు, ఆమెనే కళ్ళార్పకుండా చూశాడు. ఆ తరవాత పెద్దగా నిట్టూర్చి,
గొర్రె లను విడిపించడానికి బయలుదేరాడు. గొర్రెలు దడి నుంచి
వెలుపలికిరాగానే, మంచు గాలుల నుంచి తప్పించుకోవడానికి వేగంగా గ్రామం కేసి
ఉరుకులతో పరుగులతో నడవ సాగాయి. ఇంటికి తిరిగివచ్చిన మరిది ప్రవర్తనలో
ప్రస్ఫుటమైన మార్పు రావడం చూసి వదినె డోల్నా ఆశ్చర్యపోయింది.
ఒకటికి రెండుసార్లు పిలిస్తే తప్ప పలికేవాడు కాదు. ఎప్పుడూ పరధ్యా
నంగా ఉండేవాడు. చెప్పిన పనిని నెమ్మదిగా చేసేవాడు. అందువల్ల ఎక్కువ పనులు
చెప్పడం తగ్గించుకున్నది డోల్నా. శీతాకాలం ఇంకా ఉన్నప్పుడే నీమా రోజూ
తెల్లవారక ముందే వెళ్ళి తూర్పు దిక్కు కేసి తదేకంగా చూస్తూ నిలబడే వాడు.
కొండ శిఖరాలపై సూర్యుడు ఆల స్యంగా ఉదయించేవాడు; చెట్లు ఆకులు రాలిపోయి
మోడువారి ఉండేవి.
పువ్వులు పూయలేదు. గడ్డికి ఇంకా పచ్చదనం తిరగలేదు. ఒకనాడు నీమా
కొండలకేసి బయలు దేరడానికిసిద్ధమై, ఆహార పదార్థాల కోసం వదినె వద్దకు
వచ్చాడు. ‘‘నీమా, ఇంకా వేసవి రాలేదు. మంచు కురుస్తోంది. గొర్రెలు చని
పోతాయి. ఎంత కాదన్నా, మంచు కరగడానికి ఇంకా రెండు వారాలు పడుతుంది,'' అన్నది
వదినె ఆశ్చర్యంగా. నీమా బదులేమీ పలక్కుండా మౌనంగా ఊరుకున్నాడు.
‘‘నీమా,
వచ్చి ఆ కట్టెలు చీల్చి ఇవ్వు,'' అన్నది డోల్నా. అయితే, నీమా అక్కణ్ణించి
కదలలేదు. ఇంకా ఏదో తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. వదినెకు కోపం వచ్చింది.
‘‘నీమా, నువ్వేమను కుంటున్నావు? చెబుతున్నా అలా నిలబడ్డావే మిటి?
నువ్వేమయినా స్పితీ దేవుడివా? నేను నీకు బంగారు పాత్రలో వేడి వేడి పానీయం
అందివ్వాలనుకుంటున్నావా ఏం?'' అన్నది. నీమా అంతవరకు వదినె మాటకు ఎదురు
పలికిందిలేదు. అయితే, ఆరోజు కోపం వచ్చింది.
‘‘అవును, నువ్వు ఇచ్చేదీ ఒక పానీయమేనా? కుడితి నీళ్ళులా ఉంటుంది.
గొడ్డు కూడా ముట్టు కోదు!'' అన్నాడు ఆగ్రహంతో. ‘‘అంటే, నా చేతి తిండి నీకు
నచ్చడం లేదన్న మాట! నువ్వేదో చంద్రతల్ జలదేవత బంగారు పాత్రలో అందించే
పానీయూలు తాగిన వాడిలా మాట్లాడుతున్నావు,'' అన్నది వదినె హేళనగా. ‘‘అవును,
పోయిన వేసవి కాలమంతా అదే జరిగింది!
ప్రతి రాత్రి ఆమె వచ్చి నన్ను వెంట బెట్టుకుని వెళ్ళి, రుచికరమైన
పానీయూలం దించి, తెల్లవారేప్పుడు పైకి తెచ్చి వది లేది తెలుసా?'' అంటూ, ఆ
సంగతి ఎవరికీ చెప్ప వద్దని జలదేవత చేసిన హెచ్చరిక గుర్తు రావడంతో నీమా
నాలుక్కరుచుకున్నాడు. ‘‘అదన్న మాట సంగతి! మరి, ఇప్పుడు కూడా ఆ దేవత వెంటే
హాయిగా తిరిగి వెళ్ళలేక పోయూవా?'' అన్నది డోల్నా.
ఆ తరవాత ఎందు కలా దురు సుగా అన్నానా అని ఆమె అనుకు న్నది. అయినా,
అదంతా పట్టించు కోకుండా నీమా ఇంటి నుంచి బయ లుదేరాడు. దాపులనున్న ఒక ఆశ్రమా
నికి వెళ్ళి, వేసవి త్వరగా రావాలని కళ్ళు మూసుకుని భక్తితో ప్రార్థన
చేశాడు. ఆ తరవాత ఇంటికి తిరిగివచ్చి కట్టెలు చీల్చడం మొదలు పెట్టాడు. ఆ
శబ్దం విని ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన డోల్నా అతన్ని చూసి నవ్వుకున్నది.
రోజూ
తెల్లవారక ముందే నీమా నిద్రలేచి, ఇంటి నుంచి వెలుపలికి వచ్చేవాడు. కొండ
చరియల్లో పచ్చగడ్డి కోసం చూసేవాడు. వదినె చెప్పిన పనులు వెంటనే పూర్తిచేసి
ఆశ్రమానికి వెళ్ళి, ‘‘వేసవి ఎప్పుడు వస్తుందో చెప్పు దేవా?'' అంటూ గట్టిగా
గొంతెత్తి ప్రార్థించేవాడు. ఆఖరికి వేసవి రానే వచ్చింది. నీమా గొర్రె లను
తోలుకుని ముల్కీలా కొండ కేసి బయలు దేరాడు. గుహను శుభ్రపరిచాడు. గొర్రెల
కోసం తడికెలదడి నిర్మించాడు.
రాత్రంతా తటాకం గట్టున దేవత కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అయినా ఆమె
రాలేదు. ఒక వారం అలాగే గడిచి పోయింది. తనపై దేవతకు కోపం వచ్చిందా? అని
తీవ్రంగా ఆలో చించసాగాడు. మరికొన్ని రోజులు గడిచాయి. అతనిలో ఓర్పు
నశించింది. నిలకడను కోల్పోయూడు. ‘‘సరే, ఆమె రాలేదు. నేనే ఎందుకు అక్కడికి
వెళ్ళకూడదు?'' అనుకుంటూ తటాకంలోకి దిగి నడవసాగాడు. అతడు తటాకమధ్యం
చేరుకోలేదు. ఆ తరవాత మరెక్కడా కనిపించ కుండా పోయూడు.
No comments:
Post a Comment