Pages

Friday, September 7, 2012

వింత పరేంగిత జ్ఞాని!


అది 1928 జూలై 9వ తేదీ. కెనడాలో వేసవి రాత్రి. ఎడ్మంటన్‌ అల్బెర్టాలో ఉదయం నుంచి ఊపిరి సలపని పనులతో హడావుడిగా గడిపిన డా. హాస్లిప్‌ పడుకోవడానికి సిద్ధమయ్యాడు. హఠాత్తుగా ఫోన్‌ మోగింది. అందుకున్నాడు. ‘‘బూహెర్‌ ఫారమ్‌లో ఘోరవిషాదం జరిగిపోయింది. వెంటనే రండి,'' అని ఆవలి కంఠస్వరం ఆర్తనాదం చేసింది.
 
అమిత వేగంతో అక్కడికి చేరుకున్న డా. హాస్లిప్‌కు నమ్మశక్యంకాని భీకరదృశ్యం కంటబడింది. వెంటనే ఎనభై మైళ్ళకు ఆవలనున్న పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు సమాచారం అందజేశాడు. ఇన్‌స్పెక్టర్‌ లాంగేకర్‌, డిటెక్టివ్‌ లెస్లీ, కాన్‌స్టబుల్‌ ఆల్సన్‌ వచ్చారు. ఫార్‌‌మ యజమాని హెన్రీ బూహెర్‌, ఆయన చిన్న కొడుకు విరోన్‌ బూహెర్‌, పొరుగునవున్నచార్లెస్‌ స్టీవెన్సన్‌, డా. హాస్లిప్‌ అక్కడ ఉన్నారు.
 
ఇంకా షాక్‌ నుంచి తేరుకోని మధ్య వయస్కుడైన హెన్రీ బూహెర్‌ వాళ్ళను లోపలికి తీసుకువెళ్ళాడు. వంటగదిలో అతడి భార్య రోస్‌ బూహెర్‌ మృతదేహం కనిపించింది. మెడగుండా మూడు తూటాలు దూసుకుపోవడంతో ఆమె మరణించింది. పక్కగదిలో నేలమీద అతడి పెద్దకొడుకు ఫ్రెడ్‌ మృతదేహం నేలమీద పడివుంది. అతడూ తుపాకీగుళ్ళకే బలిఅయ్యాడు. మూడో హతుడు అక్కడ పనిచేస్తూన్న గేబ్రియల్‌ క్రాంబీ. తల మీద రెండు బుల్లెట్లూ, రొమ్ములో రెండు బుల్లెట్లూ అతడి ప్రాణాలు తీశాయి. ‘‘ఈ మృతదేహాలను నువ్వు మొదట ఎప్పుడు చూశావు?'' అని అడిగాడు ఒక అధికారి విరోన్‌ బూహెర్‌ను.
 
‘‘పొలంలో పనిచేసుకుంటున్నప్పుడు తుపాకీ పేల్చిన శబ్దం వినిపించింది. అప్పుడు రాత్రి 8గం.లు అయి ఉండవచ్చు,'' అన్నాడు విరోన్‌ బూహెర్‌ బెరుకుబెరుగ్గా.
 
ఇన్‌స్పెక్టర్‌ లాంగేకర్‌ ఫార్‌‌మ యజమాని కేసి తిరిగి, ‘‘మిస్టర్‌ హెన్రీ, తుపాకీగుళ్ళ శబ్దం మీ కేవీ వినిపించ లేదా? ఇంట్లో కనిపించకుండా పోయినవి ఏవైనా ఉంటే చెప్పండి,'' అన్నాడు.

మా ఫార్మ చాలా పెద్దది. మీరే చూశారు కదా? పొలం చివర పనిచేసుకుంటున్నాను. అందువల్ల ఆ శబ్దం నా చెవిన పడలేదు. ఇంట్లో దొంగ తనం ఏదీ జరిగినట్టు అనిపించడం లేదు. నా భార్య వేలికి పెట్టుకున్న డైమండ్ ఉంగరం కూడా అలాగే ఉంది, అన్నాడు హెన్రీ బూహెర్.
 
మాకు ఫార్మలో సాయపడడానికి మరొక మనిషి కూడా ఉన్నాడు. వాడి పేరు రోసిక్. వాడి జాడ కనిపించడం లేదు. వాడు దోషి అయి ఉంటాడేమో, అన్నాడు విరోన్.
 
నలుగురూ కలిసి ఫారమ్ అంతా వెతికారు. ఒక గాదెలో రోసిక్ కనిపించాడు. అయితే, వాడూ గుండెల్లోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయిన కారణంగా చచ్చి పడివున్నాడు. హతులైన వాళ్ళల్లో వాడు నాలుగోవాడు.
 
ఈ హత్యలు ఎవరు చేసి వుంటారో, మీ కెవరి మీదయినా అనుమానం ఉందా? అని అడిగాడు డిటెక్టివ్ లెస్లీ. నాకు తెలిసిన మటుకు మాకెవరూ శత్రువులు లేరు. ఇరుగు పొరుగు అంతా నా భార్య పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కనబరచేవాళ్ళు, అన్నాడు హెన్రీ బూహెర్ గద్గద స్వరంతో. దర్యాప్తు ఆరంభయింది. కొత్తవాళ్ళ వేలిముద్రలు ఏవీ ఎక్కడా కనిపించలేదు. ప్రాంగణంలో ఎక్కడా బుల్లెట్ షెల్స్ దొరకలేదు.
 
అయితే ఒక్కటి మాత్రం నీళ్ళ గిన్నెలో పడివుంది. ఇది చాలా ముఖ్యమైన క్లూ. దాని ద్వారా హత్యలు చేయడానికి హంతకుడు ఉపయోగించిన ఆయుధం 303 తుపాకీ అని తెలియవచ్చింది. అది ఎక్కడవున్నది? ఎంత వెతికినా తుపాకీ ఆచూకీ తెలియలేదు. అధికారులూ, డిటెక్టివ్�లూ పెద్ద చిక్కులో పడ్డారు. సంప్రదాయ పద్ధతులన్నిటి ద్వారా దోషిని పట్టుకోలేక పోవడంతో, సంప్రదాయేతర మార్గాల ద్వారా ప్రయత్నించాలని, పోలీస్ ఛీప్ మైక్ గై…యర్ నిర్ణయించాడు. ఇటీవల విన్న ఒక పెద్దమనిషి కోసం కబురు చేశాడు.
 
ఆయనకు అసాధరణ శక్తులు ఉన్నాయని చెబుతున్నారు. మరునాడే ఆ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. పొట్టిగా వున్న ఆయన టోపీ పెట్టుకుని ఉన్నాడు. నడిచేప్పుడు ఆయన చేతిలోని గొడుగుతో నేలను తడుతూ వెళతాడు. ఆయన పేరు డా. మాక్సమీలియన్ ల్యాంగ్సనర్. వియన్నా నుంచి వచ్చాడు. వాతావరణంలో వచ్చే మార్పులనూ, రానున్న అపాయాలనూ ముందుగానే పసిగట్టే అద్భుతమైన సహజశక్తి ఎస్కిమోలకు ఉందని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఎస్కిమోలకు ఉన్న అసాధారణమైన ఆ సహజశక్తి సామర్థ్యాలను గురించి, వారి మనసుల మీద అధ్యయనం చేయడానికి ఆయన కెనడా వచ్చాడు.

ఈ హత్యల వెనక వున్న రహస్యాన్ని ఛేదించడానికి డా.మాక్��సమీలియన్� లాంగ్��సనర్� నిజంగానే సాయపడగలడా? ఆయనకు ఈ హత్యల గురించి వివరించారు. ఆ తరవాత ఆయన ఒక్కొక్క సాక్ష దగ్గరా నింపాదిగా విచారణ జరిపాడు.
 
కోర్టుగది జనంతో కిటకిటలాడుతోంది. బూహెర్� కుటుంబంలో ప్రాణాలతో మిగిలివున్న ఇద్దరు సభ్యులూ, వాళ్ళ పొరుగు చార్లెస్� స్టీవెన్సన్� కూడా అక్కడే ఉన్నారు.
 
��మిస్టర్� స్టీవెన్సన్�, నీ దగ్గర ఏదైనా తుపాకీ ఉండేదా?�� అని ప్రశ్నించాడు న్యా…యవాది.
 
��నా దగ్గర ఒకటి ఉండేది. కాని అది దొంగిలించబడింది. అది ఒక .303 తుపాకీ. హత్య చేయడానికి ఉపయోగించిన తుపాకీలాంటిదే అది,�� అని సమాధానమిచ్చాడు స్టీవెన్సన్�.
 
��అది మీ ఇంటి నుంచి ఎప్పుడు దొంగిలించ బడిందో చెప్పగలరా?��
 
��గత ఆదివారం. ఆ సమయంలో నేను చర్చిలో ఉన్నాను. చర్చికి బయలుదేరే ముందు కూడా దానిని చాశాను,�� అని సమాధాన మిచ్చాడు స్టీవెన్సన్�.
 
ఆ రోజు, అదే సమయంలో చర్చిలోనే ఉండడం వల్ల, హెన్రీ, విరోన్� బూహెర్�లు కూడా తుపాకీని గురించి తమకేదీ తెలియదన్నారు.
 
కోర్టు నుంచి తిరిగి వచ్చాక, పోలీస్� అధికారి మైక్� గైయర్�, డా. మేక్సిమీలియన్� కేసి చూశాడు. ఆయన చిన్నగా నవ్వాడు.
 
��మిమ్మల్ని చూస్తూంటే, ఇప్పటికే మీకు అసలు రహస్యం తెలిసిపోయినట్టుంది,�� అని అడిగాడు పోలీస్� అధికారి.
 
అవును, హంతకుణ్ణి కనిపెట్టేశాను. వాడిపేరు విరోన్ బూహెర్! అన్నాడాయన గంభీరంగా. అక్కడ ఉన్నవాళ్ళందరూ దిగ్భ్రాంతి చెందారు.
 
అమ్మ అంటే అమితమైన ఆప్యాయత కనబరచే ఆ యువకుడు ఎలా అలాంటి ఘోరకృత్యానికి పాల్పడ్డాడు? దానికేమైనా ఆధారాలున్నాయా?
 
డా. మాక్��సమీలి…యన్� మళ్ళీ చిన్నగా నవ్వి, ��ఆధారాలు లేవుగాని నా మాట ముమ్మాటికీ నిజం. విరోన్� బూహెర్� కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు, వాడి మనసులో కదిలే భావాలను పసిగట్టి, నేనువాడి ఆలోచనా స్రవంతి వెంట వెళ్ళాను. వాడు తన నేరం బయటపడిపోతుందో ఏమో నన్న భయంతో లోలోపల గడగడా వణికి పోసాగాడు,�� అన్నాడు.
 
��అంటే, కనిపించకుండా పోయిన తుపాకీ గురించేనా వాడి భయం? మరి ఇప్పుడది ఎక్కడుందో మీరు చెప్పగలరా?�� అని అడిగాడు డిటెక్టివ్�.

��చెప్పగలను. చార్లెస్� స్టీవెన్సన్� పోయిన తన తుపాకీని గురించి చెబుతూన్నప్పుడు విరోన్� బూహెర్� తుపాకీని గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆ ఆలోచనలను బట్టి, వాడా తుపాకీని ఎక్కడ దాచాడో కూడా చెప్పగలను,�� అన్నాడు డా. మేక్��సమీలియన్�.
 
��దయచేసి చెప్పండి,�� అన్నాడు ఇన్�స్పెక్టర్� లాంగేకర్�.
 
డా. మాక్��సమీలియన్� కాస్సేపు కళ్ళు మూసుకున్నాడు. ఆ తరవాత ప్రశాంతమైన కంఠస్వరంతో, ��బూహెర్� ఇంటి వెనక గడ్డి వాములో తుపాకీ దాచబడివుంది. అస్తమిస్తూన్న సూర్యుణ్ణి చూడగలుగుతున్నాను గనక, అది పశ్చిమ దిశలో వుందని రూఢిగా చెప్పగలను,�� అన్నాడు.
 
తుపాకీ కనుకొనబడింది. దాని మీది వేలిముద్రలను పరీక్షకు పంపారు. విరోన్� బూహెర్�ను ఎడ్మంటన్� జైల్లో బంధించారు. వాడు నిజంగానే దోషి అయినప్పటికీ, న్యాయస్థానంలో రుజువు చేయడానికి తగిన సాక్ష్యాధారాలు లేకపోయాయి.
 
ఆదివారం స్టీవెన్సన్� ఇంటి నుంచి తుపాకీ దొంగిలించబడినప్పుడు, విరోన్� బూహెర్�, హెన్రీ బూహెర్�, చార్లెస్� స్టీవెన్సన్� ముగ్గురూ చర్చిలోనే ఉన్నారు. మరి తుపాకీని ఎవరు దొంగిలించారు?
 
డా. మాక్��సమీలియన్�, విరోన్� బూహెర్�ను కలుసుకోవాలన్నాడు. ఆయనకు అనుమతి లభించింది. జైలు గదిముందు కుర్చీలో కూర్చున్నాడు. ఒకరినొకరు చూసుకున్నారే తప్ప ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదు. విరోన్� ఇబ్బందిగా ముఖం తిప్పేసుకుని, వెనక్కు తిరిగి కూర్చున్నాడు. అయితే డా. మాక్��సమీలియన్� మాత్రం మౌనంగా అతడి కేసి చూస్తూ అరవై నిమిషాలసేపు గడిపాడు. ఆ తరవాత ఆయన లేచి వాడికి వీడ్కోలు చెప్పాడు. వాడి నుంచి ఎలాంటి ప్రతిస్పందనా లేదు.
 
��విరోన్� బూహెర్� దోషి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వాడు మొదట తల్లిని హత్యచేశాడు. ఆ తరవాత సాక్ష్యాలుగా మిగలగలరన్న భయంతో తన సోదరుణ్ణీ, ఇద్దరు పనివాళ్ళనూ ఒక్కొక్కరిగా కాల్చిచంపాడు. వాడు తల్లిని ద్వేషించడానికి కారణం ఏమిటో నేను ఇప్పుడు చెప్పలేను,�� అన్నాడు డా. మాక్��సమీలియన్�.
 
��మీ మాటలు అక్షరరాలా నిజం. అయితే దానిని రుజువు చేయడం ఎలా?�� అన్నాడు పోలీస్� అధికారి మైక్� గైయర్�.
 
డా. మాక్��సమీలియన్�, ��ఆ ఆదివారం స్టీవెన్సన్� చర్చిలో ఉన్నప్పుడు, విరోన్� ఆయన తుపాకీని దొంగిలించాడు,�� అని నిట్టూర్చి, ��నిజానికి విరోన్� కూడా ఆరోజు చర్చిలోనే ఉన్నాడు. రహస్యంగా అక్కడి నుంచి జారుకుని, పనిపూర్తి చేసుకుని మళ్ళీవచ్చి తన స్థానంలో కూర్చున్నాడు

గుండ్రని చిన్న కళ్ళతో, తలపై టోపీ పెట్టుకునివున్న ఒకేఒక్క స్ర్తీ మాత్రం వాడి కదలికలను గమనించింది,�� అన్నాడు.
 
అందరూ ఆయనకేసి మెచ్చుకోలుగా చూశారు. తను లేనప్పుడు జరిగిన ఇన్ని విశేషాలను ఇంత వివరంగా ఆయన ఎలా చెప్పగలిగాడు? ��అది చాలా సులభం. నేను జైలుగదిలో విరోన్� ఎదుట కూర్చున్నప్పుడు అతడి ఆలోచనా ధోరణిని పసిగట్టి, దానిని అనుసరించి వెళ్ళి, అన్నింటినీ తెలుసుకున్నాను,�� అన్నాడు మాక్��సమీలియన్� తలపంకిస్తూ.
 
ఆయన వర్ణించిన స్ర్తీ కోసం వెతికి చూడమని పోలీసు అధికారి తన అనుచరులను పురమాయించాడు. డిటెక్టివ్� లెస్లీ కొంత సేపటికల్లా, హెర్మా హిగ్గిన్��స అనే ఒక స్ర్తీని వెంట బెట్టుకుని వచ్చాడు. మాక్��సమీలియన్� వర్ణించిన రూపంలో చాలా చురుగ్గా కనిపించిన ఆమె, ఆ ఆదివారంనాడు విరోన్� చర్చి నుంచి వెళ్ళడం, కొంతసేపటికి తిరిగిరావడం గమనించినట్టు చెప్పింది. నిందితుణ్ణి రప్పించారు.
 
��విరోన్�, చార్లెస్� స్టీవెన్సన్� తుపాకీ దొంగిలించబడిన రోజు, నువ్వు చర్చినుంచి వెళ్ళి, వెంటనే తిరిగి రావడం చూశాను. నువ్వు వెళ్ళి వచ్చిన మాట వాస్తవమే కదా?�� అని అడిగింది హెర్మా హిగ్గిన్��స. విరోన్� ఆమె కేసీ, చుట్టూ కూర్చున్న వాళ్ళకేసీ ఒకసారి పరిశీలనగా చూశాడు. గది అంతా నిశ్శబ్దం. టిక్�టిక్� మని గోడ గడియారం చప్పుడు మాత్రమే వినిపిస్తున్నది.
 
విరోన్� హఠాత్తుగా పోలీసు అధికారి దగ్గరికి వెళ్ళి, ఆయన చేతులు పట్టుకుని తన నేరాన్ని అంగీకరించి భోరున విలపించసాగాడు. అదొక విషాదగాథ. వాడు ఒక …యువతిని గాఢంగా ప్రేమించాడు. వాడి తల్లి అందుకు అడ్డు చెప్పడంతో, తల్లి పట్ల ద్వేషం పెంచుకున్నాడు. తల్లీ కొడుల మధ్య ఏర్పడిన చిన్న అభిప్రాయభేదమే ఈ విషాద ఘోర దుర్ఘటనకు దారితీసింది! ఒక సంవత్సరం తరవాత పట్టరాని దుఃఖంతో చూస్తూన్న తండ్రి ఎదుటే విరోన్� బూహెర్�ను ఉరితీశారు!
 
ఎదుటివారి మనసులలోని ఆలోచనా సరళిని పసిగట్టగలిగే అద్భుతశక్తి గల డా. మాక్��సమీలియన్� నిగూఢరహస్యాలను ఛేదించి, జటిలమైన కేసులను పరిష్కరించడానికి పోలీసు శాఖకు ఎంతగానో సాయపడ్డాడు. తనకున్న ఈ అసాధారణ పరేంగిత జ్ఞానాన్ని గురించి ఆయన ఎన్నడూ గొప్పలు చెప్పుకోలేదు. చివరి వరకు ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపాడు!

No comments:

Post a Comment