సుబ్బరామ
య్య, తుమ్మలచెరువు గ్రామంలోని ఆస్తిపరుల్లో ఒకడు. అంత
ఆస్తివున్నా ఆయనకు కొడుకులు సూరి, చంద్రం కారణంగా ఎప్పుడూ దిగులుగా
వుండేది. వాళ్ళిద్దరూ పదీ, పన్నెండేళ్ళ వయసువాళ్ళయినా, ఏమాత్రం లోకజ్ఞానం
లేని అమాయకులుగా ప్రవర్తించేవారు.
ఒకసారి సుబ్బరామ
య్య ఇంటికొచ్చిన పొరుగూరి బంధువొకా
యన, ‘‘కొడుకుల
గురించి ఆట్లే దిగులుపడకు. మా ఊరుకు కొత్తగా ఒక పండితుడు వచ్చాడు. ఆయన
మనుషుల మనస్తత్వంలో వున్న లోపాలను, సూక్ష్మంగా అంచనా కట్టి
సరిదిద్దగలడు,'' అని చెప్పాడు.
సుబ్బరామయ్య, పండితుణ్ణి చూడబోయాడు. ఆయన సుబ్బరామయ్య చెప్పినదంతా
విని, ‘‘మనుషుల్లో కొందరు మరీ తెలివిగలవాళ్ళున్నట్లే, మరీ అమాయకులుండడం
సహజం. నేనే ఏదో ఒకరోజు, మీ ఇంటికొచ్చి నీ కొడుకుల్ని పరీక్షంచి చూస్తాను,''
అన్నాడు.
వారం తర్వాత పండితుడు, సుబ్బరామయ్య ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సుబ్బ
రామయ్య కొడుకులిద్దరికీ పళ్ళెంలో అన్నం వడ్డిస్తున్నాడు. పొయ్యిమీద ఉప్పు
గోంగూర ఒక పాత్రలో ఉడుకుతున్నది.
సూరి, చంద్రం ఆ గోంగూర కావాలన్నారు. పండితుడు వాళ్ళతో, ‘‘అది ఉప్పు
చాలా ఎక్కువగా వుండే ఉప్పుగోంగూర. అన్నం ఒక ముద్ద తిని దానికేసి ఒకసారి
చూడండి సరిపోతుంది!'' అన్నాడు.
అన్నదమ్ములు తినడం ప్రారంభించారు. అంతలో చిన్నవాడు, ‘‘అన్న
య్య ఉప్పు
గోంగూరకేసి రెండుసార్లు చూశాడు. వాడికి తప్పక జబ్బు చేస్తుంది,'' అన్నాడు.
అప్పుడు పండితుడు, సుబ్బరామయ్యతో, ‘‘నీ కొడుకులిద్దరిలో చిన్నవాడు
కాస్త తెలివైనవాడు! ముందుగా వాడితోనే విద్యాబోధ ప్రారంభిస్తాను" అన్నాడు.
No comments:
Post a Comment