Pages

Saturday, September 8, 2012

అడ్డగాడిద


లోకయ్య ముపై్ఫ ఏళ్ళ వయసువాడు. వాడికి నా అన్నవాళ్ళెవరూ లేరు. ఊళ్ళో వాళ్ళు ఎవరేపనిచెప్పినా, ఏమాత్రం విసుక్కోకుండా, వాళ్ళవాళ్ళ పనులు సక్రమంగా చేస్తూండే వాడు. వాడికి ఆకలి బాధా, రాత్రికి ఎక్కడ నిద్రించడమా అన్న సమస్య లేదు. ఆకలిగా వున్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా ఇంత అన్నం పెట్టే వాళ్ళు. రాత్రి వేళ ఏ గృహస్థు ఇంటి పంచనో నిద్రపోయేవాడు.
 
ఒకసారి వాడు, గుడిపూజారి చెప్పిన పని మీద పొరుగు గ్రామంలో ప్రతి శనివారం జరిగే సంతకు వెళ్ళి, కావలసిన వస్తువులు కొని, అక్కడ ఆటగాళ్ళూ పాటగాళ్ళూ ప్రదర్శించే వింతలు చూసి, తిరిగి ఊరుకు బయలుదేరాడు. ఆ సరికి సూర్యుడస్తమించి కనుచీకటిగా వున్నది. లోకయ్య ఏవో కూనిరాగాలు తీస్తూ, ఊరి చెరువుకట్ట దిగుతూండగా, హఠాత్తుగా ఒకడు ఎదురై, ‘‘ ఒరే, ఆరోజు నన్ను చాటు మాటుగా వుండి కొట్టి పారిపోతావా? ఇదుగో, రత్తిగా కాచుకో!'' అంటూ, వాడి మెడ మీద బలంగా కొట్టాడు.
 
ఆ దెబ్బకు లోకయ్య వెల్లకిలాపడి లేస్తూ, ‘‘ఆహా, ఆహా,'' అంటూ పెద్దగా నవ్వసాగాడు. అది చూసి వాణ్ణి కొట్టినవాడు, ‘‘అలా అడ్డగాడిదలా ఓండ్ర పెడతావెందుకురా, రత్తిగా?'' అంటూ చెయ్యెత్తాడు. లోకయ్య ఇంకా నవ్వుతూనే, ‘‘ఆ అడ్డగాడిదను నేను కాదు; నా పేరు లోకయ్య!'' అంటూ మరింతగా నవ్వసాగాడు.

No comments:

Post a Comment