ఒక గ్రామంలో శివరామయ్య అనే కరుడుగట్టిన నాస్తికుడుండేవాడు. ఆయన ధాన్య
వ్యాపారం, వడ్డీ వ్యాపారాల్లాంటివి చేసి లక్షలార్జించాడు. క్రమంగా వార్థక్య
దశ వచ్చింది. ఆరోగ్యం క్షీణించ సాగింది. ఆ దశలో ఆయన పరిచయస్థులు కొందరు,
‘‘ఇకనైనా నీ నాస్తికత్వాన్ని పక్కన పెట్టి, దైవభక్తి అలవరుచుకుని, పరలోకంలో
సుఖపడేందుకు ప్రయత్నించు!'' అని సలహాలివ్వ సాగారు.
బాగా ఆలోచించి చూడగా శివరామయ్యకు, వాళ్ళ సలహాల్లో ఏదో సత్యం
దాగివున్నదని పించింది. ‘‘ఇహంలో సుఖపడ్డాను, ఇక పరం అనేది వుంటే ఏ బాదర
బందీ లేకుండా అక్కడా సుఖపడవచ్చు!'' అనుకుంటూ దేవాలయ పూజారి కేశవయ్య కోసం
బయల్దేరాడు.
కేశవయ్య మామూలు ఆలయ పూజారేకాక, ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక
విషయాలెరిగిన పండితుడు. శివరామయ్య ఆలయానికి వచ్చిన సమయంలో ఆయన, ఆలయం
ముందున్న అరుగు మీద కూర్చుని ఏదో గ్రంథం చదువుకుంటున్నాడు.
శివరామయ్య, ఆయన్ని సమీపించి నమస్కరించగానే ఆశ్చర్యపోతూ, ‘‘ఏం, దారి తప్పి ఇటురాలేదుకదా?'' అంటూ కేశవయ్య నవ్వాడు.
శివరామయ్య తను వచ్చిన పని గురించి చెప్పాడు. అది విని కేశవయ్య
ఆశ్చర్యపోతూ, ‘‘అలాగా! మరి, వ్యాపారంలో రావలసిన బాకీలూ, తీర్చవలసిన
అప్పులూ-అన్నీ సరిదిద్దుకున్నావా?'' అని అడిగాడు.
అందుకు శివరామయ్య కోపంగా, ‘‘తీరిక లేకున్నా నేను మీ నుంచి భక్తీ,
ఆధ్యాత్మిక విషయాలూ తెలుసుకుందామని వచ్చాను. మీరేమో వ్యాపార విషయాలు
మాట్లాడుతూ నా విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు?!'' అంటూ గిర్రున
వెనుదిరిగాడు.
No comments:
Post a Comment