Pages

Saturday, September 8, 2012

అసలు రహస్యం


భూమయ్య అనే ఒక యూభై ఏళ్ళ వ్యవసాయదారుడికి, ఒక్క సింగుపాలెం గ్రామంలోనే కాక, ఆ చుట్టు పక్కల వున్న గ్రామాల్లో కూడా చాలా తెలివైనవాడనీ, వివేకి అనీ మంచి పేరున్నది. ఆయన ఇరవై ఏళ్ళ యువకుడిగా, కేవలం కట్టుబట్టలతో ఎక్కడి నుంచో, ఆ గ్రామం వచ్చి పదెకరాల పొలం, ఇతరత్రా కొన్ని ఆస్తిపాస్తులు సంపాయించాడు.
 
ఒకనాటి సాయంవేళ భూమయ్య గ్రామ చెరువు గట్టునవున్న మర్రిచెట్టు కింద కూర్చుని, చెరువులో ఈదుతున్న బాతుల్నీ, చెరువు నీళ్ళ పైన ఎగురుతున్న కొంగల్నీ చూస్తూ ఆనంది స్తూండగా, ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి, ఆయన పక్కనే కూర్చున్నారు. కొంతసేపు ఏదో పిచ్చాపాటీ మాట్లాడాక యువకుల్లో ఒకడు, ‘‘మావయ్యూ, నిన్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను,'' అన్నాడు. భూమయ్య చిరునవ్వు నవ్వి, ‘‘అలాగే అడుగు.
 
నువ్వు పెద్దవాళ్ళను ప్రశ్నలడిగి మంచీ, చెడూ తెలుసుకోవలసిన వయసు వాడివిగదా!'' అన్నాడు. ‘‘మావయ్యూ, ఎప్పుడో నువ్వీ గ్రామం వచ్చినప్పుడు, డబ్బున్న వాడివేం కాదని గ్రామంలో చెప్పుకుంటారు. మరిప్పుడేమో గ్రామంలో వున్న కొద్ది మంది ఆస్తిపరుల్లో నువ్వొకడివి. ఇంత ఆస్తి ఎలా సంపాదించావు? దాని వెనకవున్న రహస్యమేమిటి?'' అని అడిగాడు యువకుడు. ఆ ప్రశ్నకు భూమయ్య ఆప్యాయంగా యువకుడి భుజం తట్టి, ‘‘మాది సత్య కాలం నాయనా. ఓర్పూ, కృషీ, పట్టుదలా, నిజాయితీ, నేర్పూ-ఇదీ అసలు రహస్యం! ఆస్తి సంపాద నకు అడ్డుదారులు లేవు!'' అంటూ పెద్దగా నవ్వాడు.

No comments:

Post a Comment