Pages

Friday, September 7, 2012

వృద్ధుడి సమయోచిత బుద్ధి!


స్కాట్లాండ్‌ అత్యద్భుత ప్రకృతి సౌందర్యం నిండిన అందమైన ప్రదేశం. దీనిని పల్లపు దక్షణ ప్రాంతం, ఎత్తయిన ఉత్తర ప్రాంతం అని రెండు ప్రధాన ప్రాంతాలుగా విభజిస్తారు.
 
ఎత్తయిన కొండలు, కోనలు, లోయలు, తటాకాలు, సరస్సులతో ఉత్తర ప్రాంతమంతా సహజ సుందరమైన ప్రకృతి దృశ్యాలతో అలరారుతున్నది. అయితే, ఇక్కడి భూములు మనిషికి ఏమాత్రం లొంగకుండా ప్రకృతిదే పైచేయిగా ఉంటోంది.
 
అయితే, ఇక్కడ కూడా ఒక మినహాయింపు ఉంది. లాక్‌ షీల్‌ అనే సరస్సు తీరం నుంచి లోపలికి వెళితే, రెండు కొండల మధ్య ఇరుకైన కోన ఒకటి తారస పడుతుంది. మిగిలిన కోనలన్నీ, రాళ్ళూ రప్పలతో ఎగుడు దిగుడుగా ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ ఇది ఒక్కటి మాత్రం చదునైన భూమితో చాలా మృదువుగా కనిపిస్తుంది. ఇదెలా సాధ్యమయింది అనే ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో వుంది:
 
చాలా సంవత్సరాలకు పూర్వం ఈ బుల్లి కోన కూడా చుట్టుపక్కల కోనల్లాగే రాయిరప్పలతో, బీడు భూములతో, పెద్ద పెద్ద బండరాళ్ళతో నిండి ఉండేది. మనిషి అడుగుమోపడానికి సాధ్యపడేది కాదు. ఇక అక్కడ పైరుపచ్చల మాట సరేసరి. వ్యవసా…యం అసాధ్యంగా ఉండేది. అక్కడక్కడ ఉన్న చెక్కలలో పైరు పండించే రైతులు దుర్భర దారిద్య్రంతో బతికేవారు.
 
అక్కడ దొరికే చాలీ చాలని మేతతో పశువులు కూడా ఆకలితో అలమటిస్తూ చావలేక బతుకుతూ ఉండేవి. ఆ కోన మధ్యగా చిన్న కొండను ఆనుకుని చిన్న ఇల్లు ఒకటి ఉండేది. ఆ ఇంట్లో వివేకి అయిన ఒక వృద్ధుడు నివసిస్తూండేవాడు. ఆ…యన మంచి మంచి కథలు చెప్పడం వల్ల, ఆ…యన్ను అందరూ సి…యాన్‌ఛయిద్‌ అని పిలిచేవారు. ఆయనకు చాలా విష…యాలు తెలుసుననీ, ఏ సమస్యకైనా ఇట్లే పరిష్కారం చూపగలడనీ అందరూ భావించేవారు.

ఒకరోజు ఆ కోనలోని యువకులందరూ ఒక పెద్ద బండ పక్కన సమావేశమయ్యారు. తమ బతుకుల గురించి తీవ్రంగా చర్చించారు. ఇక్కడే వుండి ఇన్నాళ్ళు బావుకున్నది చాలు! ఇకపై కూడా ఈ దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ ఇక్కడే కాలం గడపడం అవివేకం. భూమి మృదువుగా ఉండే వేరొక మంచి ప్రదేశానికి వెళ్ళి పోవడం ఒక్కటే మార్గం అన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, అలాంటి ప్రదేశం ఎక్కడున్నదో వాళ్ళకు తెలియలేదు.
 
‘‘ఆ సంగతిని సియాన్‌ ఛయిద్‌ను అడుగుదాం,'' అన్నాడు ఒక యువకుడు. మంచి సలహా అని అందరూ కొండదిగి ఆ వృద్ధజ్ఞాని వద్దకు వెళ్ళి, ‘‘మన వంశంలోనే అందరికన్న మేము అతి పేదబతుకులు బతుకుతున్నాం. అందుకు మా ప్ర…యత్న లోపం కారణం కాదు. శ్రమపడడానికి సిద్ధంగా ఉన్నాం. కాని కష్ట పడడానికి పొలం చెక్కలేదు. కొండలపై నుంచి బండలు దొర్లి పడడం వల్ల వ్యవసాయం చేసుకోవడానికి భూమి కరువయింది. ఇక్కడి నుంచి వెళ్ళి పోవాలనుకుంటున్నాం. చుట్టుపక్కల పరిసరాలను గురించి బాగా ఎరిగిన తమరు వ్యవసా…యయోగ్యమైన భూమి ఎక్కడున్నదో చెప్పగలరా?'' అని అడిగారు.
 
సియాన్‌ఛయిద్‌ కొంతసేపు మౌనంగా ఆలోచించాడు. ఆ తరవాత నెమ్మదిగా కిందికి వంగి గుప్పిట నిండా మన్నును తీసి యువకులకు చూపుతూ, ‘‘ఇంతకన్నా సారవంతమైన మన్ను మరే కోనలోనూ లేదుకదా!'' అన్నాడు.
 
‘‘నిజమే కావచ్చు. కాని మన్ను మీద పరుచుకునివున్న బండలను తొలగించడం మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు కదా? ఆ శక్తి మాకెక్కడిది?'' అని అడిగారు …యువకులు.
 
సియాన్‌ఛయిద్‌, ‘‘అలాగా!'' అంటూ తలపంకించి, ‘‘మీ సమస్యను పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తాను. కొన్ని రోజులు ఓపిక పట్టండి,'' అన్నాడు. ఆ కాలంలో భూమి మీద రాక్షసులు ఉండేవారు.

కోనకు ఆను కుని వున్న కొండ మీదా, దానికి ఆవలా భయంకరులైన ఇద్దరు రాక్షసులు తమలో ఎవరు బలవంతులో తేల్చుకోవడానికి తరచూ ద్వంద్వ యుద్ధం చేస్తూండేవారు. ఆ సంగతి తెలిసిన సియాన్‌ఛయిద్‌ మెల్లగా అక్కడికి వెళ్ళాడు. ఆ సమయంలో రాక్షసులు ఇద్దరూ గొడవపడుతున్నారు. సియాన్‌ఛయిద్‌ వాళ్ళను సమీపించి, ‘‘ఇలా గొడవపడుతూంటే మీ సమస్య ఎప్పటికీ తీరదు,'' అన్నాడు.
 
రాక్షసులు పోట్లాట ఆపి, వృద్ధుడి కేసి మరి ఏం చేయమంటావు? అన్నట్టు కోపంగా చూశారు.
 
‘‘నేను చాలా ముసలివాణ్ణి. కాని మీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలననే భావిస్తున్నాను. మీరిద్దరూ కొండదిగి మా కోనలోకి రండి. అక్కడ నేను మీ బలాబలాలను నిరూపించడానికి ఒక మార్గం చెబుతాను. దాంతో మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో అందరి సమక్షంలో తేలిపోతుంది,'' అన్నాడు.
 
రాక్షసులు సరేనన్నారు.
 
మరునాడు తెల్లవారగానే కొండ దద్దరిల్లేలాగా అడుగులు వేసుకుంటూ రాక్షసులు ఇద్దరూ కోనకు వచ్చారు. సియాన్‌ఛయిద్‌, కోనలోని ప్రజలు వాళ్ళను సంబరంతో ఆహ్వానించారు.
 
సియాన్‌ఛయిద్‌, వాళ్ళను సమీపించి, ‘‘ఇప్పుడు, మీ ఇద్దరిలో ఎవరు ఈ చిన్నరాతిని దూరంగా ఉన్న కొండశిఖరం మీదికి విసరగలరో చూద్దామా,'' అంటూ ఒక బండనూ దూరంగా ఉన్న కొండశిఖరాన్నీ చూపాడు.
 
ఇద్దరు రాక్షసులూ దిక్కులు పిక్కటిల్లేలా నవ్వారు. ఇద్దరూ ఒక్కసారిగా వంగి, పెద్ద పెద్ద బండరాళ్ళను అందిపుచ్చుకుని, గులక రాళ్ళను విసిరినట్టు దూరంగా విసిరికొట్టారు. అవి పడిన చోటు కూడా తెలియనంత దూరంలో పడ్డాయి.
 
‘‘ఆహా! గొప్పగా విసిరారు! మీ ఇద్దరూ కూడా అమిత బలశాలురే. అందులో అణుమాత్రం సందేహం లేదు. అయితే, ఇద్దరిలో ఎవరు ఎక్కువ వేగంతో విసిరారో నిర్ణయించలేక పోతున్నాను. ఏదీ మరొక్కసారి మరి రెండు బండలను విసరండి చూద్దాం. అయితే వాటికన్నా కొద్దిగా పెద్దగా ఉన్న బండలను తీసి విసరాలి మరి,'' అన్నాడు వృద్ధుడు.
 
మరుక్షణమే ఇద్దరు రాక్షసులూ వందలాది మందిసైతం కదిలించలేని బ్రహ్మాండమైన బండను సునాయాసంగా ఎత్తి ఆవలికి విసిరి కొట్టారు. దానిని చూసిన కోన ప్రజలు ఆశ్చర్యంతో హర్షధ్వా నాలు చేశారు.

అయితే సియాన్‌ఛయిద్‌ మాత్రం కొంతసేపు మౌనంగా ఊరుకుని ఆ తరవాత చాలా గంభీరంగా, ‘‘మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో ఈ పరీక్షతో తేల్చడం కష్టం. వేరొక పరీక్ష ఆలోచించాను. నేల మీద రకరకాల చిన్నా పెద్దా బండలు ఉన్నాయి చూశారు కదా? ఆ బండరాళ్ళను మీ ఇద్దరిలో ఎవరెవరు ఎడమ చేత్తో ఎన్నెన్ని రాళ్ళు, కుడిచేత్తో ఎన్నెన్ని రాళ్ళు విసిరి కొట్టగలరో చూద్దాం. ఎవరు ఎక్కువ రాళ్ళు విసురుతారో, వాళ్ళే అధిక శక్తివంతులన్న మాట!'' అన్నాడు.
 
 అంతే. ఇద్దరు రాక్షసులూ క్షణంలో కార్యరంగంలోకి ఉరికారు. ఎడంచేత్తో అందిన బండలను అందినట్టు శరవేగంతో ఆవలి కొండకేసి విసిరికొట్టడం ప్రారంభించారు. బండలు గాలిలో ఎగురుతూన్నప్పుడు భయంకరమైన శబ్దాలు పుట్టాయి.
 
బండలను ఎత్తి విసిరి విసిరి ఎడమ చేతుల్లో సలుపు పుట్టగానే, కుడిచేతులతో బండలను పెకలించి విసిరి కొట్టసాగారు. అలా కోనలోని బండలన్నిటినీ విసిరి కొట్టేసరికి సూర్యాస్తమయం కాసాగింది. దరిదాపుల్లో బండ అన్నది కనిపించలేదు. రాక్షసులు కూడా బాగా అలిసిపోయి నిలబడలేక అలాగే కూలబడ్డారు.
 
సియాన్‌ ఛయిద్‌ వాళ్ళను సమీపించి, ‘‘మీరు విసిరిన రాళ్ళను సరిగ్గా లెక్కించలేకపోవడం వల్ల మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులో ఇంకా నిర్ణయించలేక పోతున్నాం. కాబట్టి మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళి, మీరు విసరగా అత్యధిక దూరంలో పడిన బండను వెతకండి. అది కనిపించగానే దానిని మా దగ్గరికి తీసుకురండి. ఆ తరవాత మీలో ఎవరు దానిని మళ్ళీ అంత దూరానికి విసరగలరో పరీక్ష పెడతాం. అప్పుడే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులో నిర్ణయించడం సాధ్యమవుతుంది,'' అన్నాడు.
 
దూరంగా పడిన రాయిని వెతుక్కుంటూ ఇద్దరు రాక్షసులూ అక్కడి నుంచి బయలుదేరారు. బలాబలాలను తేల్చుకోవాలన్న మూర్ఖపు పట్టుదలతో పోరాడుతున్న తమ బలాన్ని సియాన్‌ ఛయిద్‌, తెలివిగా ఉపయోగించుకున్నాడన్న సంగతిని ఇద్దరు రాక్షసులూ చివరి వరకూ గ్రహించలేక పో…యారు. ఆ తరవాత వాళ్ళు కోనకు తిరిగి రాలేదు గనక, తాము విసిరిన రాయి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారని జనం చెప్పుకుంటారు. తూర్పు వైపుగా గాలి వీచేప్పుడు పోట్లాడుకుంటూ రాక్షసులు చేసే భీకర ధ్వనులు వినిపిస్తా…యని కూడా చెప్పుకుంటారు.
 
వివేకవంతుడైన సి…యాన్‌ఛయిద్‌ సమ…యస్ఫూర్తి కారణంగా, రాళ్ళూ రప్పలు నిండిన కోన వ్యవసాయ యోగ్యమైన భూమిగా మారింది. రైతుల శ్రమఫలితంగా ఇవాళ ఉత్తర స్కాట్లాండ్‌లో లాక్‌షీల్‌ సరస్సు సమీపంలోనిఆ కోనలో పండని పంట అంటూ ఏదీ లేదు!

No comments:

Post a Comment