Pages

Saturday, September 8, 2012

సఫల యాత్ర


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించేటప్పుడు బోధిసత్వుడు ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ వర్తకంలోని మెళకువలను పెద్దలనుంచి నేర్చుకున్నాడు. ప్రతి విష…ూన్నీ అన్ని కోణాలనుంచీ పరిశీలించి నెమ్మదిగా ఆలోచించి తగిన నిర్ణ…ూలు తీసుకునే వివేకం పెంపొందించుకున్నాడు. పెద్దవాడై అతను అయిదువందల బండ్ల మీద సరకు వేసుకుని తూర్పునుంచి పడమరకూ, పడమర నుంచి తూర్పుకూ తరచూ వెళ్ళి వర్తకం చేసేవాడు. అలా వెళ్ళిన ప్రతిసారీ మంచి లాభాలు గడించేవాడు.
 
కాశీనగరంలోనే మందమతి అయిన మరొక వర్తకుడు ఉన్నాడు. అతను ఉపా…ుహీనుడు కూడానూ.
 
ఒకసారి బోధిసత్వుడు తన బండ్ల మీద సరకు వేసుకుని, ప్ర…ూణానికి సిద్ధంగా ఉండగా, మందమతి ఆ…ున దగ్గరికి వచ్చి తాను కూడా అదే సమ…ుంలో బ…ులుదేరుతానన్నాడు.
 
బోధిసత్వుడు మందమతితో, ‘‘నీ బళ్ళూ, నా బళ్ళూ ఒక్కసారిగా బ…ులుదేరితే, దారి ఇరుకై, ప్ర…ూణానికి ఇబ్బంది కలగవచ్చు. అందుచేత ఒకరి వెనుక ఒకరు బ…ులు దేరటమే అన్నివిధాలా మంచిది.
 
ముందు నువ్వు బ…ులుదేరుతావా, లేక నన్ను బ…ు లుదేరమన్నావా? నీ ఇష్టప్రకారమే చేద్దాం,'' అన్నాడు. మందమతి తనలో ఇలా అనుకున్నాడు: ‘‘ముందు నేను పోయినట్టయితే చాలా లాభాలుంటాయి. దారి నలగదు. ప్ర…ూణం హాయిగాసాగుతుంది. దారి పొడవునా పశువులకు మంచి పచ్చికా, మనుషులకు మంచి కా…ులూ, ఫలాలూ, కూరలూ లభించవచ్చు. నిర్మలమైన నీరు లభ్యమవుతుంది. వెళ్ళిన చోట సరకుల ధరలు నా ఇష్టప్రకారం నిర్ణయించవచ్చు.''
 
బోధిసత్వుడు కూడా తనలో ఇలా అనుకున్నాడు: ‘‘అందరికన్నా ముందు వెళ్ళడంకన్నా, ఒకరు తొక్కిన దారిన ప్ర…ూణించటం తేలిక.

ఒకసారి పశువులు మేసిన చోట గడ్డి మళ్ళీ చిగురు పట్టినప్పుడు రెండింతలు అవుతుంది. కూరగా…ులు కూడా అంతే. ముందు వెళ్ళిన వారు నీటి వనరులు ఎక్కడ ఉన్నవో కష్టపడి కనిపెడతారు. లేదా నీటికోసం బావులు తవ్వుతారు. అవి తరవాత వెళ్ళేవారికి ఎంతగానో ఉపెూగపడతాయి. కొత్త చోటికి మొదటిసారిగా వెళ్ళి అక్కడివారితో ధరలను గురించి బేరాలాడటం అంత మంచిది కాదు. ముందు వెళ్ళిన వాళ్ళు నిర్ణయించిన ధరలకు వెనక వెళ్ళేవాళ్ళు ఎలాంటి సమస్యా లేకుండా అక్కడి వారితో చాలా మంచిగా వర్తకం చేసుకోవచ్చు.''
 
ఇలా అనుకుని మందమతి ముందు తాను పోతాననేసరికి బోధిసత్వుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. మందమతి మనసులో ఎంతగానో సంతోషించాడు. మందమతి వెళ్ళవలసిన చోటు అరవైెూజనాల దూరాన ఉన్నది. మధ్యలో పెద్ద ఎడారి ఉన్నది. దానిని దాటి గమ్యం చేరుకోవాలి. అందుచేత ప్ర…ూణానికి అవసరమైన తినుబండారాలూ, పీపాలతో తాగటానికి నీరూ సిద్ధం చేసుకుని మందమతి బోధిసత్వుడికి మంచిటోపీ వేశాననుకుని సంతోషంగా బ…ులుదేరాడు.
 
మందమతి బిడారు చాలా దూరం ప్ర…ూణంచేసి, కొన్నిరోజులకు ఎడారి ప్రాంతం చేరుకున్నది. అందులో కొంత దూరం వెళ్ళేసరికి మందమతికి అపూర్వమైన వాహనం ఒకటి ఎదురయింది. దానికి ఉత్తమజాతి ఎద్దులు, తెల్లనివి, పూన్చి ఉన్నాయి. అందులో ఒక రాజపురుషుడు చాలా ఠీవిగా కూర్చుని ఉన్నాడు. ఆ బండి ముందు సేవకులు కత్తులూ, కటార్లూ, విల్లమ్ములూ ధరించి నడుస్తున్నారు. వెనక మరికొందరు నడుస్తున్నారు. బండి చక్రాలకు బురద అంటి ఉన్నది. అందరి తలలకూ తామర తూండ్లు చుట్టి ఉన్నాయి. వారి చేతుల్లో తామరపూలు ఉన్నాయి.
 
రాజపురుషుడు మందమతితో, ‘‘ఏం వర్షం! కుంభపోతగా ఒకటే వాన! అదుగో, కనిపిస్తూన్న ఆ అడవి ఆ ప్రాంతమంతా జలమ…ుమే. ఏళ్ళూ, ఊళ్ళూ ఏకమైపో…ూయి! అలాంటి వర్షం నా జీవితంలో చూడలేదు.మీరు అటే పోతున్నారుగదా, ఈ పీపాలతో నీరేమిటి? ఎందుకొచ్చిన బరువు? నీరు పారబోసి తేలికగా వెళ్ళండి,'' అని సలహా ఇచ్చాడు మందహాసం చేస్తూ.

ఆ రథంలో ఉన్నవాడూ, వాడి వెంటవున్న పరివారమూ నరభక్షకులైన …ుక్షులు. వాళ్ళు ఇటువైపు వచ్చే ఎడారి ప్ర…ూణీకులను ఇలాగే మంచి మాటలతో వంచించి, వారు తిండికి మాడి, దాహంతో చచ్చినాక వాళ్ళను హాయిగా పీక్కుతింటారు.
 
ఈ సంగతిగ్రహించక మందమతి బండ్లలోని పీపాలన్నీ ఖాళీ చేయించి, ముందుకు కదిలాడు.
 
దూరాన రాజపురుషుడు చూపిన అడవి కనబడుతున్నదేగాని, ఎంత దూరం వెళ్ళినా అది చేరువకాలేదు. వర్షం కురిసిన ఆనవాలు ఏ మాత్రం కనిపించలేదు.
 
అందరూ దాహంతో బాధపడుతున్నారు. తాగటానికి నీటిచుక్క కూడా లేదు. గొంతులు ఎండిపోయి సొమ్మసిల్లి ఒక్కొక్కరే మరణించసాగారు.
 
క్రమంగా ఎడ్లు కూడా సోలిపో…ూయి, చచ్చిన మనుషులనూ, పశువులనూ …ుక్షులు వచ్చి తినేసి, అస్థిపంజరాలను ఎడారి ఇసుకలో వదిలేశారు.
 
నలభై అయిదు రోజులు గడవనిచ్చి, బోధిసత్వుడు కూడా తన బిడారుతో అదే తోవన బ…ులుదేరాడు. అతను కూడా సుదీర్ఘ ప్ర…ూణానికి అవసరమైన తినుబండారాలూ, పీపాలతో నీరూ బళ్ళల్లో సమకూర్చుకున్నాడు.
 
వాళ్ళు ఎడారి ప్రాంతం చేరగానే బోధిసత్వుడు తన మనుషులతో, ‘‘నాతో చెప్పకుండా ఎవరూ ఒక్కచుక్క నీరు పారబో…ువద్దు. ఇలాటి ఎడారిలో రకరకాల విషవృక్షాలుంటాయి. కొత్తరకం కా…ుగాని, ఆకుగాని ఎవరూ తినవద్దు,'' అన్నాడు.
 
బిడారు కొంత దూరం వెళ్ళేసరికి రాజ పురుషుడు రథం లాంటి తన వాహనంలో అంతకు ముందు ఎదురుపడి, మందమతితో చెప్పినటే్ట చెప్పాడు.

అతనితో బోధిసత్వుడు, ‘‘మీ దారిన మీరు వెళ్ళండి. చాలా దూరం ప్ర…ూణం చే…ువలసి ఉంది. మేం వర్తకులం. ఇంకో చోట నీరు కనబడితేగాని ఉన్న నీరు పారబో…ుం. మొదట నీరు కనిపించనీ. కావాలంటే అప్పుడు బరువు తగ్గించుకుంటాం,'' అన్నాడు. …ుక్షుడు ఆ తరవాత ఏమీ చెప్పకుండా మౌనంగా తనదారిన వెళ్ళిపో…ూడు.
 
అతని మాటలు నమ్మి సేవకులు కొందరు నీరు పారబోద్దామన్నారు. బోధిసత్వుడు వారితో ఇలా అన్నాడు: ‘‘ఈ ప్రాంతంలో జలాశ…ుం ఏదన్నా ఉన్నట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ మనిషి కుంభపోతగా వర్షం కురిసిందన్నాడు.
 
మనకేసి తడిగాలి ఏమైనా వీచిందా? ఆకాశంలో ఎక్కడైనా మబ్బుతునకలాటిది కనబడుతున్నదేమో చూడండి? మెరుపులు కనబడ్డా…ూ? ఉరుములు వినబడ్డా…ూ? మనం చూసినవాళ్ళు …ుక్షులు. మనం శోషపడిపోతే తినటానికి ఎత్తు వేశారు. మన ముందు పోయిన వర్తకుణ్ణీ, అతని మనుషులనూ తినేసే ఉంటారు. వాళ్ళ అస్థిపంజరాలు దారిలో మనకు కనబడవచ్చు కూడా!''
 
అతను చెప్పినటే్ట, బిడారు కొంత దూరం వెళ్ళేసరికి, మందమతి తాలూకు అయిదువందల బళ్ళూ, వాటిలోని వర్తక సరుకులూకనిపించాయి. వాటి చుట్టూ మనుషులవీ, పశువులవీ అస్థిపంజరాలు చెదురు మదురుగా పడి ఉన్నాయి. ఆ దృశ్యం చూడడానికి చాలా బీభత్సంగా ఉంది.
 
‘‘చూశారా? మందమతి దూరాలోచన చె…్యుక, ఎవరో చెప్పిన మాటలు నమ్మి నీరు పారబోసుకోవటం వల్ల ఏం జరిగిందో?'' అన్నాడు బోధిసత్వుడు. ఆ ప్రాంతంలోనే ఆ రాత్రి మజిలీ చేసి, బోధిసుత్వుడు, మర్నాడు ఉద…ుం, చచ్చిపోయిన వర్తకుడి బళ్ళలో చెడిపోనివీ, సరుకులలో బాగా ఉన్నవీ తన వెంట తీసుకుని గమ్యస్థానానికి వెళ్ళి, లాభసాటిగా తన దేశానికి తిరిగి వచ్చాడు.
 
ఈ ప్ర…ూణంలో అతనికి ఒక్క ప్రాణికూడా నష్టం కాలేదు. 

No comments:

Post a Comment