స్వామినాథుడికి, తన ఇరవయ్యేళ్ళ వయసులో అనుకోకుండా,
తల్లిదండ్రులిరువురూ అకాల మరణానికి గురవ్వడంతో, వాళ్ళు సంపాదించిన ఆస్తికి
అతడు ఏకైక వారసుడయ్యాడు.
స్వామినాథుణ్ణి చిన్నప్పటి నుంచీ అతని తల్లిదండ్రులు ఏ కష్టమూ
తెలి
యకుండా గారాబంగా, ప్రేమగా పెంచడం వలన, అతనికి కష్టపడి పని చేసి డబ్బు
సంపాదించడం అంటే ఏమిటో తెలి
యదు.
అయితే, స్వామినాథుడు బుద్ధిమంతుడు, సాధుహృదయం కలవాడు. ఎవరేమి అన్నా
అతిగా చలించి బాధపడే అతి సున్నితమైన మనసు అతనిది. నిజానికి అతను, తన
తల్లిదండ్రులను అమితంగా ప్రేమించాడు. అందుకే వాళ్ళ మరణాన్ని
భరించలేకపోయాడు.
క్రమంగా నిద్రాహారాలను మానివేసి పగలూ రేయీ వాళ్ళను తలచుకుంటూ
కుమిలిపోతూ కాలం గడపసాగాడు. అతడి బంధువులు, స్నేహితులు అతనికి ఎన్నో
విధాలుగా నచ్చజెప్ప చూశారు. జీవితం చాలా విలువైందనీ, పొద్దస్తమానం
పోయినవాళ్ళ కోసం దుఃఖిస్తూ కూర్చున్నంత మాత్రాన వాళ్ళు తిరిగిరారనీ, వాళ్ళ
ఆత్మలకు సంతృప్తి కలగాలంటే, జీవితంలో పైకి వచ్చి చక్కగా సంసార జీవితం
గడపాలనీ వాళ్ళు బోధించారు.
కానీ, స్వామినాథుడు ఎవరి మాటా వినలేదు. అలాంటి సమయంలో, కొందరు
స్వార్థపరులూ, అవకాశవాదులైన
యువకులు అతనికి కల్లబొల్లి మాటలు చెప్తూ
దగ్గరై అతన్ని మభ్యపెట్టి, అతని ద్వారా తమ అవసరాలకు డబ్బు విపరీతంగా
ఖర్చుచేయించసాగారు.
ఇలా వుండగా, రామదాసు అనే ఒకాయన స్వామినాథుడి ఇంటికి ఒక రోజున వచ్చాడు.
స్వామినాథుడాయన్ను ఎగాదిగా చూసి, ‘‘మీరెవరు? ఏం పని మీద వచ్చారు?'' అని
అడిగాడు.
ఆ ప్రశ్నకు రామదాసు చిరునవ్వు నవ్వి, ‘‘నేను నీకు దూరపుబంధువును,
వరసకు బాబాయినవుతాను, నా
యనా! మాది రామనగరం. నీ పరిస్థితి తెలిసి,
చూసిపోదామని వచ్చాను,'' అన్నాడు.
ఆ జవాబు వింటూనే స్వామినాథుడు, తన తల్లిదండ్రుల గురించి చెప్పి, ఏడవనారంభించాడు.
‘‘ఊరుకో నాయనా! నీ దుఃఖం తీరే మార్గం నేచెబుతాను, నా మాట వింటావా మరి?'' అన్నాడు రామదాసు.
స్వామినాథుడు కళ్ళు తుడుచుకుంటూ, ‘‘అలాగే చెప్పండి!'' అన్నాడు.
‘‘ఇక్కడ ఉంటే నీకు పాతజ్ఞాపకాలతో మనశ్శాంతి వుండదు. నాతో పాటు మా
ఊరికి రా! అక్కడ ఒక పెద్ద భవంతి అమ్మకానికి వచ్చింది. ఎంతో హాయిగా
ఉండవచ్చు,'' అన్నాడు రామదాసు.
మర్నాడు ఇద్దరూ రామదాసు ఊరైన రామనగరానికి బ
యల్దేరారు. భవనం చౌకగా
వస్తుందనీ, వెంటనే కొనడం బావుంటుందనీ రామదాసు చెప్పడంతో, స్వామినాథుడు చాలా
పెద్దమొత్తం డబ్బుతో బయల్దేరాడు.
వాళ్ళెక్కిన గురప్రు బండి, ఇంకా రామనగరానికి కోసెడు దూరంలో వుందనగా,
హఠాత్తుగా నలుగురు దొంగలు బండిని అటకాయించి, కత్తులతో రామదాసునూ,
స్వామినాథుణ్ణీ బెదిరించి డబ్బు దోచుకుని పారిపోయారు.
స్వామినాథుడు నెత్తీ నోరూ బాదుకుంటూ కళ్ళనీళ్ళతో, ‘‘ఏమిటి, బాబాయ్, ఈ
ఘోరం!'' అంటూ వున్నచోటునే కూలబడ్డాడు. రామదాసు, అతణ్ణి లేవనెత్తి ధైర్యం
చెబుతూ, ‘‘అంతగా విచారించకు!'' అని బండిని తిరిగి స్వామినాథుడి ఊరికి
ప్రయాణం కట్టించాడు.
ఇప్పుడు స్వామినాథుడికి ఆస్తిపాస్తులంటూ ఒక ఇల్లు తప్ప మరేం లేదు. ఆ ఇల్లు అమ్మాలన్న ఆలోచన అతడికి రాలేదు.
ఇల్లు అమ్ముకుంటే, తనకు నిలవ నీడ ఉండదని, అతనికి తెలుసు. ఇప్పుడు
అతనికి పట్టిన దిగులు ఎలా బ్రతకాలి? ఎలా డబ్బు సంపాదించాలన్నదే! రామదాసు,
అతడికి అంతగా విచారపడవద్దని చెప్పి, ‘‘స్వామినాథా! నేను మా ఊరికి పోయి కొంత
డబ్బు తెస్తాను.
దానితో కొంత వ్యవసాయయోగ్యమైన పొలం నీ కోసం కొంటాను. అలా వ్యవసాయం
చేసుకుంటూ నువ్వు బ్రతకవచ్చు. కొంత కాలం పాటు నేనూ, నీకు తోడుగా ఇక్కడే
ఉంటాను,'' అన్నాడు.
అన్న మాట ప్రకారం, రామదాసు డబ్బు తెచ్చాడు. అమ్మకానికి ఊరు దగ్గర్లో
వున్న పొలాన్ని గ్రామాధికారి సా
యంతో కొన్నాడు. అందులో, రామదాసుతో పాటు
స్వామినాథుడు కూడా పగలూ, రాత్రీ అని చూడకుండా కష్టపడి పని చేయసాగాడు.
వంటపనులూ, ఇతరత్రా ఇంటిపనుల్లో కూడా, ఇద్దరూ శ్రమిస్తూండేవాళ్ళు.
ఒకనాటి సాయంకాలం వేళ, వాళ్ళిద్దరూ వంట పనుల్లో నిమగ్నమై ఉండగా,
గ్రామాధికారి కూతురు పదిహేడేళ్ళ గౌరి అక్కడికి వచ్చి, వాళ్ళను చూస్తూనే
ఆశ్చర్యంగా, ‘‘అయ్యో! ఈ వంటా వార్పుల్లో, మగవాళ్ళు మీరు చేయి
కాల్చుకుంటున్నారా? ఎవరో చెప్పగా, మా నాన్న పంపాడు. రేపటి నుంచీ మా
వంటమనిషి చెల్లెల్ని మీ వంట పనులూ అవీ చేసేందుకు పంపుతాను,'' అని ఇంటిలోని
అన్ని గదులూ తిరిగి చూసి వెళ్ళిపోయింది.
సంవత్సరం గడవకుండానే పొలాల్లో వరి బాగా పండింది. స్వామినాథుడూ,
రామదాసూ ధాన్యాన్ని బస్తాల్లో నింపి, బళ్ళమీద ఇంటికి చేర్పించారు.
స్వామినాథుడి ఆనందానికి అవధుల్లేవు. అది గమనించిన రామదాసు, ఆప్యాయంగా అతడి
భుజం తట్టి, ‘‘స్వామినాథా! నీలో వచ్చిన మార్పు నువ్వు గమనించావనుకుంటాను.
ఆరేడు నెలల కాలంగా నువ్వు నీ తల్లిదండ్రుల గురించి విచారపడుతూండడం
మానేశావు. పోయిన డబ్బు గురించీ, నీ భావిజీవితం గురించే ఆందోళన పడ్డావు,''
అన్నాడు.
‘‘అవును, నిజమే!'' అన్నాడు స్వామినాథుడు ఆశ్చర్యపోతూ. దానికి రామదాసు
తృప్తిగా తలాడించి, ‘‘ఇదే జీవితమంటే! మనిషికి అన్నింటికంటే ముఖ్యమైన అవసరం
ఆకలి తీరడం. కడుపు నిండా తిని, అన్నీ అమరినప్పుడు అనవసరమైన ఆలోచనలతో
కాలాన్ని వ్యర్థం చేసుకుంటాము. అందుకే, మనిషి ఎప్పుడూ ఏదో ఒక పని
చేస్తూండాలి. డబ్బు సంపాదిస్తుండాలి. తను బాగుపడి ఇతరులకు సాయపడాలి.
అప్పుడు ఏ దుఃఖమూ దరిచేరదు,'' అన్నాడు. ‘‘అవును బాబాయ్!'' అన్న
స్వామినాథుడితో మళ్ళీ, ‘‘ఇప్పుడు నీకు విడమరచి చెప్పవలసిన చిన్న రహస్యం
ఉన్నది. నేను నీకు దూరపు బంధువైనట్టే, గ్రామాధికారి గంగరాజు కూడా నాకు
దూరపు బంధువే. మీ నాన్న అంటే ఆయనకు చాలా అభిమానం. నువ్వు తల్లిదండ్రులు
పోయారన్న దుఃఖంతో పాటు స్వార్థపరుల గుప్పిట్లో చిక్కుకున్నావని తెలిసిన
గంగరాజు, నాకు, నీ గురించిన అన్ని విషయాలు మనిషి ద్వారా కబురంపాడు. నేను
వెంటనే బయలుదేరి వచ్చాను. మనం మా ఊరుకు వెళుతున్నప్పుడు బండినాపి డబ్బు
దోచుకుపోయినవాళ్ళు దొంగలు కాదు, ఆయన నియమించిన మనుషులు. ఆ డబ్బు ఆయన దగ్గర
నిక్షేపంలా ఉన్నది.
ఆయన కూతురు గౌరిని చూశావు గదా, వంట మనిషిని పంపి, మనకు చాలా సా
యం
చే
యడమేగాక, ఆ వంటకాలెలా ఉన్నాయి అని అప్పుడప్పుడూ వచ్చి చూసిపోతున్నది
కూడా!'' అంటూ ఓ క్షణం ఆగి, ‘‘తెలియకడుగుతాను, ఇంతకీ ఆ గౌరిని గురించి
నీవేమనుకుంటున్నావు?'' అని అడిగాడు రామదాసు.
‘‘చక్కని అమ్మాయి, చురుకైన అమ్మాయి, చాలా కలుపుగోలున్న పిల్ల,'' అన్నాడు స్వామినాథుడు, ఆ మాటలనేందుకు మొహమాటపడుతున్నట్టు.
ఆ జవాబుకు రామదాసు పెద్దగా నవ్వి, ‘‘గంగరాజు తన కూతురు గౌరి గురించి
నీ అభిప్రా
యం ఏమిటో తెలసుకునేందుకు చాలా కుతూహలపడుతున్నాడు, ఇప్పుడు
తెలిసింది! నీకు గౌరి నచ్చింది. గౌరికి నీవు నచ్చావు. ఈ సంగతి గంగరాజుకు
చెబుతాను. సాధ్యమైనంత త్వరలో మంచి ముహూర్తం చూసి గౌరితో నీ వివాహం
జరుగుతుంది!'' అన్నాడు.
ఆ తర్వాత కొద్ది రోజులకు గౌరీ, స్వామినాథుల వివాహం ఘనంగా జరిగింది.
రామదాసు తరచుగా వచ్చి చూసి పోతానని స్వామినాథుడికి చెప్పి, సంతోషంగా తన ఊరు
వెళ్ళిపో
యాడు.
No comments:
Post a Comment