విశాలపురాన్నేలే రామభద్రమహారాజు వృద్ధుడయ్యాడు. ఆయన రాజ్యభారాన్ని తన
కుమారుడైన వీరభద్రుడికి అప్పగిస్తూ, ‘‘నాయనా! నేను రాజునయ్యేనాటికి, మన
పౌరుల్లో అధిక శాతం విద్యావిహీనులు కావడంవల్ల మూఢ నమ్మకాలతో, మూఢాచారాలతో
తాము ఇబ్బంది పడుతూ, సమాజానికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకని నేను
రాజధానిలో ఒక విద్యాలయాన్ని నెలకొల్పాను. కానీ సరైన గురువు లేక ఆ
విద్యాలయం, నేనాశించిన ప్రయోజనాన్ని నెరవేర్చలేక పోయింది. ముందుగా నీవు, ఆ
విద్యాల
యానికి సరైన గురువును ని
యమించు,'' అని చెప్పాడు.
తండ్రి మాటలను శ్రద్ధగా విన్న వీరభద్రుడు వెంటనే మంత్రులతో ఆ విష
యం గురించి సమాలోచన జరిపాడు.
మంత్రులందరూ ముఖముఖాలు చూసుకుంటూంటే, వారిలో వృద్ధుడూ, వివేకవంతుడూ
అయిన వాచస్పతి విన
యంగా, ‘‘రాజా! విద్యపట్ల ఆసక్తివున్నవారికి
తల్లిదండ్రులు, చుట్టూవున్న ప్రకృతి అంతా గురువులే. అలాంటి వారిని ఒక సక్రమ
పద్ధతిలో మరింత ప్రభావితం చేసేందుకు, మీ తండ్రిగారు రాజధానిలో
విద్యాల
యాన్ని స్థాపించారు. అక్కడ శిక్షణ పొందినవారు దేశమంతటా వ్యాపించి,
మన పౌరులందరిలోనూ విద్యపట్ల ఆసక్తిని పెంచుతారని ఆయన ఆశించారు. కానీ, మనం
నియమించిన గురువులు అనుకున్నది సాధించలేకపోయారు,'' అంటూ పరిస్థితిని
వివరించాడు.
‘‘అందుకు కారణమేమిటి?'' అన్నాడు వీరభద్రుడు. ‘‘పాండిత్యమున్నవారు
గొప్ప పండితులుగా మాత్రమే చలామణీ కాగలరు. వారందరూ గొప్ప గురువులు కాలేరు.
మనం గొప్ప పండితులను విద్యాలయానికి గురువులుగా ని
యమించాం. వారు గొప్ప
గురువులు కాలేక పోయారు.
అయినా, గురువుల గొప్పతనాన్ని కూడా పరీక్షంచవలసివుంటుందని,
ఇప్పుడిప్పుడే నాకూ స్ఫురిస్తున్నది,'' అన్నాడు వాచస్పతి. ఈ మాటలు
వీరభద్రుడికి వాస్తవం అనిపించాయి. అతడు చారులను పంపి విచారించగా,
దండకారణ్యంలో ప్రశాంతుడు, ప్రసేనుడు అనే ఇద్దరు ఉద్దండ పండితులున్నారనీ,
వారి శిక్షణలో ఎందరో ఆరితేరిన విద్యావంతులు తయారయ్యారనీ తెలిసింది.
వీరభద్రుడు, వాచస్పతికి ఈ విషయం చెప్పి, వారిద్దరిలో ఒకరిని వెంటనే
రాజధానిలోని విద్యాలయానికి ఆహ్వానించవలసిందిగా కోరాడు. వాచస్పతి
కాసేపాలోచించి, ‘‘రాజా! మన విద్యాల
యంలో చేరి విద్యావంతులు కాలేకపోయిన
ఇరవైమంది
యువకులను ఎన్నుకుని, వారిలో పదిమందిని ప్రశాంతుడికీ, మరొక
పదిమందిని ప్రసేనుడికీ అప్పగిద్దాం.
ఆరుమాసాల గడువులో ఎవరు సత్ఫలితాలు సాధిస్తే, వారిని మన విద్యాల
యంలో
గురువుగా ని
యమిద్దాం!'' అని సూచించాడు. రాజు వీరభద్రుడు ఇందుకు సంతోషంగా
సరేనన్నాడు.
అనుకున్న ప్రకారం వాచస్పతి పదిమందిని ప్రశాంతుడి వద్దకూ, మరొక పదిమంది
విద్యార్థులను ప్రసేనుడి వద్దకూ పంపాడు. ఆరుమాసాలు గడిచే సరికి ప్రశాంతుడి
వద్ద చేరినవారిలో ముగ్గురు శాస్త్రాల్లో నైపుణ్యం సంపాదించితే, ప్రసేనుడి
వద్ద చేరినవారిలో ఏడుగురు నైపుణ్యం సంపాయించారు. అప్పుడు వాచస్పతి ముందుగా
ప్రసేనుణ్ణి, ‘‘మరి మిగతాముగ్గురి మాట ఏమిటి?'' అని అడిగాడు.
‘‘నాదగ్గర మిగిలిన ఆ ముగ్గురూ జడులు, జన్మతః మందమతులు! వాళ్ళను ఎవరూ విద్యావంతుల్ని చే
యలేరు,'' అన్నాడు ప్రసేనుడు.
ఆతర్వాత వాచస్పతి, ప్రశాంతుణ్ణి కలుసుకుని, ‘‘మీవద్ద మిగిలిన ఆ ఏడుగురు విద్యార్థుల మాటేమిటి?'' అని అడిగాడు.
దానికి ప్రశాంతుడు, ‘‘మంత్రివర్యా! నావద్ద చేరిన విద్యార్థుల్లో
ముగ్గురు చురుకైనవారు. అందువల్ల త్వరత్వరగా వారికి విద్యాగంధం సోకింది.
విగిలిన ఏడుగురూ అంత చురుకుకాదు. ఆరు మాసాల్లో వారిని విద్యావంతుల్ని చేయగల
సమర్థత నాకు లేదు. మరికొంత గడువిస్తే, వారినీ ఆ ముగ్గురు విద్యార్థుల
స్థాయికి తీసుకురాగలను,'' అన్నాడు.
వాచస్పతి, రాజుకు ఈ విష
యం చెప్పి, రాజధానిలోని విద్యాల
యానికి ప్రశాంతుణ్ణి గురువుగా ని
యమించమని సలహాయిచ్చాడు.
ఇందుకు రాజు ఆశ్చర్యపోయి, ‘‘గురువర్యా! ఆరు మాసాలలో ఏడుగురిని
విద్యావంతుల్ని చేసిన ప్రసేనుణ్ణి కాదని, ముగ్గుర్ని మాత్రమే
విద్యావంతుల్ని చే
యగలిగిన ప్రశాంతుడికి పదవి ఇవ్వడం విజ్ఞత అవుతుందా?''
అని అడిగాడు.
అందుకు వాచస్పతి చిరునవ్వు నవ్వి, ‘‘రాజా! మన విద్యాలయంలో ఎందుకూ
కొరగాని వారనుకున్నవారిని ప్రశాంతుడూ, ప్రసేనుడూ కూడా విద్యావంతుల్ని
చేయగలిగారు. అంటే, నిస్సందేహంగా ఇద్దరికిద్దరూ గొప్ప గురువులు. ప్రసేనుడు
ఏడుగురినీ, ప్రశాంతుడు ముగ్గుర్నీ విద్యావంతులుగా చేయగలిగారంటే - అది వారి
ప్రతిభకు కొలబద్దగా తీసుకోకూడదు! ప్రసేనుడి వద్ద చురుకైనవారు ఎక్కువమంది
చేరినట్లు భావించాలి. ఎందుకంటే, చురుకుతనం లేనివారి నా
యన, జడులు అంటూ
ఈసడించాడు. ఇకపోతే, ప్రశాంతుడు తన శిష్యులెవరినీ జడులు అనుకోలేదు. ఇక్కడ
మనం విష్ణుశర్మా, మూర్ఖులైన ముగ్గురు రాజకుమారుల కథా జ్ఞప్తికి
తెచ్చుకోవలసిన అవసరం వుంటుంది!'' అంటూ ఆగాడు.
రాజు, ‘‘అవునవును!'' అంటూ తల ఊపి, ‘‘చెప్పండి, గురువర్యా!'' అన్నాడు.
‘‘రాజా! మనం ఒకటి గమనించాలి. ప్రశాంతుడు మిగిలిన ఏడుగురు శిష్యులనూ
విద్యావంతులను చే
యడానికి మరికొంత వ్యవధి కావాలన్నాడే తప్ప శిష్యుల నా
యన
తప్పుపట్ట లేదు. శిష్యులను జడులనుకునే వాడు ఉత్తమ గురువు కానేరడు.
అందువల్ల, నేను ప్రశాంతుణ్ణి ఉత్తమ గురువుగా ఎన్నికచేశాను,'' అన్నాడు
వాచస్పతి.
రాజు వీరభద్రుడు, వాచస్పతిని మెచ్చుకుని, ప్రశాంతుణ్ణి
రాజధానివిద్యాల
యంలో గురువుగా ని
యమించాడు. అతడి శిక్షణలో ఎందరో
యువకులు
విద్యావంతులై విశాలపురంలో విద్యావ్యాప్తికి తోడ్పడి, దేశ పౌరుల మానసిక
వికాసానికి సా
యపడ్డారు.
No comments:
Post a Comment